Table of Contents
మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi The True Legend).. పరిచయం అక్కర్లేని పేరిది తెలుగు సినీ అభిమానులకి. నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ ప్రేక్షకుల్ని అలరిస్తూనే వున్నారాయన.
చిరంజీవి సినిమాలంటే.. హిట్టూ.. ఫట్టూ.. అన్న తేడాలుండవ్. వసూళ్ళ జాతర ఆయన సినిమాలకి సర్వసాదారణం. చిరంజీవి నుంచి సినిమా వస్తోందంటే చాలు, గత సినిమా ఫలితంతో సంబంధం లేకుండా, అంచనాలు ఆకాశన్నంటేస్తాయి.. అందుకే.. బాక్సాఫీస్ రూలర్ ఆయన.
మధ్యలో దాదాపు తొమ్మిదేళ్ళపాటు రాజకీయాల కారణంగా సినీ పరిశ్రమకు చిన్న ‘బ్రేక్’ ఇచ్చినా, తిరిగి సినీ రంగంలోకి వస్తూనే బాక్సాఫీస్ రికార్డుల్ని తిరగరాసిన ఘనుడు ఈ మెగాస్టార్. చిరంజీవి అంటే ఓ పేరు మాత్రమే కాదు.. అదొక పవర్.. ఆయన నిఖార్సయిన బాక్సాఫీస్ విన్నర్.
అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ.. మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) తన ‘నెంబర్ వన్’ పొజిషన్‌ని కొనసాగించడమంటే చిన్న విషయం కాదు. 40 ఏళ్ళ క్రితం చిరంజీవికీ (Chiru), ఇప్పటికీ పెద్దగా మార్పుల్లేవ్. అదే కష్టం.. అదే బాధ్యత. అదే పట్టుదల. అందుకే, ఆయన కోట్లాదిమంది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేయగలిగారు.
ఆయనే నెంబర్ వన్
‘ఈ తరానికి చిరంజీవే నెంబర్ వన్. చిరంజీవితో నెంబర్ వన్ పొజిషన్ ఆగిపోతుంది. ఇకపై ప్రతి శుక్రవారం నెంబర్ వన్ పొజిషన్ మారిపోతుంది.. 1 నుంచి 10 వరకూ చిరంజీవే.. ఆ తర్వాత మేము..’ అని సాక్షాత్తూ సూపర్ స్టార్ మహేష్‌బాబు (Super Star Mahesh Babu) ఓ సందర్భంలో చెప్పాడంటే, అదీ మెగాస్టార్ చిరంజీవి స్టామినా.
ఎప్పుడో నలభయ్యేళ్ళ క్రితం ‘ప్రాణం ఖరీదు’ (Pranam Khareedu), ‘పునాది రాళ్ళు’ (Punadi Rallu) సినిమాలతో చిరంజీవి సినీ జర్నీ ప్రారంభమయ్యింది. అప్పటినుంచి ఇప్పటిదాకా 150కి పైగా సినిమాలు.. లెక్కలేనన్ని పాత్రలు.. కుప్పలు తెప్పలుగా రికార్డులు.. చెప్పుకుంటూ పోతే, అది ‘మెగా’ చిరంజీవితం.!
సామాన్యుడు సాధించిన స్టార్‌డమ్
అస్సలేమాత్రం సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి సినీ రంగంలోకి వచ్చి, అంచలంచెలుగా చిరంజీవి (Mega Star Chiranjeevi) ఎదిగిన వైనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమాల మీద ప్యాషన్.. ఆయన్ని నిత్య విద్యార్థిగా మార్చేసింది. నెగెటివ్ రోల్స్ కూడా కెరీర్ తొలి నాళ్ళలో చేశారు చిరంజీవి. ఒక్కసారి స్టార్ డమ్ వచ్చాక.. వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదాయనకి.
కమర్షియల్ సినిమాలు చేస్తూనే, చక్కటి మెసేజ్ ఇవ్వగలిగే కథాంశాల వైపు మొగ్గు చూపి, ఈ క్రమంలో కొన్ని ఫెయిల్యూర్స్ కూడా చవిచూశారు. అయినా, అక్కడితో ప్రయోగాలు మానలేదు. క్లాస్, మాస్.. అన్న తేడాల్లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ అలరించారాయన. ఒక్క మాటలో చెప్పాలంటే.. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించినంతవరకు ఆయన ఓ లెజెండ్.
