Sanjay Dutt Jail Giri.. సంజయ్ దత్ తెలుసు కదా.? మున్నాభాయ్ అంటే ఇంకా బాగా తెలుస్తుంది.! ‘మున్నాభాయ్’ సినిమాతో వచ్చిన పాపులారిటీ అలాంటిది మరి.
ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, తెలుగు ప్రేక్షకులకీ సుపరిచితుడే. మొన్నామధ్యన ‘రాజాసాబ్’ సినిమాలో, ప్రభాస్ తండ్రిగా నెగెటివ్ రోల్‌లో కనిపించాడు కదా.!
ఇప్పుడీ సంజయ్ దత్ అలియాస్ మున్నాభాయ్, వివాదాస్పదంగా వార్తల్లోకెక్కాడు. నోటి దూల అలాంటిది మరి.! ఆ నోటి దూల ప్రదర్శించి, చీవాట్లు తిన్నాక, క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.
ఇదో టైపు పబ్లిసిటీ స్టంట్.! ఔను, ఎంతలా వివాదాస్పదమైతే, అంత పబ్లిసిటీ.. అని పబ్లిసిటీ కక్కుర్తిలో మునిగి తేలుతున్నారు సెలబ్రిటీలు.
Sanjay Dutt Jail Giri.. జైలు జీవితమే ప్రశాతంగా వుందేమో..
ఇప్పుడు భారత దేశం తనకు ప్రశాంతంగా అనిపించడం లేదనీ, పాత రోజులే బావున్నాయనీ సంజయ్ దత్ సెలవిచ్చాడు.
‘అశాంతి’ పెరిగిపోయిందట దేశంలో. అందుకే, మళ్ళీ అలాంటి పాత రోజులు రావాలన్నది తన ఉద్దేశ్యమని సంజయ్ దత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
ఎవరైనా సరే, దేశానికి వ్యతిరేకంగా కామెంట్ చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడాలన్న ఇంగితాన్ని కోల్పోయాడు సంజయ్ దత్ ఆ ఇంటర్వ్యూలో.
రాజకీయ విమర్శలు చేయాలంటే, దానికి వేదిక వేరే వుంటుంది. ఆ కాంటెక్స్‌ట్ కూడా వేరే. ఫక్తు రాజకీయ నాయకుడిగా రాజకీయ విమర్శలు సంజయ్ దత్ చేస్తే, అది వేరే చర్చ.
కానీ, ఇంతలా దేశానికి వ్యతిరేకంగా దిగజారుడు వ్యాఖ్యలు చేయడం, దేశం మీద విషం చిమ్మడం శోచనీయం.
‘భారత దేశంలో శాంతి, ప్రశాంతత దొరక్కపోతే, విదేశాలకు వెళ్ళిపోవచ్చు’ అని సంజయ్ దత్‌కి ఆయన అభిమానులే సూచిస్తున్నారిప్పుడు.
తన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదంగా మారడంతో, సంజయ్ దత్ సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చాడు.
‘గాంధీగిరీ’ నేపథ్యంలో, సరదా కోసం జరిగిన ఇంటర్వ్యూ అది.. దాన్ని ‘ఫన్’ కోణంలోనే తీసుకోవాలి.. అంటూ క్షమాపణ కూడా చెప్పేశాడు సంజయ్ దత్.
తెలుసు కదా, సంజయ్ దత్ ‘నేర చరిత్ర’ గురించి.! అక్రమ ఆయుధాల కేసులో అరెస్టయి, కొన్నేళ్ళపాటు జైల్లో వున్నాడు సంజయ్ దత్.
అంతే కాదు, మాదక ద్రవ్యాల వినియోగం సహా, అనేక కేసుల్ని సంజయ్ దత్ ఎదుర్కొన్నాడు. ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ సినిమా సంజయ్ దత్ జీవితాన్ని మార్చేసింది.
క్రిమినల్ సంజయ్ దత్ కాస్తా, మున్నాభాయ్ అనే సరికొత్త గుర్తింపుని సంతరించుకున్నాడు. మళ్ళీ ఇప్పుడిలా, వివాదాస్పదంగా వార్తల్లోకెక్కాడు సంజయ్ దత్.
