Mamitha Baiju AI Deepfake.. అదేంటీ, ఇండియాలో బూతు వీడియోల్ని బ్యాన్ చేశారు కదా.? అయినా, సోషల్ మీడియా వేదికగా బూతు కంటెంట్, ఇంకా అందుబాటులోనే ఎలా వుంది.?
అప్పుడెప్పుడో రష్మిక మండన్న ‘డీప్‌ఫేక్’ బారిన పడింది. ఆమె న్యాయ పోరాటం మొదలు పెట్టింది.. అంతా ఆమెకు మద్దతుగా నిలిచారు.!
మొన్నీమధ్యనే జాన్వీ కపూర్ ‘డీప్‌ఫేక్’ వీడియో సోషల్ మీడియా వేదికగా దర్శనమిచ్చింది. ‘మార్ఫింగ్ చేసిన వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు’ అంటూ జూనియర్ ఎన్టీయార్ స్వయంగా రంగంలోకి దిగాడు.
సినీ తరఫున మెగాస్టార్ చిరంజీవి, ఈ వల్గర్ డీప్‌ఫేక్ కంటెంట్ మీద, కేంద్ర మంత్రికి ఇటీవల ఫిర్యాదు చేశారు.! ఇంతలోనే, ఇంకో ఏఐ డీప్‌ఫేక్ మార్ఫింగ్ వీడియో బయటకు వచ్చింది.
ఈసారి బాధితురాలు నటి మమిత బైజు.! మొన్నీమధ్యనే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది మమిత బైజు.
గతంలో ఆమె నటించిన ‘డూడ్’ సినిమా నుంచి ఓ సన్నివేశాన్ని తీసుకుని, ఏఐ డీప్ ఫేక్ మార్ఫింగ్ ద్వారా అత్యంత వల్గర్‌గా ఓ వీడియోని తయారు చేశారు కేటుగాళ్ళు.
దారుణమైన విషయమేంటంటే, ఆ కంటెంట్‌ని షేర్ చేయడం ‘క్రైమ్’ అని తెలిసీ, వాటిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు.
పెన్ డ్రైవ్స్లోకి డౌన్లోడ్స్ అవుతున్నాయ్.. అవి మళ్ళీ, వివిధ మార్గాల్లో ఆఫ్లైన్లోనూ సర్క్యులేట్ అయిపోతూనే వున్నాయి.
తమన్నా నటించిన ఓ వెబ్ సిరీస్‌లోని సన్నివేశాన్ని ఏఐ డీప్‌ఫేక్ మార్ఫింగ్ సాయంతో అత్యంత జుగుప్సాకరంగా మార్చేశారు కేటుగాళ్ళు.
అలానే, కీర్తి సురేష్ మీద కూడా ఓ డీప్‌ఫేక్ మార్ఫింగ్ వీడియో తయారైంది. గతంలో న్యాయ పోరాటం చేసిన రష్మిక మండన్న మీద తాజాగా, ఇంకో ఏఐ డీప్‌ఫేక్ మార్ఫింగ్ వీడియో తయారయ్యింది.
ఇలాంటి సందర్భాల్లోనే ఇంటర్నెట్ సెన్సార్.. అనే ప్రస్తావన బలంగా తెరపైకొస్తుంటుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ని అదుపు చేయలేని స్థాయికి మారిపోయింది పరిస్థితి.
విచ్చలవిడిగా స్మార్ట్ ఫోన్లలోనే రకరకాల యాప్స్, ఈ డీప్‌ఫేక్ ఏఐ మార్ఫింగ్ వీడియోలు చేయడానికి కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయ్.
కేంద్ర ప్రభుత్వం గట్టిగా పూనుకుంటే తప్ప, ఈ ‘ఏఐ డీప్‌ఫేక్ మార్ఫింగ్’ మహమ్మారిని నిలువరించడం సాధ్యపడదు.
సినిమాల్లోని సాధారణ సన్నివేశాల్ని, అత్యంత అసభ్యకరంగా, జుగుప్సాకరంగా.. ఏఐ డీప్‌ఫేక్ మార్ఫింగ్ ద్వారా బూతు కంటెంట్గామార్చేస్తుండం సినీ జనాల్ని తీవ్రంగా కలవరపెడుతోంది.