సినిమా సినిమాకీ చిరంజీవి ‘స్టార్‌డమ్’ పెంచుకుంటూ పోతోంటే, రికార్డులు ఆయన ముందు ‘సాహో’ అన్నాయి. సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ దాకా.. సగటు సినీ ప్రేక్షకుడు ఆయనకి ఎన్ని బిరుదులు కట్టబెట్టినా, ‘చిరు’ అన్న పిలుపుకి ఆయన మురిసిపోయే తీరు చాలా ప్రత్యేకం.
అన్నయ్య.. ఆ పిలుపే ప్రత్యేకం
‘అన్నయ్యా..’ అని ఎవరన్నా పిలిస్తే, సొంత తమ్ముళ్ళుగా వాళ్ళని భావించడం చిరంజీవికే చెల్లింది. తెలుగు సినీ పరిశ్రమలో ‘అన్నయ్యా..’ అని చిరంజీవిని ఆప్యాయంగా పిలుచుకునే తమ్ముళ్ళ సంఖ్య చాలా చాలా ఎక్కువ. వాళ్ళంతా చిరంజీవికి తోడబుట్టిన నాగబాబు, పవన్‌కళ్యాణ్‌లానే.
తన అభిమానులపై చిరంజీవి ఆప్యాయత ఎప్పటికీ తగ్గదు.. అభిమానులకి ఆయన మీద ప్రేమాభిమానాలూ ఎప్పటికీ తరగవు. హిట్టు వస్తే ఉప్పొంగిపోయి, కాలరెగరేయడం.. ఫ్లాపొస్తే డీలాపడిపోవడం.. చిరంజీవికి తెలియని విద్య.
శివ శంకర వరప్రసాద్ అలియాస్ చిరంజీవి ‘ప్రాణం ఖరీదు’, ‘పునాదిరాళ్ళు’ సినిమా కోసం ఎలా కష్టపడ్డాడో, ఇప్పుడు ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా కోసం కూడా అలాగే కష్టపడ్తున్నాడు. ఆ మాటకొస్తే, కష్టపడే తత్వం మరింతగా పెరిగిందేమోగానీ, తనలో ఎప్పుడూ ‘రిలాక్స్ మోడ్’ అనేదే వుండదని చెబుతుంటారు చిరంజీవి.
అభిమానుల గుండెల్లో మెగా ‘ఖైదీ’ Mega Star Chiranjeevi
‘చిరంజీవి పనైపోయింది..’ అనే సందర్భాలూ వున్నాయ్.. కానీ, ఆ సందర్భాల్ని అవలీలగా జయించారు చిరంజీవి.. అదీ పట్టుదలతో. ఏ సినిమా చేసినా అంకితభావమే పెట్టుబడి చిరంజీవికి. అదే ఆయన్ని, మెగాస్టార్‌ని చేసింది. తెలుగు సినీ పరిశ్రమలో నెంబర్ వన్ ఛెయిర్‌ని కట్టబెట్టింది.
తొమ్మిదేళ్ళ తర్వాత ‘ఖైదీ నెంబర్ 150’ (Khaidi Number 15) సినిమాతో సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇస్తే.. వస్తూనే, 100 కోట్ల వసూళ్ళను కొల్లగొట్టిన ఘనుడు ఈ మెగాస్టార్. చిరంజీవి అంటే ఓ వ్యక్తి కాదు.. శక్తి. అవును, చిరంజీవి అంటే ఓ బ్రాండ్. సినిమాలే కాదు, సేవా కార్యక్రమాల్లోనూ చిరంజీవి (Mega Star Chiranjeevi The True Legend) తనదైన ముద్ర వేశారు.
మెగా రాజకీయం.. Mega Star Chiranjeevi
అయితే, ఎన్నో అంచనాలతో రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీతో (Praja Rajyam Party) ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయారు.
రాజకీయ పార్టీని నడపలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీతో ప్రజారాజ్యాన్ని కలిపేసి, ఆ తర్వాత కేంద్ర మంత్రి అవడం, కేంద్ర మంత్రిగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, రాజ్యసభ సభ్యుడిగానూ ప్రజల మనసుల్ని గెల్చుకోవడం తెలిసిన సంగతులే.
40 ఏళ్ళ క్రితం ‘నరసయ్య’ పాత్ర.. ఇటీవల ‘నరసింహారెడ్డి’ (Sye Raa Narasimha Reddy) పాత్ర. మధ్యలో రాజకీయ రంగ ప్రవేశం.. వెరసి, అలుపెరగని పోరాటం చిరంజీవిది. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో మరోమారు బాక్సాఫీస్ రికార్డుల్ని తిరగరాశారు చిరంజీవి (Mega Star Chiranjeevi The True Legend). ముందు ముందు ఆయన్నుంచి మరిన్ని అద్భుతాలు వెండితెరపై కనువిందు చేయాలని ఆశిద్దాం.