మంచి మంచి సినిమాలు చేసి పాపులారిటీ పెంచుకుంటారు కొంతమంది. పెద్ద పెద్ద వివాదాలకు ఆస్కారం కల్పిస్తూ, పబ్లిసిటీ స్టంట్లు చేస్తారు ఇంకొందరు. ఎలాగైనా పెరిగేది పాపులారిటీనే. మంచి, చెడులనేవి (Radhika Apte About Leaked Video) ఆప్రస్తుతం.
అసలు ఇప్పుడెందుకిదంతా.. అంటే, బాలీవుడ్ నటి రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు చేసి మళ్లీ వార్తల్లోకెక్కింది. కొన్నాళ్ల క్రితం ‘పర్చేద్’ అనే సినిమాలో నటించింది రాధికా ఆప్టే. మంచి ఉద్దేశ్యంతో చేసిన సినిమానే అది. అయితే, ఉద్దేశ్యం మంచిదైతే సరిపోదు. అందులోని వల్గారిటీ.. విమర్శలూ, వివాదాలకు కారణమైంది.
నగ్నంగా ఈ సినిమాలో రాధికా ఆప్టే నటించింది. ఓ ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమా ప్రదర్శితమైంది. ఎలా లీకయ్యాయో తెలీదు కానీ, అందులోని నగ్న సన్నివేశాలు బయటికి వచ్చేశాయి. దాంతో తాను చాలా ఇబ్బంది పడ్డానని రాధికా ఆప్టే (Radhika Apte Hot) వాపోయింది. పాత కథే ఇది. కాస్త కొత్తగా ఆమె ఈ అంశాన్ని ప్రస్థావించిందంతే.
సినిమాలో తన పాత్ర ఏంటో తెలిసినప్పుడు, సినిమా చేసినప్పడు లేని బెరుకు, ‘ఆ సన్నివేశాలు’ బయటికి వచ్చాక ఎందుకు.? ఈ ప్రశ్న కూడా పాతదే. రాధికా ఆప్టే ఇలా చెపుతూనే ఉంటుంది. ఇష్టం లేకపోతే, ‘ఎందుకు చేశావ్.?’ లాంటి ప్రశ్నలూ (Radhika Apte About Leaked Video) ఆమె విషయంలో దూసుకొస్తుంటాయి.
రాధికా ఆప్టేకి (Radhika Apte Spicy) పబ్లిసిటీ కావాలంతే. ఆ పబ్లిసిటీ కోసం ఇలాంటి స్టంట్స్ చేస్తుంటుంది. ఒకటా.? రెండా.? లెక్కలేనన్ని పబ్లిసిటీ స్టంట్స్. దటీజ్ రాధికా ఆప్టే. తెలుగులో నందమూరి బాలక్రిష్ణ సరసన రెండు సినిమాల్లో నటించింది రాధికా ఆప్టే.