Home » మట్టి గాజుల మనోహరి.. మల్లెపూల మంజరి.! నివేదా థామస్.!

మట్టి గాజుల మనోహరి.. మల్లెపూల మంజరి.! నివేదా థామస్.!

by Mudra369 Editorial Desk
0 comments
Nivetha Pethuraj

Nivetha Pethuraj Traditionally Beautiful.. అందాల భామ నివేదా పేతురాజ్ సడెన్‌గా ట్రెడిషనల్ లుక్స్‌లో దర్శనమిచ్చింది.

ఇదేమైనా న్చూ మూవీ లుక్ అనుకుంటున్నారా.? ఏమో తెలీదు కానీ.! ఈ న్యూ లుక్స్ మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయ్.

మెరిసిపోతున్న పట్టుచీర ధరించి అచ్చంగా తెలుగింటి ఆడపడుచులా ముస్తాబైంది నివేదా పేతురాజ్ ఈ ఫోటో షూట్ కోసం. ఒక చేతికి నిండుగా ఎరుపు రంగు మట్టి గాజులు ధరించింది.

ఆ మట్టి గాజుల అందంతో నివేదా పేతురాజ్ టోటల్ లుక్ మారిపోయింది. క్లాసిక్ ఎత్నిక్ లుక్ తీసుకొచ్చాయ్ ఆ మట్టిగాజులు నివేదా పేతురాజ్‌ ఈ న్యూ ట్రెడిషనల్ లుక్‌కి. మట్టి గాజుల పవర్ అలాంటిది.

పండగ కళ వచ్చేసింది.! కాదు కాదు పెళ్లి కళ వచ్చేసింది.! అంటూ బ్యూటిఫుల్ కామెంట్స్ పోటెత్తుతున్నాయ్ ఈ పోజులకి.

కాగా, కేవలం మట్టి గాజులే కాదండోయ్.. నఖ శిఖ పర్యంతం కంప్లీట్ ట్రెడిషనల్ లుక్స్‌లో ఈ ఫోటో షూట్ చేయించుకుంది నివేదా.

Nivetha Pethuraj Beautiful Bomb.. ట్రెడిషనల్‌గా మెస్మరైజ్ చేస్తూ..

పట్టు చీర, మట్టి గాజులు, తలలో మల్లెపూలు.. ఇలా ఏ ఒక్కటీ వదలలేదు. తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా మహాలక్ష్మిలా మెరిసిపోతూ నెటిజనం మనసు దోచేస్తోంది.

నుదుటున బొట్టు, చేతులకు ఎర్రటి మట్టి గాజులు చెవులకు అందమైన కమ్మలు, మెడలో ధరించిన యాంటిక్ చోకర్ నెక్లస్.. ఇలా చెప్పుకుంటూ పోతే అణువణువునా సాంప్రదాయం నింపేసింది నివేదా తన ఈ తాజా లుక్స్‌లో.

తలలో మల్లెపూలు.. చేతిలో మల్లెపూలు.. పెదాలపై అందమైన చిరువన్వు.. అన్నీ వెరసి నివేదా ఈ ఫోటో పోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయ్.

Nivetha Pethuraj
Nivetha Pethuraj

అడపా దడపా సినిమాలతో ఈ మధ్య నివేదా పేతురాజ్ ఒకింత బిజీగానే గడుపుతోంది. సినిమా ఏదైనా కానీ, సహజ సిద్ధమైన మేకప్‌తో ఆకట్టుకోవడంలో నివేదా పేతురాజ్ ముందుంటుంది.

అలాగని గ్లామర్‌‌లో ఏమాత్రం లోటుండదు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే.. గ్లామర్ డోస్‌లో ఎక్కువ తక్కువ చేయడంలోనూ అస్సలు మొహమాటపడదు.

చిట్టి పొట్టి దుస్తులు వేస్తేనే గ్లామరా.? ఇదిగో ఇలా సాంప్రదాయ దుస్తుల్లోనూ ఆకర్షించే గ్లామర్ వుంటుందని ప్రూవ్ చేస్తోంది నివేదా పేతురాజ్.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group