Home » ఓటీటీ రివ్యూ ‘అగధ’.! ‘మహాదేవి’ మ్యాజిక్ సరిపోలేదు.!

ఓటీటీ రివ్యూ ‘అగధ’.! ‘మహాదేవి’ మ్యాజిక్ సరిపోలేదు.!

by Mudra369 Editorial Desk
0 comments
Agadha Review

Agadha OTT Review.. దర్శక నిర్మాత ఎంఎస్ రాజు అంటే, ఒకప్పుడు భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్.! తొలుత నిర్మాతగా అత్యంత భారీ చిత్రాలు నిర్మించారాయన.!

ఎంఎస్ రాజు పేరు చెప్పగానే, ‘సక్సెస్సుల రారాజు..’ అనేవారంతా అప్పట్లో.! కానీ, ‘వాన’ సినిమా ఆయన్ని అదఃపాతాళానికి తొక్కేసింది.

అన్ని పెద్ద సినిమాలు తీసిన ఎంఎస్ రాజు.. అన్ని హిట్ సినిమాలు తీసిన ఎంఎస్ రాజు.. ఒక్క సినిమా పరాజయంతో అంత దారుణమైన పతనావస్థకు ఎలా దిగజారిపోయినట్లు.? ఇదో మిలియన్ డాలర్ క్వశ్చన్.

ఆ ఎంఎస్ రాజు, దర్శకుడిగా తెరకెక్కించిన సినిమానే ‘అగధ’.! ఈ సినిమాలో హీరోయిన్ డాక్టర్ సాయి కామాక్షి భాస్కర్ల తప్ప, పెద్దగా తెలిసిన నటీనటులెవరూ లేరు.

అయినాసరే, సినిమా రిలీజ్‌కి ముందుగా బాగానే హైప్ క్రియేట్ అయ్యింది. థియేటర్లలో ‘ఓకే’ అనిపించుకుందీ సినిమా.! ఓటీటీలోకి వచ్చాక, ‘అగధ’ గురించి కాస్త గట్టిగానే మాట్లాడుకుంటున్నారు.

Agadha OTT Review.. కథా కమామిషు ఏంటి.?

దేవుడు – దెయ్యం.. ఈ కాన్సెప్ట్‌తో గతంలో చాలా సినిమాలొచ్చాయ్.! ఆ కోటాలోనిదే ఈ ‘అగధ’ కూడా.! ఇంతకీ, ‘అగధ’ కథా కమామిషు ఏంటి.? తెలుసుకుందాం పదండిక.

మరణాలు సంభవిస్తుంటాయ్.. చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటుంటాయ్.! ఎందుకు ఏంటి.? అన్నదానిపై ఫోకస్ పెడుతుంది మహాదేవి.

ఊళ్ళో ఎవరికి ఏ సమస్య వచ్చినా మహాదేవి దగ్గరకు వచ్చి, ఉపశమనం పొందుతంటారు చీడ పీడల నుంచి. మరి, ఆ మహాదేవి కుటుంబ సభ్యులకే ఆపద వస్తే.?

ఆ ఆపద పేరు ‘అగధ’.! ఇంతకీ, ‘అగధ’ ఎవరు.? ఎందుకు, మహాదేవి కుటుంబం మీద ‘అగధ’ పగబట్టింది.? అది తెలియాలంటే, తెరపై చూడాల్సిందే.

ఓ మారుమూల పల్లెటూరులో జరుగుతుందీ తతంగమంతా.! ఓ చిన్న ప్రాంతంలోనే కథ మొత్తం తిప్పేశారు. డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా.. అని చెబుతుంటారు చాలామంది నటీనటులు.

డాక్టర్ సాయి కామాక్షి భాస్కర్ల.. నిజంగానే డాక్టర్.! నటన మీద ఇష్టంతో, గ్లామరస్ ప్రపంచంలోకి వచ్చింది. హీరోయిన్‌గా ఛాన్సులు పెద్దగా రావట్లేదుగానీ, ఇదిగో ఈ తరహా సినిమాల్లో అవకాశాలు బాగా వస్తున్నాయి.

వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటోంది కూడా. ‘అగధ’ సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిెంట్ మహాదేవి పాత్రనే. ఆ పాత్రలో చక్కగా ఒదిగిపోయింది.

మహాదేవికి మోడ్రన్ టచ్ ఇచ్చి వుంటే..

అయితే, ‘అగధ’ క్యారెక్టర్‌కి కాస్త మోడ్రన్ టచ్ ఇచ్చి వుండాల్సింది. ఆమె కేపబుల్ కూడా.! జోవిక విజయ్ కుమార్, ఉల్కా గుప్తా.. తదితరులంతా ఓకే. మిగతా పాత్రధారులంతా తమ తమ పాత్రల పరిధి మేర మమ.. అనిపించేశారు.

సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా కుదిరాయి. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా వుండి వుంటే బావుండేదమో. డైలాగ్స్ కూాడా ఓకే. నిర్మాణపు విలువల గురించి మాట్లాడుకోవాలంటే, సినిమాకి అవసరమైన మేర ఖర్చు చేశారు.

కానీ, ఎంఎస్ రాజు సినిమాలంటే ఎలా వుడాలి.? భారీ స్థాయిలో వుండాలి. ఆ భారీతనమే లోపించిందిక్కడ.

అన్నట్టు, ‘అగధ’ ఎవరు.? ఏంటి.? అన్న విషయం కాస్త గందరగోళంగా అనిపిస్తుంటుంది. అదొక మైనస్ పాయింట్. ఈ తరహా సినిమాల్ని ఇష్టపడేవారిని సినిమా బాగానే ఎంజాయ్ చేస్తుంది ఓటీటీలో.

చాలా పెద్ద సినిమాలు భారీ హంగామా, విపరీతమైన పబ్లిసిటీతో వచ్చి బొక్క బోర్లా పడిన సంగతి తెలిసిందే. వాటితో పోల్చితే, ‘అగధ’ ఏమంత నిరాశపర్చదు.

క్లయిమాక్స్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. నిజానికి, సినిమా సెకెండాఫ్ నుంచే వేగం పుంజుకుంటుంది. ఫస్టాఫ్ సోసో అనిపిస్తుంది. సెకెండాఫ్‌లో కథ వేగంగా నడుస్తుంది.

చివర్లో, ప్రేక్షకుడు కోరుకున్న థ్రిల్ అయితే లభిస్తుంది. ముందే చెప్పుకున్నట్లు, ‘మహాదేవి’ పాత్రలో, నటి డాక్టర్ సాయి కామాక్షి భాస్కర్లకు మోడ్రన్ టచ్ ఇచ్చి వుండాల్సింది.

దైవ శక్తికీ, దుష్ట శక్తికీ మధ్య జరిగే పోరాటంలో దుష్ట శక్తిని దైవ శక్తి జయించడమనేది ఎన్నో సినిమాల్లో చూసిందే. కాకపోతే, ఇంట్రెస్టింగ్ క్లయిమాక్స్ డిజైన్ చేయగలిగాడు దర్శకుడు.

పిల్లలతో కలిసి సినిమాని నిరభ్యంతరంగా చూడొచ్చు. జంప్ స్కేర్స్ పెద్దగా ఏం లేవు. కాకపోతే, తలలు నరికే సీన్స్.. అవసరమా.? అనిపిస్తుంది.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group