Table of Contents
Hitman Rohit Century Celebrations.. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మళ్ళీ సెంచరీ కొట్టాడు. ఈసారి వెస్టిండీస్ పైన.!
ఫలితం, టీమిండియా ఘన విజయం.! మరోపక్క, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఏకంగా డబుల్ సెంచరీ బాదేశాడు.!
శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ వెరీ వెరీ స్పెషల్.! కానీ, అంతకన్నా ఎక్కువగా రోహిత్ శర్మ సెంచరీని, క్రికెట్ అభిమానులు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.
సెంచరీలేమన్నా కొత్తా రోహిత్ శర్మకి.? డబుల్ సెంచరీలు కూడా బాదిన ఘనుడు కదా.! కానీ, ఎందుకింత ప్రత్యేకం ఈ సెంచరీకి.?
Hitman Rohit Century Celebrations.. రిటైర్మెంట్‌కి దగ్గర్లో.. స్పెషల్ సెంచరీ..
రిటైర్మెంట్‌కి దగ్గర పడింది రోహిత్ శర్మ వయసు.! కాస్త బొద్దుగా వుంటాడు కదా.. అందుకే, సెలక్టర్లు, కాస్త శీతకన్నేస్తున్నారు. రోహిత్ శర్మ ఇక రిటైర్మెంట్ తీసుకోవడం తప్పదంటూ విమర్శకుల కామెంట్స్ తెలిసినవే.
అలా, తన మీద విమర్శలు వచ్చిన ప్రతిసారీ, రోహిత్ శర్మ తనదైన స్టయిల్లో బ్యాట్ ఝుళిపిస్తుంటాడు, సెంచరీలతో సమాధానం చెబుతూనే వుంటాడు.

కాకపోతే, ఈసారి ఇంకాస్త ప్రత్యేకం. సెంచరీ కొట్టాక సెలబ్రేషన్స్ చేసుకున్నాడు రోహిత్ శర్మ.. ఎప్పుడూ లేని విధంగా. స్పెషల్ రన్ కోసం వికెట్ల మధ్య పరుగు తీస్తూ.. లయబద్ధంగా గంతులేశాడు.
ఆ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. నిజానికి, రోహిత్ శర్మ చాలావరకు కామ్‌గానే వుంటాడు. కాకపోతే, కోపమూ కాస్త ఎక్కువే. సంబరాల విషయంలో, చాలా అరుదు.. అన్నట్లుంటాడు.
కాస్త బద్ధకం ఎక్కువేగానీ..
తెలిసిందే కదా, రోహిత్ శర్మ మొదటి నుంచీ కాస్త బొద్దుగానే వుంటాడు. వికెట్ల మధ్య పరుగులు తీసే విషయంలో, ఒక్కోసారి బద్ధకం ప్రదర్శిస్తుంటాడు.
అయితే, వికెట్ల మధ్య పరుగు తీయడం కంటే, గట్టిగా బాది బంతిని నేరుగా బౌండరీ అవతలకు పంపెయ్యడమే బెటర్.. అనుకుంటాడు రోహిత్ శర్మ.

‘ఇంత బద్ధకమైతే కష్టం.. ఫిట్‌నెస్ వుండదు..’ అంటూ రోహిత్ శర్మ మీద పదే పదే విమర్శలు వస్తుంటాయి. కానీ, మైదానంలో మెరుపు ఫీల్డింగ్ చేస్తుంటాడు రోహిత్.
క్రికెట్ అన్నాక, విమర్శకుల నుంచి ఎదురయ్యే కామెంట్స్‌ని భరించాల్సిందే.. తప్పదు.! సమయమొచ్చినప్పుడు కౌంటర్ ఎటాక్, బ్యాట్‌తో ఇవ్వాలి. అదెలాగో రోహిత్ శర్మకి బాగా తెలుసు.
పన్నెండు వేల పరుగుల మైలు రాయి..
ఏదిఏమైనా, నిన్నటి మ్యాచ్ చాలా చాలా ప్రత్యేకం.! నాలుగు వందల పై చిలుకు పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియాకి, రోహిత్ శర్మ – గిల్ అద్భుతమైన బిగినింగ్ ఇచ్చారు.
చివరి బంతి వరకూ నిలబడి, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టీమిండియాకి విజయాన్ని అందించాడు.
సెంచరీ తర్వాత, రోహిత్ శర్మ వికెట్ తనకు తానుగా పారేసుకున్నాడుగానీ, ఇంకాస్త అప్రమత్తంగా వుండి వుంటే, ఆ డబుల్ సెంచరీ, రోహిత్ శర్మ నుంచే వచ్చి వుండేది.
అన్నట్టు, ఇదే మ్యాచ్‌లో రోహిత్ శర్మ, మరో అరుదైన మైలు రాయిని దాటాడు. మొత్తంగా వన్డేల్లో 12 వేల పరుగుల మార్క్ దాటేశాడు రోహిత్ శర్మ.
