Home » నవ్విపోదురుగాక.! వైఎస్సార్సీపీ ‘గుడి’సేటి రాజకీయమిదీ.!

నవ్విపోదురుగాక.! వైఎస్సార్సీపీ ‘గుడి’సేటి రాజకీయమిదీ.!

by Mudra369 Editorial Desk
0 comments
Bhumana Karunakar Reddy

YSRCP Temple Propaganda.. వైసీపీ అధికారంలో వున్నప్పుడే, అంతర్వేది రధం తగలబడింది..

అదే వైసీపీ అధికారంలో వున్నప్పుడే రామతీర్థంలో రాములోరి విగ్రహం తల తెగనరికారు దుండగులు.!

చాలా ఘోరాలు జరిగాయి వైసీపీ హయాంలో.! ‘ఆంజనేయ స్వామి చెయ్యి విరిగితే నష్టమేంటి.? అది బొమ్మే కదా..’ అన్నాడొకడు.. అప్పట్లో మంత్రిగా పని చేశాడు.!

ఎంత దారుణంగా వైసీపీ హయాంలో కన్వర్షన్ మాఫియా నడిచిందో, వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితుడు, వైసీపీలో నెంబర్ టూ పొజిషన్‌లో పనిచేసిన విజయ సాయి రెడ్డి స్వయంగా చెబుతున్నారు.

అధికారంలో వున్నప్పుడూ.. అధికారంలో లేనప్పుడూ.. వైసీపీ దేవాలయాల పేరుతో ‘గుడి’సేటి రాజకీయం చేస్తూనే వుంది.

తాజాగా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని రేణిగుంట సమీపంలో ఓ ఆంజనేయ స్వామి దేవాలయం చుట్టూ నీచ నికృష్ట రాజకీయానికి వైసీపీ తెరలేపింది.

YSRCP Temple Propaganda.. జాతీయ రహదారి విస్తరణ కోసం..

జాతీయ రహదారి విస్తరణలో, ఆ రహదారిని ఆనుకున్న వున్న ఆంజనేయస్వామి దేవాలయాన్ని కూల్చాల్సి వచ్చింది.

కూల్చివేత తప్పనిసరి కావడంతో, ప్రత్యామ్నయ స్థలం, బాలాలయ ఏర్పాటు, కొత్త ఆలయ నిర్మాణానికి నిధులు.. ఇవన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి.

ఆలయం కూల్చివేత పనులూ జరిగాయి. ఇక్కడే, వైసీపీ నికృష్ట రాజకీయం తెరపైకొచ్చింది. దేవాలయాన్ని కూల్చేస్తున్నారు మొర్రో.. అంటూ, కపట ప్రేమ హిందూ దేవాలయాలపై వైసీపీ ప్రదర్శిస్తోంది.

వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మొదలెట్టిన ఈ నీఛ నికృష్ట రాజకీయం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా కొనసాగించేదాకా వెళ్ళిందంటే, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

నిజం గడప దాటేలోపు, అబద్ధం ఊరంతటినీ కాల్చేస్తుందన్నది వెనకటికి ఓ నానుడి. ప్రభుత్వం, అసలు వాస్తవాన్ని ప్రజలకు చెప్పే లోపు, వైసీపీ మేగ్జిమమ్ దుష్ప్రచారం చేసేసింది.

అదే పెద్ద పొరపాటు..

అయితే, ఇక్కడ ప్రభుత్వం నుంచి ఓ పెద్ద పొరపాటు జరిగిందన్న విషయాన్నీ కాదనలేం. తప్పంతా ప్రభుత్వానిదేనా.? లేదంటే, దేవాదాయ ధర్మాదాయ శాఖదా.? అన్నది మళ్ళీ వేరే చర్చ.

ఇందులో, ఆలయ నిర్వాహకుల తప్పు కూడా వుంది. దేవాలయాన్ని కూల్చే క్రమంలో, ఆ శిధిలాల్ని చూసి భక్తులు ఆవేదన చెందుతారు ఖచ్చితంగా.

అందుకే, చుట్టూ పరదాలు కట్టి, కూల్చివేతలు చేపడతారు. వాటికి సంబంధించిన వీడియోల చిత్రీకరణకు అసలు ఆస్కారమే వుండకూడదు.

రికార్డ్స్ కోసం కావాలంటే, అధికారికంగా వీడియోలు తీసి భద్ర పరచుకోవచ్చు. అధికారుల సమక్షంలోనే జరగాలి ఇది కూడా. ప్రైవేటు వ్యక్తులు అటువైపు అస్సలు వెళ్ళకూడదు.

ఆలయ నిర్వాహకులదే బాధ్యత..

గోపురం కూలుతున్నప్పుడు.. ఆ గోపురం మీదున్న విగ్రహాలు నేల కూలుతున్నప్పుడు.. వాటిని చూస్తూ తట్టుకోవడం సగటు హిందువుకి చాలా కష్టం.

దీన్నే, ఆయుధంగా మార్చుకుంది వైసీపీ.! ఈ పరిస్థితిని ప్రభుత్వం కావొచ్చు, సదరు ఆలయ నిర్వాహకులు కావొచ్చు.. ఎందుకు ముందే ఊహించలేకపోయారన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్.

ఇక, భూమన కరుణాకర్ రెడ్డి విషయానికొస్తే, ఆయన ఫేక్ హిందూ.. అనే విమర్శలు చాలానే వున్నాయి. అలాంటి వ్యక్తిని టీటీడీ ఛైర్మన్‌గా నియమించడంపై వున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు.

అలాంటి భూమన, రోడ్డు విస్తరణలో దేవాలయం స్థాన మార్పుపై రాజకీయం చేయడం సిగ్గు చేటు.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Most viewed

trending

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group