Home » ఇంజనీరింగ్ అద్భుతం: ముంబై ‘సీ లింక్’ బ్రిడ్జి ప్రత్యేకతలివీ.?

ఇంజనీరింగ్ అద్భుతం: ముంబై ‘సీ లింక్’ బ్రిడ్జి ప్రత్యేకతలివీ.?

by Mudra369 Editorial Desk
0 comments
Bandra Varli Sea Link Bridge

Bandra Varli Sea Link Bridge.. బాంద్రా – వర్లి సీ లింక్ కేబుల్ బ్రిడ్జ్.. అరేబియా సముద్రపు అలల మధ్య గంభీరంగా నిలబడే ఈ వంతెన గురించి మీలో ఎంత మందికి తెలుసు.?

ఇది కేవలం ఒక రహదారి మాత్రమే కాదు. ఆదునిక భారతదేశపు ఇంజనీరింగ్ అద్భుతంగా అభివర్ణించుకోవచ్చు.

ముంబై అనగానే చాలా ప్రత్యేకమైన ల్యాండ్ మార్క్స్ గుర్తొస్తాయ్. వాటన్నింట్లోకెల్లా ఈ ‘బాంద్రా – వర్లి సీ లింక్ కేబుల్ బ్రిడ్జ్’ అత్యంత ప్రత్యేకమైనది.

వెస్ట్ ముంబైలోని బాంద్రా నుంచి సౌత్ ముంబైలోని వర్లికి వెళ్లే రహదారిని కలిపే లింకే ఈ కేబుల్ బ్రిడ్జ్. మహారాష్ట్ర స్టేట్ రోడ్డు డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో హిందుస్థాన్ కనస్ట్రక్షన్ కంపెనీ దీనిని నిర్మించింది.

Bandra Varli Sea Link Bridge.. దాదాపు పదేళ్ల పాటు సాగిన వంతెన నిర్మాణం:

2000 వ సంవత్సరంలో ప్రారంభమైన ఈ వంతెన నిర్మాణం దాదాపు పదేళ్ల పాటు సాగింది. మొత్తం 8 లేన్ల (4+4) తో ఈ వంతెన నిర్మాణం జరిగింది.

ఈ సీ లింక్ వంతెన కారణంగా బాద్రా నుంచి వర్లి వెళ్లే ప్రయాణంలో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది.

ఇది రాకముందు బాంద్రా నుంచి వర్లి వెళ్లడానికి దాదాపు 45 నుండి 60 నిమిషాలు (ఒక గంట) సమయం పట్టేది.

తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఈ సమయానికి అదనం. అలాంటిది ఈ బ్రిడ్జ్ రాకతో ఆ ప్రయాణ సమయం కేవలం 7 నుంచి 10 నిమిషాలకి తగ్గిపోయింది.

సీ లింక్ బ్రిడ్జ్ ప్రత్యేకతలు..

వంతెన మొత్తం పొడవు 5.6 కిలోమీటర్లు. భారతదేశంలోనే మొట్ట మొదటి సారి ఓపెన్ సముద్రంపై నిర్మించిన కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్ ఇదే కావడం విశేషం.

సముద్రం మధ్యలో డైమండ్ ఆకారంలో వుండే 126 మీటర్ల వెత్తైన స్టీల్ టవర్లు వంతెనకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.

టవర్ల నుంచి వందలాది హై టెన్షన్ స్టీల్ కేబుల్స్ వంతెన రోడ్డును బలంగా పట్టి వుంచుతాయ్.

భారీ భూకంపాలు, గాలుల్ని తట్టుకుని నిలబడేలా.!

రిక్టర్ స్టేల్‌పై 7.0 తీవ్రత వరకూ వచ్చే భూకంపాల్ని సైతం తట్టుకునేలా ఇందులో ప్రత్యేకమైన ‘సెస్మిక్ అరెస్ట్స్’ అమర్చారు. ఈ వంతెనపై టూ వీలర్స్, త్రీ వీలర్స్ మరియు నడకదారులకు అనుమతి లేదు.

బ్రిడ్జ్‌పై నిలబడి ఫోటోలు, వీడియోలు తీసుకోవడం నిషిద్ధం. కార్లకు, ఇతర వాహనాలకు టోల్ ఫీజు వసూలు చేస్తారు.

ఈ సీ లింక్ బ్రిడ్జ్ కేవలం ముంబై నగర ట్రాఫిక్ సమస్యలు తీర్చడానికే కాదు. ముంబై నగర స్కై లైన్‌కి ఒక ఆధునిక అందాన్ని తెచ్చిపెట్టింది.

రాత్రి వేళల్లో విద్యుత్ దీపాలతో ఈ బ్రిడ్జ్ సొగసులు వర్ణనాతీతం. ఖచ్చితంగా ముంబై వెళ్లిన ప్రతీ ఒక్కరూ తప్పక చూడాల్సిన పర్యాటక ఆకర్షణలో ఈ బ్రిడ్జ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group