Home » జూనియర్ ఎన్టీయార్ సీఎం అయితేనే బాలయ్యకి మంత్రి పదవా.!?

జూనియర్ ఎన్టీయార్ సీఎం అయితేనే బాలయ్యకి మంత్రి పదవా.!?

by Mudra369 Editorial Desk
0 comments
Jr NTR

CM NTR Balakrishna Minister.. సినీ నటుడు జూనియర్ ఎన్టీయార్ ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తాడోనని అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

తమిళనాడులో సినీ నటుడు విజయ్, రాజకీయాల్లోకి వస్తూనే సీఎం అయిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీయార్ కూడా రాజకీయాల్లోకి వచ్చి సీఎం అయిపోవాలన్నది అతని అభిమానుల కోరిక.

తాజాగా, ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందడి చేసిన జూనియర్ ఎన్టీయార్‌కి ‘సీఎం ఎన్టీయార్’ నినాదాలు ఎదురయ్యాయి. ఇదేమీ ఆయనకు కొత్త కాదు.

నిజానికి, జూనియర్ ఎన్టీయార్ కోసం ‘రా ఎన్టీయార్’ పేరుతో ఓ సంస్థని ఏర్పాటు చేసి, దాని ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టారు కొందరు అభిమానులు.

అయితే, ఆ సంస్థ కార్యకలాపాలతో తనకెలాంటి సంబంధం లేదని జూనియర్ ఎన్టీయార్ ఓ ప్రకటనతో స్పష్టతనిచ్చేశాడు. దాంతో, ఆ సంస్థ సైలెంటయిపోయింది.

స్వర్గీయ నందమూరి తారక రామారావు తనయుడు హరికృష్ణ చిన్న కొడుకు జూనియర్ ఎన్టీయార్. పేరు కలిసొచ్చింది కదా, రాజకీయ వారసుడు కూడా జూనియర్ ఎన్టీయారేనన్నది అభిమానుల ఉవాచ.

CM NTR Balakrishna Minister.. సినీ నటుడిగా స్టార్‌డమ్ సరే.. రాజకీయం సంగతేంటి.?

స్టార్‌డమ్ పరంగా చూసుకున్నా, జూనియర్ ఎన్టీయార్ రేంజ్ వేరే.! సో, అభిమానులు జూనియర్ ఎన్టీయార్‌కి కనెక్ట్ అయిపోవడంలో వింతేముంది.?

కానీ, మధ్యలో నందమూరి బాలకృష్ణ వున్నారు కదా.! ఆయన త్రీ టైమ్స్ ఎమ్మెల్యే. కానీ, ఇంతవరకు మంత్రి పదవే ఆయన్ని వరించలేదు.

పైగా, ఎన్నికల సమయంలో హడావిడి తప్ప, రాజకీయంగా ఏనాడూ బాలయ్య యాక్టివ్‌గా వుండరు. బావ చంద్రబాబు, టీడీపీ బాధ్యతల్ని తన గుప్పిట్లో పెట్టుకున్నా, బాలయ్య ఎప్పుడూ పెదవి విప్పరు.

అందుకే, టీడీపీని తిరిగి నందమూరి కుటుంబం చేతికి రావాలనీ, అది జూనియర్ ఎన్టీయార్ టీడీపీ పగ్గాలు చేపడితేనే జరుగుతుందన్నది అభిమానుల డిమాండ్.

Nandamuri Balakrishna
Nandamuri Balakrishna

చంద్రబాబు తర్వాత నారా లోకేష్‌కే టీడీపీ పగ్గాలు వెళతాయి తప్ప, జూనియర్ ఎన్టీయార్‌కి ఆ అవకాశమే వుండదన్నది బహిరంగ రహస్యం.

గతంలో టీడీపీ తరఫున ఓ సారి ఎన్నికల ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీయార్, మళ్ళీ టీడీపీ వైపు చూసే అవకాశమే లేకుండా పోయింది.

అభిమానులు మాత్రం, ‘సీఎం ఎన్టీయార్.. జై ఎన్టీయార్..’ అనే నినాదాలు చేస్తూనే వున్నారు.

2024 ఎన్నికలకు ముందర, ఈ నినాదాలు చాలా ఎక్కువగా కనిపించేవి, వినిపించేవి. ప్రత్యేకంగా జెండాలు రూపొందించుకుని మరీ హడావిడి చేశారు జూనియర్ ఎన్టీయార్ అభిమానులు.

అసలంటూ, జూనియర్ ఎన్టీయార్‌కే రాజకీయాలపై ఆసక్తి లేనప్పుడు, అభిమానులు ఎంత గోల చేస్తే మాత్రం ఏం ప్రయోజనం.?

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group