Dhanush Political Entry.. విజయ్ కాంత్ పోరాడాడు.. రజనీకాంత్ భయపడ్డాడు.. కమల్ హాసన్ సర్దుకుపోయాడు.. విజయ్ మాత్రం గెలిచి, ముఖ్యమంత్రి అయ్యాడు.
రాజకీయాల్లో సినీ గ్లామర్ కొత్తేమీ కాదు. అందునా, తమిళనాడు రాజకీయాల్లో సినీ గ్లామర్ వెరీ వెరీ స్పెషల్. చాలామంది సినీ తారలు రాజకీయాల్లోకి వచ్చారు, వస్తూనే వున్నారు.
తాజాగా, సినీ నటుడు జోసెఫ్ విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న సంగతి తెలిసిందే.
విజయ్‌ని ఆదర్శంగా తీసుకున్నాడో ఏమో, తమిళ సినీ నటుడు ధనుష్ కూడా రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.
తమిళగ ఎళుచ్చి కళగం.. పేరుతో ధనుష్ ఓ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై, ధనుష్ ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు.
Dhanush Political Entry.. అభిమానులే పార్టీ పేరుని ఖరారు చేసేశారా.?
కానీ, ధనుష్ తరఫున అతని అభిమానులు కొందరు, ఈ తమిళగ ఎళుచ్చి కళగం పేరుని కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
కొన్నాళ్ళ క్రితం ఓ కార్యక్రమంలో, ధనుష్ తన అభిమానులకి ‘సేవా కార్యక్రమాలపై’ దిశా నిర్దేశం చేశారు.
సినిమాలు మాత్రమే కాదు, సేవా కార్యక్రమాల్లో ముందుండాలి, ప్రజా సమస్యలపై స్పందించాలని పిలుపునిచ్చాడు.
అప్పటినుంచే, ధనుష్ రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ధనుష్, తమిళనాట తిరుగులేని పాపులారిటీ వున్న నటుడు.. స్టార్ హీరో.
ధనుష్ సినిమాలే కాదు, ధనుష్ వాగ్ధాటి చాలా ప్రత్యేకం. అదే, రాజకీయాల్లో ధనుష్‌కి బలం.. అన్న చర్చ, తమిళనాట రాజకీయ విశ్లేషకుల్లో జరుగుతోంది.
సినిమాలు వేరు, రాజకీయాలు వేరు.. అని, వేరే రాష్ట్రాల్లో అనుకున్నట్లు, తమిళనాడులో అనుకోవడానికి వీల్లేదు. తమిళనాడులో సినిమాలు, రాజకీయాలు కలగలిసే వుంటాయ్.
అయినా, ఇప్పుడు రాజకీయాల్లో సినీ గ్లామర్ మరింతగా పెరుగుతూ వస్తోంది. తమిళనాడు సీఎం విజయ్ సినీ నటుడే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సినీ నటుడే.
విశాల్ తదితరులు కూడా త్వరలో యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వస్తారన్న ప్రచారం జరుగుతోంది తమిళనాడులో. హీరో అజిత్ కుమార్ కూడా రాజకీయాల్లోకి రావడం దాదాపు ఖాయమే.