Table of Contents
కంగనా రనౌత్ (Kangana Ranaut), తాప్సీ పన్ను.. (Taapsee Pannu) ఇద్దరూ ప్రముఖ సినీ తారలే. ఒకరితో ఒకరికి ఎక్కడ చెడింది.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఒకర్నొకరు విమర్శించుకుంటూ వుంటారు, ఎగతాళి (Cold War Between Kangana Ranaut and Taapsee Pannu) చేసుకుంటూ వుంటారు.
ఏంటీ, ఇదంతా నిజమేనా.? అంటే, నిజమేనని నమ్మాల్సిందేనేమో. అంతలా విమర్శించేసుకుంటుంటారు. ఒక్కోసారి ఒకర్నొకరు అభినందించేసుకుంటుంటారు కూడా.
ఎవరిది ‘ఏ’ గ్రేడ్.? ఎవరిది ‘బి’ గ్రేడ్
‘నేను వదిలేసిన అవకాశాల్ని దొరకపుచ్చుకోవడానికి నిర్మాతల్ని దేబిరిస్తుంటుంది తాప్సీ..’ అని కంగనా రనౌత్ పలు సందర్భాల్లో విమర్శించింది. ‘ఆ అవసరం నాకు లేదు. నా దగ్గరకు వచ్చే కథల్లో నాకు నచ్చినవి మాత్రమే నేను ఎంపిక చేసుకుంటాను..’ అని చెబుతుంటుంది తాప్సీ. ఈ క్రమంలో ‘గ్రేడ్’ రచ్చ కూడా ఇద్దరి మధ్యా జరుగుతుంటుంది.
Also Read: రీల్ & రియల్ హీరోయిజం.. Mega ఆపన్నహస్తం.?
తాప్సీని (Taapsee Pannu) కంగనా రనౌత్ (Kangana Ranaut) ‘బి’ గ్రేడ్ నటిగా అభివర్ణించడం చాలా సందర్భాల్లోనే చేసింది. తాప్సీ తక్కువేం తిన్లేదు, ఎవరికి ఎలాంటి గ్రేడ్ ఇవ్వాలన్నది ప్రేక్షకులు నిర్ణయిస్తారంటూ కంగన మీద సెటైర్లేస్తూ వచ్చింది.
తాజాగా ఇంకోసారి ఈ ఇద్దరి మధ్యా రచ్చ జరిగింది. తన తాజా సినిమా ప్రమోషన్ సందర్భంగా తాప్సీ మీడియా ముందుకొస్తే, కంగనా రనౌత్ గురించి ప్రశ్నించాడో మీడియా ప్రతినిథి. దానికి తాప్సీ సమాధానమిస్తూ, కంగన గురించి ప్రస్తావించడం అసందర్బం.. ఆమెను నేను పట్టించుకోవడంలేదని తేల్చేసింది.
కంగన (Kangana Ranaut) మళ్ళీ గుస్సా అయ్యింది..
‘నీ సినిమా ప్రమోషన్లలో నా పేరు ఉపయోగించడం మానేస్తే మంచిది..’ అని ఉచిత సలహా ఇచ్చింది కంగనా రనౌత్. అయితే, బాలీవుడ్ సినీ జనాలు మాత్రం, కంగన – తాప్సీ.. (Kangana Ranaut Vs Taapsee Pannu) ఓ ఖచ్చితమైన అవగాహనతో ఇలా పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారనే అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు.
Also Read: చింపేస్తాం.. పోగులే ధరిస్తాం.. అంతా మా ఇష్టం.!
ఏమో, ఇద్దరూ కలిసి పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారేమో.. లేకపోతే, పనిగట్టుకుని కంగన, తాప్సీని ఎందుకు కెలుకుతుంది.? నో కామెంట్.. అని ఊరుకోకుండా కంగన ప్రస్తావన తాప్సీ (Cold War Between Kangana Ranaut and Taapsee Pannu) ఎందుకు తెస్తుంది.?