Chuttamalle Deepfake Vijay Deverakonda.. సినీ నటుడు విజయ్ దేవరకొండ, సినీ నటి జాన్వీ కపూర్ ‘డీప్ ఫేక్ ఏఐ’ మార్ఫింగ్ వీడియోల విషయమై సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.
‘దేవర’ సినిమాలోని ‘చుట్టమల్లే’ అంటూ సాగే పాటని కొందరు చిల్లరగాళ్ళు అత్యంత అసభ్యకరంగా ‘ఏఐ డీప్ ఫేక్’ టూల్స్ ద్వారా మార్ఫింగ్ చేసిన విషయం విదితమే.
ఈ మార్ఫింగ్ వీడియో వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన ‘దేవర’ హీరో జూనియర్ ఎన్టీయార్, మార్ఫింగ్ చేసినవాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించాడు.
జూనియర్ ఎన్టీయార్ ట్వీటుపై స్పందించిన విజయ్ దేవరకొండ, ‘ఏం పెంపకమిది.?’ అంటూ తీవ్రంగా మండిపడ్డాడు మార్ఫింగ్ చేసినవాళ్ళపై.
ఎవరు మార్ఫింగ్ చేశారో వాళ్ళకి, చట్ట పరంగా అత్యంత కఠిమైన శిక్ష పడాల్సిందేనంటూ విజయ్ దేవరకొండ అభిప్రాయపడ్డాడు.
Chuttamalle Deepfake Vijay Deverakonda... జీవితాలు నాశనమైపోతున్నాయ్..
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా, ఉద్యోగాలు పోతున్నాయనీ, జీవితాలు నాశనమైపోతున్నాయనీ.. ఇలాంటి తరుణంలో ఇలా మార్ఫింగ్ వీడియోలు చేయడమేంటంటూ విజయ్ దేవరకొండ అసహనం వ్యక్తం చేశాడు.
మార్ఫింగ్ వీడియో విషయమై చట్ట పరంగా తీసుకునే చర్యలకు తన పూర్తి మద్దతు వుంటుందని విజయ్ దేవరకొండ స్పష్టం చేశాడు.
అంతా బాగానే వుందిగానీ, ‘ఏం పెంపకమిది.?’ అంటూ విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.
‘నువ్వు చేస్తున్న సినిమాలేంటి.? అందులోని, జుగుప్సాకరమైన కంటెంట్ సంగతేంటి.?’ అంటూ విజయ్ దేవరకొండని ట్రోల్ చేస్తున్నారు కొందరు నెటిజన్స్.
సినిమాల్లో వల్గారిటీ సంగతేంటి.?
సినిమాల్లో హద్దులు దాటుతున్న వల్గారిటీ, ఆ వల్గారిటీ మోతాదు ఇంకా పెరిగిపోయి, అడల్ట్ కంటెంట్ స్థాయికి వెళ్ళిపోవడం, సినిమాల్లో హీరోయిజం పేరుతో బూతులు.. వీటన్నిటినీ నెటిజనం ప్రస్తావిస్తున్నారు.
‘గీత గోవిందం’ సినిమాలో, బస్సులో పరిచయం లేని యువతికి హీరో ముద్దు పెట్టడమేంటి.? ఆ సీన్లో నువ్వు నటించడమేంి.? ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో నువ్వేం చేశావ్.? అన్నది నెటిజనం సంధిస్తున్న ప్రశ్న.
సినిమా వేరు.. అదో క్రియేటివ్ ప్రపంచం.! కళాత్మక ఒక్కోసారి హద్దులు దాటుతుంది. దాన్ని సెన్సార్ చేసే అవకాశముంది. కానీ, ఇక్కడ.. జాన్వీ కపూర్ విషయంలో జరిగింది జుగుప్స.
విషయం పక్కదారి పట్టేలా, విజయ్ దేవరకొండ వ్యాఖ్యల్ని ట్రోల్ చేయడంలో అర్థం లేదు.! అదే సమయంలో, సినిమాల తీరు, వాటిల్లో హీరో హీరోయిన్ల తీరు కూడా మారాల్సి వుంది.
