Table of Contents
Bhogi Review.. శర్వానంద్ మార్కెట్‌కి మించి ఖర్చు చేశారు ‘భోగీ’ సినిమా కోసం.!
ఆ మాటకొస్తే, దర్శకుడు సంపత నంది ఏ సినిమా ఏ హీరోతో తెరకెక్కించినా, ఆ హీరో మార్కెట్ కంటే మించి బడ్జెట్ అవుతుంటుంది.
కాకపోతే, సంపత్ నందిలో మంచి మాస్ డైరెక్టర్ వున్నాడు.! క్లాస్ టచ్ ఇవ్వగల మాస్ దర్శకుడు సంపత్ నంది.! ఏం లాభం.? సరైన హిట్ కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నాడు.
శర్వానంద్ కూడా బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ నేపథ్యంలో ‘భోగీ’ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. టీజర్, ట్రైలర్.. ఇవన్నీ సినిమాపై అంచనాలు పెంచేశాయ్.
Bhogi Review.. కథా కమామిషు ఏంటంటే..
ఈ మధ్య చాలా సినిమాల్లో మనం చూసినట్లే, ఈ కథ కూడా ప్రస్తుతంలో కాదు.. గతంలో జరుగుతుంది.! అంటే, చాలా ఏళ్ళు వెనక్కి ప్రేక్షకుల్ని తీసుకెళ్తారన్నమాట.
అనగనగా ఓ ఊరు, పేరేమో బొగ్గులగుట్ట. ఆ ఊళ్ళో ఓ కుర్రాడు గంగ. అతనికి ఐదుగురు చెల్లెళ్ళు. ఊరి పెద్దకి ఎదురు తిరగాల్సి వస్తుంది గంగ. ఆ తర్వాత అతని జీవితం మారిపోతుంది.
ఏం జరిగింది.? శర్వా తన పెద్ద చెల్లెలికి చేద్దామనుకున్న పెళ్ళి జరుగుతుందా.? ఊరి పెద్ద కథేంటి.? గంగ ఎందుకు ఎదురు తిరిగాడు.? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెరపైనే దొరుకుతుంది.
ఇదే కథతో చాలా సినిమాలు చూసేశాం. ఇందులో కొత్తదనమేముంది.? అసలు నటీనటులెలా చేశారు.? సాంకేతిక నిపుణుల పనితీరు ఎలా వుంది.? తెలుసుకుందాం పదండిక.!
శర్వానంద్ కష్టపడ్డాడుగానీ..
నటీనటుల విషయానికొస్తే, శర్వానంద్ షరామామూలుగానే చాలా కష్టపడ్డాడు. శర్వానంద్ నటించిన సినిమాలు ఫెయిలవ్వొచ్చేమోగానీ, నటుడిగా అతనెప్పుడూ ఫెయిల్ కాలేదు.
గంగ పాత్రలో శర్వానంద్ జీవించేశాడు. తెరపై అతని నటనకి ఫిదా అవుతాం. మేకోవర్, బాడీ లాంగ్వేజ్.. అన్నీ టాప్ క్లాస్.!
కానీ, దర్శకుడు ‘గంగ’ పాత్ర చుట్టూ కథని సరిగ్గా రాసుకోలేకపోయాడు. సన్నివేశాల్ని బలంగా డిజైన్ చేసుకోలేకపోయాడు. దాంతో, శర్వా ఎంత కష్టపడ్డా ప్రయోజనం లేకుండా పోయింది.
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మమ అనిపించింది. ఆమె పాత్ర విషయంలోనూ దర్శకుడు తగిన జాగ్రత్తలు తీసుకోలేదనిపిస్తుంది.
తెలుసు కదా, అనుపమ కూడా మంచి నటి అని. ఆమె పాత్రని సరిగ్గా డిజైన్ చేసి వుంటే, సినిమాకి బాగా హెల్పయ్యేది. డింపుల్ హయాతీ, ఒకట్రెండు సన్నివేశాల్లో నటిగా తన ఉనికిని చాటుకుంది.
మిగతా పాత్రధారుల్లో పెద్దగా ఎవరివీ గుర్తుండిపోయే పాత్రలు కావు. విలనిజం ఇలాంటి సినిమాల్లో మామూలే.! నరుకుడు బీభత్సం, జుగుప్సాకరంగా మారిపోవడంతో.. మిగతా విషయాలేవీ మనకు పట్టవు.
సాంకేతికంగా బానే వుందిగానీ..
సినిమాటోగ్రఫీ బావుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బావుంది. ఏం లాభం.? సన్నివేశాల్లో డెప్త్ లేదు. ఎమోషన్స్ పండలేదు. దాంతో, టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ చేయడానికేమీ లేకుండా పోయింది.
ఈ మధ్య కొన్ని సినిమాలు ఒకే ప్యాటర్న్‌తో వస్తున్నాయి. దాదాపుగా అన్నీ ‘రంగస్థలం’ స్ఫూర్తిగా తెరకెక్కుతున్నవే. పైగా, ఈ మధ్య ‘నరకడం’ అనేది ట్రెండింగ్ అయిపోయింది.
శరీర భాగాలు తెగిపడటం అనే పైశాచికానందంలో దర్శకులు మునిగి తేలుతున్నారు. అదే ‘మాస్.. ఊరమాస్’ అనుకుంటున్నారు. కానీ, అది జుగుప్సాకరంగా తయారైంది.
‘భోగీ’ టీజర్, ట్రైలర్ చూశాకే.. చాలామంది, ఈ జుగుప్స అవసరమా.? అనుకున్నారు. ఆ ఛండాలాన్ని కాస్త తగ్గించి వుండాల్సింది.
విలన్ మొహాన్ని చాలా సేపు సరిగ్గా చూపించలేదు దర్శకుడు. ఊరి జనాలకి, అతనంటే భయం కాబట్టి, ఎవరూ తలెత్తి చూడరట. ప్రేక్షకులకైనా చూపించాలి కదా ఆ మొహాన్ని.?
చక్కటి టైటిల్ పెట్టారుగానీ, ఆ పండగ వాతావరణం సినిమాలో కనిపించదు. భయంకరమైన, బీభత్సమైన వాతావరణాన్నే ఎక్కువగా చూపించారు. అది కూడా, ‘అనవసరం’ అని ప్రేక్షకుడికి అనిపించేలా.
‘కసితీరా ప్రేక్షకుల్ని నరికేశాడు’ అని సినిమా చూసి బయటకు వచ్చిన ఆడియెన్స్ అంటున్న పరిస్థితిని చూస్తున్నాం. ఇది భోగీ మంట కాదు.. చితిమంట.. అనే విమర్శలూ వస్తున్నాయ్.
ఫైనల్ టచ్: శర్వానంద్ కష్టం, మంటగలిసిపోయింది.