Panja Vaishnav Tej Hanuman.. ‘హనుమాన్’ సినిమా సంచలన విజయం సాధించింది. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.!
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘హనుమాన్’.!
‘హనుమాన్’ సినిమాకి సీక్వెల్‌పై అప్పట్లోనే స్పష్టతనిచ్చేశాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. కాకపోతే, నిర్మాతలతో అభిప్రాయ బేధాలు వచ్చాయి ఆ తర్వాత.!
ఈ క్రమంలో ‘హనుమాన్-2’ ప్రాజెక్టుకి కొత్త రూపమిస్తున్నట్లు ప్రకటించాడు ప్రశాంత్ వర్మ. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ‘జై హనుమాన్’ సినిమా అనౌన్స్ అయ్యింది.
రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో ‘జై హనుమాన్’ తెరకెక్కనుంది. ఇంతలోనే, ‘హనుమాన్-2’పై ప్రకటన వచ్చేసింది. ‘హనుమాన్’ సినిమాని తెరకెక్కించిన నిర్మాతలే, ఈ ‘హనుమాన్-2’ నిర్మిస్తున్నారు.
Panja Vaishnav Tej Hanuman.. ఇద్దరు హనుమాన్లు..
వీఐ ఆనంద్ దర్శకత్వంలో, పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ‘హనుమాన్-2’ తెరకెక్కబోతోంది. రిషబ్ శెట్టి అగ్ర హీరో కదా, పంజా వైష్ణవ్ తేజ్‌కి పాన్ ఇండియా స్థాయిలో ఆ స్టార్డమ్ లేదు కదా.? అన్న పోలిక సహజమే.
కాకపోతే, ‘హనుమాన్’ సినిమాలో నటించిన తేజ సజ్జాకి, ఆ సినిమాకి ముందు స్టార్డమ్ ఏంటన్నది ఇక్కడ ప్రస్తావించుకోవాలి.
కంటెంట్ కరెక్ట్‌గా పడితే, ‘హనుమాన్-2’ సినిమాతో హీరో పంజా వైష్ణవ్ తేజ్ ‘రేంజ్’ మారిపోతుందన్నది నిర్వివాదాంశం.
కాగా, ‘జై హనుమాన్’ సినిమా తెరకెక్కడానికి చాలా సమయం పట్టేసేలా వుంది. ఎందుకంటే, ప్రశాంత్ వర్మ దర్శకుడిగా నిర్మాతగా చాలా గందరగోళాన్ని ఎదుర్కొంటున్నాడు.
చాలా సినిమాలకు కమిట్ అయిపోయిన ప్రశాంత్ వర్మ, ఏ సినిమానీ ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాడన్నది నిర్వివాదాంశం.
ఇక, పంజా వైష్ణవ్ తేజ్ మీద ‘హనుమాన్-2’ నిర్మాతలు ఏ స్థాయి బడ్జెట్‌ని రిస్క్ చేయగలరన్నదీ ఇక్కడ కీలకమే.!
మొత్తమ్మీద, ‘హనుమాన్’ అనేది ఇప్పుడు టాలీవుడ్లో ఇంట్రెస్టింగ్ అండ్ డిబేటబుల్ టాపిక్.!