సన్నీలియోన్.. (Sunny Leone) పరిచయం అక్కర్లేని పేరు ఇది. ‘పెద్దలకు మాత్రమే’ అనదగ్గ ‘బూతు సినిమాల్లో’ నటించి, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న సన్నీలియోన్, ఆ తర్వాత అనూహ్యంగా ఆ కెరీర్‌ని వద్దనుకుని, బాలీవుడ్ (Sunny Leone Bollywood) సినిమాల వైపు మొగ్గు చూపింది. కొన్న తెలుగు సినిమాల్లోనూ చేసింది.
భారతీయ మూలాలున్న సన్నీలియోన్, ఇండియన్ సినిమా స్క్రీన్‌పై మెరుస్తుందని ఎవరూ ఊహించలేదు. ఎలాగోలా బాలీవుడ్ ఆఫర్ తొలుత దక్కినా, బాలీవుడ్‌లో అడుగు పెట్టడానికి ఆమె చాలా కష్టపడాల్సి వచ్చింది. ముంబైలో నిలువ నీడ దొరకని పరిస్థితి ఎదురైంది, ఆమె ‘గత నీలి చరిత్ర’ కారణంగా.
మహిళా సంఘాలు ఆమెకు వ్యతిరేకంగా నినదించాయి. ‘ఆమెతో ఎవరన్నా సినిమాలు చేశారో జాగ్రత్త’ అనే హెచ్చరికలు జారీ అయ్యాయి. ఎలాగోలా ఆమె తొలి సినిమా పూర్తి చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ నుంచీ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది. కొందరు హీరోలకు ఇంటిపోరు ఎదురయ్యింది.. ఆమెతో సినిమాలు చేయొద్దని.
కానీ, అదే బాలీవుడ్‌లో అగ్రహీరోలు సైతం సన్నీలియోన్‌తో సినిమాలు చేసేందుకు పోటీ పడే పరిస్థితి వచ్చింది.
‘ఇదంతా ఏదో ఆషామాషీగా అయిపోలేదు. నా ఇమేజ్ మార్చుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను. ఈ క్రమంలో బాలీవుడ్ నాకు చాలా నేర్పింది. ముంబై నాకు ఇంకా చాలా పాఠాలు నేర్పింది. ఇండియా నుంచి చాలా చాలా నేర్చుకున్నాను. భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్నీ అర్థం చేసుకున్నాను..’ అని సన్నీలియోన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
‘నన్ను ఇండియాలో అడుగు పెట్టనివ్వకూడదని ఎవరైతే అనుకున్నారో, వాళ్ళే నన్ను అభిమానించేలా నన్ను నేను మార్చుకోగలిగాను..’ అని అంటోంది సన్నీలియోన్. ఇండియాలో ఓ చిన్నారిని దత్తత తీసుకున్న సన్నీలియోన్, సరోగసీ విధానం ద్వారా మరో ఇద్దరు చిన్నారులకు తల్లి అయిన విషయం విదితమే.
విదేశాల్లో వున్నా ఇప్పుడు తన మనసు ఇండియా చుట్టూనే తిరుగుతోందనీ, ఎప్పటికీ భారతీయతను విడిచిపెట్టబోనని సన్నీలియోన్ చెప్పుకొచ్చింది. ‘బాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు వచ్చినా, రాకపోయినా.. ఇండియాతో నా అనుబంధం ఎప్పటికీ తెగిపోదు. నేను, నా పిల్లలు, నా భర్త.. భారతీయత పట్ల అమితమైన అభిమానం కలిగి వుంటాం..’ అని చెప్పింది సన్నీలియోన్.
ఒకప్పటి సంగతేమోగానీ, ఇప్పుడు నా ‘హాట్ అండ్ సెక్సీ సీక్రెట్’ నాకున్న అభిమానులే. వారి అభిమానంతోనే నేను, నా కుటుంబం ఆనందంగా వుంది. ఆ ఆనందమే, నన్ను ప్రతిరోజూ మరింత ఉత్సాహంగా, అందంగా వుండేలా చేస్తోందని చెబుతోంది సన్నీలియోన్.