Table of Contents
Kiara Advani Toxic Romance.. సినిమా అన్నాక గ్లామరుండాలి.! కానీ, ఆ గ్లామర్ ఏ మోతాదులో వుంటే బావుంటుంది.? అన్నదే కీలకం.! గ్లామర్ హద్దులు దాటేస్తే, వల్గారిటీ అవుతుంది.!
ఆన్ స్క్రీన్ రొమాన్స్ అందంగా వున్నంతవరకూ ఓకే.! అది జుగుప్సాకరంగా మారిపోతే.! పైగా, అది ‘టాక్సిక్’ రొమాన్స్ అయిపోతేనో.?
అబ్బే, అదంతా అలవాటైపోయిందంటోంది కియారా అద్వానీ.! ఆన్ స్క్రీన్ రొమాన్స్, ఆపై ట్రోలింగ్.. ఇవేవీ కొత్త కాదన్నది కియారా అద్వానీ ఉవాచ.
‘టాక్సిక్’ సినిమాలో లీడ్ పెయిర్ యష్, కియారా అద్వానీ మధ్య రొమాంటిక్ సీన్స్ అత్యంత జుగుప్సాకరంగా వున్నాయనే విమర్శలొచ్చిన సంగతి తెలిసిందే.
Kiara Advani Toxic Romance.. పెళ్ళయ్యాక ఆన్ స్క్రీన్ రొమాన్స్..
పెళ్ళయ్యాక కూడా ఆన్ స్క్రీన్ రొమాన్స్ విషయంలో ఇంతలా రెచ్చిపోవాలా.? అన్న ప్రశ్న చుట్టూ చర్చోపచర్చలు జరిగాయి.!
కియారా అద్వానీకి కొన్నాళ్ళ క్రితం సిద్దార్ధ మల్హోత్రాతో పెళ్ళయ్యింది.. పెళ్ళయ్యాక కూడా సినిమాల్లో నటిస్తూనే వుంది కియారా అద్వానీ.!

ఆ మాటకొస్తే, పెళ్ళయ్యాక నటీమణులు సినిమా కెరీర్లో కొనసాగడం, అందునా హాట్ హాట్‌గా వెండితెరపై కనిపించడం కొత్తేమీ కాదు.!
మలైకా అరోరా లాంటి హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్ కూడా చేసెయ్యడం చూస్తున్నాం. దీపికా పదుకొనే సంగతి సరే సరి.! చెప్పుకుంటూ పోతే, లిస్టు పెద్దదే.
ట్రెండ్ మారింది.. గ్లామర్ లెక్కలు మారాయ్..
అయినా, ట్రెండ్ మారింది.! ఒకప్పుడు పెళ్ళయిన హీరోయిన్లకు, ఛాన్సులు తగ్గిపోయేవి. అక్క, అత్త పాత్రలకు షిప్టయిపోవాల్సి వచ్చేది.
ఇప్పుడలా కాదు.! కథలు మారుతున్నాయ్.. హీరోయిన్లు, తెరపై మరింత అందంగా వెలిగిపోతున్నారు పెళ్ళయ్యాక. నయనతారని చూస్తున్నాం కదా.. పెళ్ళయ్యాక, ఆమె స్టార్డమ్ ఏమాత్రం తగ్గలేదు.
‘ట్రోలింగ్ మాకేమీ కొత్త కాదు. ప్రత్యేకించి నటీమణులం మాకు ఈ ట్రోలింగ్ చాలా ఎక్కువే ఇబ్బంది పెడుతుంది. కానీ, లైట్ తీసుకుంటాం..’ అని చెప్పింది కియారా అద్వానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో.
సిద్దార్ధ్.. పట్టించుకోలేదు.!
‘టాక్సిక్’ సినిమాలో ఆన్ స్క్రీన్ రొమాన్స్ గురించి నా భర్త సిద్దార్ధ మల్హోత్రా నాతో ప్రత్యేకంగా మాట్లాడిందేమీ లేదు. అసలు దాన్ని ఆయన పట్టించుకోనే లేదు.. అని కియారా చెప్పుకొచ్చింది.
కియారా అద్వానీ అలా చెబుతున్నప్పుడు, ఆమె పక్కనే సిద్దార్ధ మల్హోత్రా కూడా వున్నాడు. జస్ట్ లైట్ తీసుకున్నాడంతే, ఆ డిస్కషన్‌ని సిద్దార్ధ్ మల్హోత్రా.
కాగా, ‘టాక్సిక్’ రిజల్ట్ మాత్రం తనను తీవ్రంగా నిరాశపర్చిందని కియారా అద్వానీ చెప్పడం గమనార్హం. సినిమాపై వచ్చిన విమర్శలకి స్పందించాలనుకోలేదని వ్యాఖ్యానించింది.
దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ‘టాక్సిక్’ సినిమాని తెరకెక్కించింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘టాక్సిక్’ అంచనాల్ని మాత్రం అందుకోలేకపోయింది.
నయనతార, హుమా ఖురేషీ, రుక్మిణీ వసంత్, తారా సుతారియా.. తదితరులు ఈ సినిమాలో ఇతర ప్రధాన తారాగణం.
కన్నడలో తెరకెక్కిన ‘టాక్సిక్’, తెలుగుతోపాటు హిందీ, తమిళ అలాగే మలయాళ భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
థియేట్రికల్ రిజల్ట్ డిజాస్టర్ కావడం ఓ యెత్తయితే, సినిమా ఇప్పటివరకూ ఓటీటీలో విడుదలకు నోచుకోకపోవడం ఆశ్చర్యకరం.