Chiranjeevi Politics Jail Theory.. నిజమే కదా.! చిరంజీవికి ఎందుకు రాజకీయం.? చిరంజీవి దోపిడీలు చేయలేదు. సూట్ కేసు కంపెనీలూ పెట్టలేదు.!
చిరంజీవి రాజకీయాల్లో రాణించలేడు.! ఎందుకంటే, చిరంజీవి బూతులు తిట్టలేడు గనుక.! చిరంజీవికి రాజకీయాలు సరిపడవు. ఎందుకంటే, చిరంజీవికి ఫ్యాక్షనిజం చేతకాదు కాబట్టి.!
చాలా లోటుపాట్లున్నాయ్ చిరంజీవిలో. చిరంజీవికి తెలిసింది సినిమాల్లో నటించడం. తద్వారా సంపాదించిన మొత్తంలోంచి కొంత, సేవా కార్యక్రమాలకు వినియోగించడం.
ఓట్లు కొనుక్కోవడం చిరంజీవికి (Mega Star Chiranjeevi) తెలియలేదు. అందుకే, చిరంజీవి రాజకీయాల్లో రాణించలేకపోయాడు.!
Chiranjeevi Politics Jail Theory.. ప్చ్.. జైలు రాజకీయం తెలియదే..
అంతేనా, చిరంజీవికి నేరాలు చేసి జైలుకు వెళ్ళలేదు.! ఇదే కీలకమైన అంశం. రాజకీయాల్లో రాణించాలంటే, నేరస్తులనే ‘స్టాంప్’ వేయించుకోవాలి.
‘ఫోర్ ట్వంటీ’ అయితే తప్ప, రాజకీయాల్లో రాణించడం కష్టం. అక్రమాస్తుల కేసులో జైలుకెళ్ళి, అక్కడ చిప్పకూడు తింటే తప్ప రాజకీయ అనుభవం వచ్చినట్టు కాదు.!

ఇవన్నీ చేయడం చిరంజీవి వల్ల కాదు.! చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్‌కి (Power Star Pawan Kalyan) కూడా ఇవన్నీ చేతకావడంలేదు.!
సేవా కార్యక్రమాల కోసం కోట్లు ఖర్చు చేస్తారు తప్ప, ఓట్లు కొనేందుకు లక్షలు కూడా ఖర్చు చేయరు. అదే చిరంజీవితో సమస్య. చిరంజీవి తమ్ముడు కదా.. పవన్ కళ్యాణ్‌కి కూడా అదే చేతకానితనం వచ్చేసింది.
తల్లీ చెల్లీ.. కాదేదీ రాజకీయానికి అనర్హం..
తల్లిని తరిమెయ్యడం చిరంజీవికి చేతకాలేదు.! చెల్లిని వదిలించుకోవడమూ చిరంజీవికి చేతకాలేదు.! ఇవి చేస్తేనే కదా, రాజకీయ అనుభవం సాధించినట్లు.?
చచ్చిపోయిన బాబాయ్‌కి అక్రమ సంబంధాలు అంటగట్టేంత రాజకీయ తెలివి చిరంజీవికి (Mega Star Chiranjeevi) లేకుండా పోయిందాయె.!
ఔను, చిరంజీవికి రాజకీయాలు చేతకాలేదు.! నిజమే, చిరంజీవికి రాజకీయాలు తెలియదు. తెలియాల్సిన అవసరం కూడా లేదు.
Also Read: హైపర్ ఆది కథ.! ‘చిన్న పెగ్గు – పెద్ద పెగ్గు’.!
ఎందుకంటే, చిరంజీవి సేవాభావంతో రాజకీయాలు చేయాలనుకున్నారు.! నేరపూరిత ఆలోచనలతో రాజకీయం చేయాలనుకోలేదు.

చిరంజీవి (Chiranjeevi) తమ్ముడు కదా.. పవన్ కళ్యాణ్ కూడా అంతే.! సమాజంలో మార్పు కోరుకున్నాడు.! సమాజాన్ని నేరమయం చేసెయ్యాలనుకోలేదు.
చివరగా.. దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ పురస్కారాన్ని దక్కించుకున్న చిరంజీవిని విమర్శించడానికి.. ప్రతి వెధవా మీడియా ముందుకొచ్చేస్తాడు.! ఇదీ లోకం తీరు.!