Home » ఏఐ వీడియోలపై 7 వేల కోట్ల రూపాయలకు ఊర్వశి లీగల్ నోటీస్.!

ఏఐ వీడియోలపై 7 వేల కోట్ల రూపాయలకు ఊర్వశి లీగల్ నోటీస్.!

by Mudra369 Editorial Desk
0 comments
Urvashi Rautela

Urvashi Rautela 7000Cr AI.. సినీ నటి ఊర్వశి రౌతెలా, తనను పోలిన ఏఐ వీడియోలు చేస్తున్న ఓ కంపెనీపై ఏకంగా 7 వేల కోట్ల రూపాయలకు లీగల్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైంది.

సదరు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ సంస్థ, తనను ఏఐ ద్వారా చూపిస్తూ వీడియోలు చేయడం ద్వారా ఏడు వేల కోట్లు సంపాదించిందని ఆరోపిస్తోంది ఊర్వశి రౌతెలా.

గతంలో, తమ ఫొటోల్ని అలానే వీడియోల్ని తమకు తెలియకుండా వినియోగించడంపై పలువురు సినీ ప్రముఖులు న్యాయస్థానాల్ని ఆశ్రయించిన విషయం విదితమే.

తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులూ ఈ లిస్టులో వున్నారు. అలా వారిలో కొందరికి, న్యాయస్థానం నుంచి రక్షణ కూడా లభించింది ఏఐ వీడియోలు, ఫొటోల విషయంలో.

అయితే, ఎవరూ ఈ స్థాయిలో పరువు నష్టం దావానో, క్రిమినల్ చర్యలు కోరుతూనో లీగల్ నోటీసులు జారీ చేసింది లేదు. ఊర్వశి ఈ విషయంలో ఓ అడుగు ముందుకేసింది.

Urvashi Rautela
Urvashi Rautela

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాని ముంచెత్తుతున్నాయి ఏఐ వీడియోలు, ఫొటోలు. మరీ ముఖ్యంగా ఏఐ వీడియోలైతే ‘అడల్ట్ కంటెంట్’ స్థాయిలో రూపొందుతున్నాయి.

ప్రముఖ నటీనటులకు సంబంధించిన ఏఐ వీడియోలతో, వందల కోట్లు.. వేల కోట్లు వెనకేసుకుంటున్నాయి కొన్ని కంపెనీలు.. అన్న ఆరోపణలూ లేకపోలేదు.

ప్రధానంగా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, ఈ ఏఐ వీడియోల కారణంగా ముందు ముందు తీవ్ర సంక్షోభం ఎదుర్కోవాల్సి రావొచ్చు.

ఈ భయాలు సినీ పరిశ్రమలో గట్టిగానే వున్నాయి. అందుకేనేమో, ఊర్వశి తీసుకున్న బోల్డ్ డెసిషన్ పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

ఏడు వేల కోట్లు, ఊర్వశి రౌతెలాకి వస్తాయా.? సదరు కంపెనీ ఆ మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధమవుతుందా.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తుండడం గమనార్హం.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group