Samantha Stunning Pregnancy Look.. సినీ నటి సమంత ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే.
అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య రీసెంట్‌గా సమంత శ్రీమంతం వేడుక కూడా సింప్లీ అండ్ సూపర్బ్‌గా నిర్వహించడం జరిగింది.
తాజాగా సమంత తన ప్రెగ్నెన్సీ లుక్స్‌లో ఓ స్పెషల్ ఫోటో షూట్ చేయించుకుంది. ట్రెడిషనల్ అండ్ డీసెంట్ లుక్స్‌లో తన బేబీ బంప్‌ని చూపిస్తూ ఈ ఫోటోల్లో సమంత మెరిసిపోవడం స్పెషల్‌గా కనిపిస్తోంది.
పిస్తా గ్రీన్ సింపుల్ జార్జెట్ శారీలో సమంత చేయించుకున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.
Samantha Stunning Pregnancy Look.. డిగ్నిఫైడ్ బేబీ బంప్ లుక్స్..
ఈ మధ్య కొందరు సెలబ్రిటీలు తమ బేబీ బంప్‌ని కూడా ప్రమోషన్స్ కోసం వాడేస్తూ.. పనిలో పనిగా అందులోనూ అందాల ప్రదర్శన చేసేయడం ఓ ట్రెండింగ్‌గా పెట్టుకున్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
కానీ, సమంత మాత్రం అందుకు భిన్నంగా చాలా చక్కగా హుందాగా కనిపించేలా బేబీ బంప్ ఫోటో షూట్ చేసుకోవడం పట్ల నెటిజనం ప్రశంసలు గుప్పిస్తున్నారు.

ఇక, సమంత ధరించిన శారీ విషయానికి వస్తే, పిస్తా గ్రీన్ షేడ్‌లో వున్న ఫ్యూర్ శాటిన్ సిల్క్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేయబడింది.
ఈ ఫ్యాబ్రిక్‌కి బేసిగ్గా వున్న ఫాలింగ్ నేచర్ ప్రెగ్నెన్సీ టైమ్‌లో స్కిన్‌కి చాలా కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది.
అంతే కాదు ఈ ఫ్యాబ్రిక్‌పై వున్న స్మూత్ షైన్ మరియు ఫ్లోయింగ్ ఫాల్ లుక్‌కి చాలా ప్రశాంతమైన, రాయల్ వైబ్‌ని తెచ్చి పెడుతుంది.
ఆల్వేస్ సమంత స్పెషల్.!
రెగ్యులర్ ట్రెడిషనల్ శారీలా కాకుండా, మోడ్రన్ కేఫ్ లేదా కఫ్తాన్ టైప్ లూజ్ డ్రేపింగ్‌తో డిజైన్ చేశారు. ఈ శారీకి హై బోట్ నెక్ స్టైల్‌లో డిజైన్ చేసిన బ్లౌజ్ చీర అందాన్నీ, సమంత లుక్‌నీ మరింత ఎలివేట్ చేస్తోంది.
శారీకి మ్యాచ్ అయ్యేలా ఎమరాల్డ్ పొదిగిన నెక్లెస్ ఈ లుక్‌ని మరింత క్లాసీగా మార్చేసింది. చేతులకు సింపుల్ బంగారు గాజులు, చాలా సింపుల్‌గా కనిపించే చెవి దుద్దులు టోటల్ లుక్‌ని బ్యాలెన్స్‌డ్‌గా వుంచుతున్నాయ్.
ఇక, ఫేస్‌లో నేచురల్ ప్రెగ్నెన్సీ లుక్ డ్యామేజ్ కాకుండా చేసిన సింపుల్ మేకప్ అండ్ లిప్‌స్టిక్ పెర్‌ఫెక్ట్‌గా సూటయ్యాయి.
అలాగే సాఫ్ట్ వేవ్స్‌తో లూజ్‌గా వదిలేసిన హెయిర్ స్టైల్ సమంతకు పరిపూర్ణమైన డిగ్నిటీతో కూడిన మాతృత్వపు కళను తెచ్చిపెడుతున్నాయ్.
అందుకే సమంత ఈ తాజా లుక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో స్సెషల్‌గా ట్రెండ్ అవుతున్నాయ్.
