Home » ముసలాడితో రొమాన్స్.! రాధికా ఆప్టే ‘టెంపరితనం’.!

ముసలాడితో రొమాన్స్.! రాధికా ఆప్టే ‘టెంపరితనం’.!

by Mudra369 Editorial Desk
0 comments
Radhka Apte

Radhika Apte Target Balayya.. నందమూరి బాలకృష్ణతో అప్పుడెప్పుడో ‘లెజెండ్’ సినిమాలో నటించింది రాధికా ఆప్టే. ఆ తర్వాత కూడా బాలకృష్ణతోనే ఇంకో సినిమాలో నటించింది రాధికా ఆప్టే.

అప్పట్లో, నందమూరి బాలకృష్ణతో నటించడం చాలా ఆనందంగా వుందంటూ పలు ఇంటర్వ్యూల్లో రాధికా ఆప్టే చెప్పుకొచ్చింది.

కానీ, ఇప్పుడు రివర్స్ గేర్ వేసేసింది. ముసలోడితో రొమాన్స్ చేయాల్సి వచ్చింది.. అంటూ, సంచలన వ్యాఖ్యలు చేసింది రాధికా ఆప్టే తాజాగా.. బాలకృష్ణ పేరు ప్రస్తావించకుండానే.

దాంతో, సహజంగానే నందమూరి బాలకృష్ణ అభిమానులకి కోపమొచ్చింది. ‘పర్చేద్’ సహా పలు తెలుగేతర సినిమాల్లో, ముసలాళ్ళతోనే కదా రొమాన్స్ చేసింది.? అంటూ, మండిపడుతున్నారు రాధికా ఆప్టేపై.

Radhika Apte Target Balayya.. అటెన్షన్ కష్టాలు..

ఏదన్నా సినిమాతోనో, వెబ్ సిరీస్‌తోనో.. ప్రేక్షకుల్ని పలకరించే క్రమంలో, మీడియా అటెన్షన్‌ని తనవైపుకు తిప్పుకోవడానికి రాధికా ఆప్టేకి, నందమూరి బాలకృష్ణ చాలా తేలిగ్గా దొరికేస్తున్నారు.

ఎందుకంటే, తెలుగులో రాధికా ఆప్టే చేసింది రెండే సినిమాలు.. ఆ రెండిట్లోనూ రాధికా ఆప్టే నటించడం గమనార్హం.

దాంతో, సౌత్ సినిమాల మీదనే అయినా.. తెలుగు సినిమాల మీద అయినా, రాధికా ఆప్టే ఏదన్నా కామెంట్ చేస్తే, అది నేరుగా నందమూరి బాలకృష్ణ వైపుకే వెళుతోంది.

సౌత్‌లోనే కాదు, బాలీవుడ్ సినిమాల్లోనూ నటీనటుల మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా వుంటోంది. అమితాబ్ బచ్చన్ లాంటి ముదుసలి హీరోలు, నిండా ఇరవయ్యేళ్ళు లేని నటీమణులతో నటించిన సందర్భాలున్నాయ్.

బాలయ్య మౌనం ఎందుకో..

బాలయ్య అభిమానులు ఎంత గింజుకున్నా, రాధికా ఆప్టే నోటికి తాళం పడటం కష్టం. పబ్లిసిటీ స్టంట్లు చేయడంలో మాస్టర్ డిగ్రీ చేసేసింది రాధికా ఆప్టే.

ఎంతలా ట్రోలింగ్‌కి గురైతే, అంతలా పబ్లిసిటీ వస్తుందని రాధికా ఆప్టే బలంగా నమ్ముతోంది.!

సాధారణంగా నందమూరి బాలకృష్ణ ఇలాంటి కామెంట్లపై కౌంటర్ ఎటాక్ వెంటనే ఇచ్చేస్తారు. రాధిక విషయంలో బాలయ్య ఎందుకో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Most viewed

trending

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group