Home » నీళ్ళు.. నిప్పులాంటి నిజాలు.! బిస్లెరీలో క్యాన్సర్ కారకాలున్నాయా.?

నీళ్ళు.. నిప్పులాంటి నిజాలు.! బిస్లెరీలో క్యాన్సర్ కారకాలున్నాయా.?

by Mudra369 Editorial Desk
0 comments
Bisleri Water

Bisleri Water Cancer Allegations.. మంచి నీళ్ళ గురించిన ప్రస్తావన ఎక్కడైనా వస్తే, ‘బిస్లెరీ’ ఈజ్ బెస్ట్.. అంటాం.! కిన్లే ఆ తర్వాతి స్థానంలో వుంటుంది.

ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ విభాగంలో బోల్డన్ని కంపెనీలు ప్రస్తుతం మార్కెట్లో వున్నాయ్.! టాటా లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నుంచీ, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ అందుబాటులో వుంది.

భారతీయ రైల్వే కూడా, తనదైన ఓ బ్రాండ్‌తో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌‌ని రైలు ప్రయాణీకుల కోసం అందుబాటులోకి తెచ్చిన విషయం విదితమే.

ప్రభుత్వాలు వేల కోట్లు, లక్షల కోట్లు ఖర్చు చేసి, ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ, వీధికొక ‘మినరల్ వాటర్ ప్లాంట్’ దర్శనమిస్తోందిప్పుడు.

Bisleri Water Cancer Allegations.. ప్యాకేజింగ్ వాటర్.. సర్వాంతర్యామి..

ప్లాస్టిక్ క్యాన్లలో కొనుక్కుని తెచ్చుకున్న నీళ్ళను మాత్రమే ‘మంచినీళ్ళు’గా భావిస్తున్న రోజులివి. పెళ్ళిళ్ళు సహా, ఏ ఫంక్షన్లకైనా మళ్ళీ ఈ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌నే వినియోగిస్తున్నాం.

బిస్లెరీ కాస్త ఖరీదైనది.. ఈ విభాగంలో. అంటే, సాధారణ మినరల్ వాటర్‌తో పోల్చితే, బిస్లరీ బాటిల్ ఖరీదు కొంచెం ఎక్కువ.! నాణ్యత కోణంలోనే, ఈ అధిక ధర.!

Bisleri Water
Bisleri Water

ఇంతకీ, బిస్లరీ బాటిల్‌లో మంచి నీళ్ళు నిజంగా మంచివేనా.? కాదంటోంది, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా.!

కొన్నాళ్ళ క్రితం జరిపిన సాధారణ తనిఖీల్లో, ప్రమాదకర పదార్థాలు బిస్లెరీ బాటిల్‌లో వున్నట్లు గుర్తించింది ‘ఎఫ్ఎస్ఎస్ఏఐ’.

దాంతో, బిస్లెరీ సంస్థ.. ఎఫ్ఎస్ఎస్ఏఐ నివేదికని సవాల్ చేసింది. మళ్ళీ పరీక్షలకు సిద్ధమని ప్రకటించింది. ఇంకోసారి పరీక్షలు నిర్వహించాక కూడా, అదే రిజల్ట్.

లోతైన విచారణ మొదలైంది..

దాంతో, బిస్లెరీ సంస్థకు సంబంధించిన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ వ్యవహారంపై విచారణ షురూ చేసినట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ తాజాగా ప్రకటించడం సంచలనంగా మారింది.

ఒక్కసారిగా దేశమంతా ఉలిక్కిపడింది ఈ వ్యవహారంతో. గల్లీల్లోని ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లలోనూ తనిఖీలు నిర్వహించాలనే డిమాండ్లు పెరిగాయి ప్రజల నుంచి.

మార్కెట్‌లో అందుబాటులో వున్న అన్ని ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌నీ, వాటి తయారీ కేంద్రాల్లో తగిన పరీక్షలు నిర్వహించి నిజాలు నిగ్గు తేల్చాలన్నది వినియోగదారులైన ప్రజల నుంచి వస్తోన్న డిమాండ్.

ఏకంగా, బిస్లెరీ వాటర్‌లో క్యాన్సర్ కారకాలున్నాయంటూ ఎఫ్ఎస్ఎస్ఏఐ నివేదికల్ని ఉటంకిస్తున్నారు నిపుణులు. దాంతో, ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి.

అనారోగ్యాన్ని ‘కొని’ తెచ్చుకుంటున్నాం.!

మంచి నీళ్ళను కొనుక్కోవాల్సిన దుస్థితి గురించే పదే పదే చర్చించుకుంటాం. కానీ, తప్పట్లేదు. ఆ కొనుక్కున్న మంచి నీళ్ళు క్యాన్సర్ కారకాలైతే, రోగాల్ని ‘కొని’తెచ్చుకుంటున్నట్లే కదా.?

‘తూచ్, మేం అన్ని రకాల నాణ్యతా ప్రమాణాల్ని పాటిస్తున్నాం. నిబంధనలకు లోబడే వ్యవహరిస్తున్నాం..’ అంటూ బిస్లెరీ సంస్థ తాజాగా ప్రకటన విడుదల చేయడం కొసమెరుపు.

మార్కెట్లో మాత్రం ప్రజలు, తప్పనిసరి పరిస్థితుల్లో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ తాగాల్సి వస్తున్నా, వాటిని చూస్తేనే భయపడాలేమో ఇకపై.!

ఇరవై లీటర్ల మినరల్ వాటర్ టిన్ ధర కేవలం పది రూపాయలు మాత్రమే. కానీ, లీటర్ వాటర్ బాటిల్ ధర ఏకంగా 20 రూపాయలు.!

ఇంత దోపిడీకి పాల్పడుతూ, ప్రజారోగ్యానికి హాని కలిగించడమంటే, ఈ ఘాతుకానికి పాల్పడుతున్న ప్యాకేజీ డ్రింకింగ్ వాటర్ సంస్థలపై ‘హత్య కేసులు’ నమోదు చెయ్యాలేమో.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Most viewed

trending

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group