Captain Smit Machchhar Braveheart.. సినిమాల్లో సూపర్ హీరో పాత్రల్ని చాలానే చూస్తుంటాం. స్పైడర్ మ్యాన్, బ్యాట్ మేన్, హీ మ్యాన్, శక్తిమాన్.. చెప్పుకుంటూ పోతే చాలానే.!
పిల్లల్ని మాత్రమే కాదు, పెద్దల్ని కూడా అలరిస్తుంటాయి ఈ పాత్రలు. కానీ, ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది ‘రియల్ హీరో’ గురించి.!
నాట్ జస్ట్ రియల్ హీరో.! ది న్యూ గ్లోబల్ సూపర్ హీరో గురించి మనం తెలుసుకోబోతున్నాం. నిన్న మొన్నటిదాకా ఆయనో సాధారణ పైలట్ మాత్రమే.
కానీ, ఇప్పుడు ప్రపంచం ఆ పైలట్‌ని ప్రపంచమంతా కొనియాడుతోంది. ఆ పైలట్ మన భారతీయుడు కావడం మనందరికీ గర్వకారణం.
వివిధ దేశాలకు చెందిన అధినేతలు కూడా, మన పైలట్ ధైర్య సాహసాల్ని మెచ్చుకుంటున్నారంటే, ఆషామాషీ వ్యవహారం కాదిది.
Captain Smit Machchhar Braveheart.. గాల్లో గొడవ.. 174 మంది ప్రాణాల్ని కాపాడిన పైలట్..
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కి ‘ఫ్లై దుబాయ్’ విమానం వెళుతోంది. ప్రయాణీకులంతా, తమ ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.
వున్నపళంగా, సహ పైలట్ ఆ విమానాన్ని కూల్చేయడానికి ప్రయత్నించాడు. విషయం అర్థమయిన వెంటనే, పైలట్ స్మిత్ మచ్చర్, చాకచక్యంగా వ్యవహరించారు.
గొడవ జరిగింది.. పైలట్లిద్దరూ తలపడ్డారు. పైలట్ స్మిత్ మచ్చర్ మీద కో-పైలట్ దాడి చేశాడు. చంపేద్దామనుకున్నాడు. చంపేసి, విమానాన్ని కూల్చెయ్యాలన్నది కో-పైలట్ ఉద్దేశ్యం.

రక్తమోడుతూనే పైలట్ స్మిత్ మచ్చర్, కో-పైలట్‌ని నిలవురించాడు. కాక్‌పిట్ డోర్స్ తెరిచాడు. దాంతో, విమానంలోని ఇతర సిబ్బంది అప్రమత్తమయ్యారు.
ప్రయాణీకులతో కలిసి, విమాన సిబ్బంది కో-పైలట్‌ని గట్టిగా పట్టుకున్నారు. దాంతో, పెద్ద ప్రమాదం తప్పింది.
కత్తి పోట్లకు రక్తస్రావం జరుగుతుండడంతో, పైలట్ స్మిత్ మచ్చర్‌కి విమాన సిబ్బంది ప్రాథమిక వైద్య చికిత్స అందించారు.
అంతటి బాధలో కూాడా విమానాన్ని అత్యంత సురక్షితంగా ల్యాండ్ చేయగలిగాడు కెప్టెన్ స్మిత్ మచ్చర్.
ప్రపంచం మెచ్చిన సూపర్ హీరో..
ఇజ్రాయెల్, అమెరికా సహా.. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు సంబంధించిన అధినేతలు కెప్టెన్ స్మిత్ మచ్చర్ వీరోచిత పోరాటాన్ని అభినందిస్తూ సందేశాలు విడుదల చేశారు.
ప్రస్తుతం దుబాయ్‌లోని ఓ ఆసుపత్రిలో కెప్టెన్ స్మిత్ మచ్చర్ వైద్య చికిత్స పొందుతున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ని ‘హీరో’ అని కొనియాడారు.
కెప్టెన్ స్మిత్ మచ్చర్ సాహసోపేతమైన పోరాటాన్ని చూసి భారత దేశం గర్విస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడ్డారు.
కెప్టెన్ స్మిత్ మచ్చర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చూస్తున్నారు కదా.. వెండితెరపై ‘సూపర్ హీరో’ పాత్రలన్నీ, రియల్ లైఫ్ సూపర్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కి వంగి వంగి ఎలా సలాం చేస్తున్నారో.!
దీన్ని ఎవరు క్రియేట్ చేశారోగానీ, కెప్టెన్ స్మిత్ మచ్చర్.. ఈ గౌరవానికి పూర్తిస్థాయిలో అర్హుడు.
