Sreeleela Dance Tragedy.. శ్రీలీల అంటే డాన్స్.. డాన్స్ అంటే శ్రీలీల.. అన్నట్లు తయారైంది వ్యవహారం.!
ఏదన్నా సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోందంటే, పాటల్లో చెలరేగిపోవడం తప్ప, నటనలో సున్నా.!
అంతలా వెండితెరపై శ్రీలీలని ఒకే తరహా పాత్రల్లో చూపించేసి, బోర్ కొట్టించేశారు. క్యూట్ హీరోయిన్‌ని కాస్తా, వల్గర్ ఐటమ్ బాంబ్‌లా మార్చేశారు స్పెషల్ సాంగ్స్ పేరుతో.
ఏమయ్యిందోగానీ, ఇకపై కేవలం డాన్సుల కోసమే అయితే అలాంటి సినిమాలు చేయడానికి అస్సలు ససేమిరా అంటోందిట ఇప్పుడు శ్రీలీల.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో శ్రీలీలకి పిచ్చెక్కిపోయే డాన్స్ మూమెంట్స్ లేవు. కాస్త నటనకు ప్రాధాన్యమున్న పాత్రే చేసింది.
Sreeleela Dance Tragedy.. రూటు మార్చింది…
విడుదలకు సిద్ధంగా వున్న సినిమాలు, కొత్తగా కమిట్ అవుతున్న సినిమాలు.. వీటన్నిటిలోనూ నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్నే శ్రీలీల ఎంచుకుందిట.
ఓ సినిమా ఈవెంట్‌లో శ్రీలీల మాట్లాడుతూ, ‘హమ్మయ్య.. ఈ సినిమాలో నాకు డాన్సులేసే పాటలు లేవు..’ అని చెప్పుకొచ్చింది.
దీనర్థం, డాన్సులంటేనే శ్రీలీలకి కంపరంగా వుందన్నమాట. అంతలా ఆమెకే చికాకు తెప్పించేశారు పిచ్చి డాన్సులతో.!

తెలుసు కదా, శ్రీలీల చాలా బాగా డాన్స్ చేస్తుందని. అందమైన డాన్స్‌ని కాస్తా వికారంగా మార్చేశారు, ‘మాస్’ పేరుతో.! శ్రీలీల అలా డాన్సింగ్ డాల్ అయిపోయింది.
క్రమంగా, ఆ పాటలూ ప్రేక్షకుల్ని అలరించడం మానేశాయి. దాంతో, శ్రీలీల వేగంగానే తెరపైనుంచి ఫేడవుట్ అయిపోయినట్లేనన్న చర్చ జరిగింది.
ఎలాగైతేనేం, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంది శ్రీలీల.! చిన్న వయసులోనే సినిమా రంగంలోకి వచ్చేసింది గనుక, ఈ అనుభవాలు ఆమె కెరీర్‌కి ఉపయోగపడతాయి.
ఒక్కటి మాత్రం నిజం. డాన్సులకు శ్రీలీల పూర్తిగా దూరమైతే, ఆమె డాన్సుల్ని ప్రేక్షకులు మిస్ అవుతారు. ది బెస్ట్ డాన్సర్స్ అనదగ్గ టాలీవుడ్ హీరోయిన్లలో, శ్రీలీల పేరు ముందు వరుసలో వుంటుంది.