Home » ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డ ‘గరివిడి లక్ష్మి’ పాత్రలో, తెలంగాణ ఆడ బిడ్డ.!

ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డ ‘గరివిడి లక్ష్మి’ పాత్రలో, తెలంగాణ ఆడ బిడ్డ.!

by Mudra369 Editorial Desk
0 comments
Garividi Lakshmi

Garividi Lakshmi Burrakatha Anandhi.. తెలుగమ్మాయే.. కానీ, తమిళ సినిమాలతో పాపులర్ అయ్యింది ఆనంది.!

అచ్చంగా తెలంగాణ అమ్మాయి.! వరంగల్ ఆడపడుచు ఈ ఆనంది. ‘గరివిడి లక్ష్మి’ సినిమాలో టైటిల్ రోల్ చేస్తోందీ బ్యూటీ.

‘గరివిడి’ అంటే, విజయనగరం జిల్లాలోని ఓ గ్రామం. ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ ‘గరివిడి లక్ష్మి’.! బుర్రకథకి తనదైన ప్రత్యేకతను అద్దిన గొప్ప కళాకారిణి. అంతే కాదు, మంచి సింగర్ కూడా.!

అప్పుడెప్పుడో, గరివిడి లక్ష్మి అంటే, ఉత్తరాంధ్రలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో బీభత్సమైన ఫాలోయింగ్. అది టేప్ రికార్డర్ల కాలం.! ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఇప్పటి తరానికి గరివిడి లక్ష్మి అంటే ఎవరో తెలియదు.

ఆ బుర్రకథలు, ఆ హరి కథలు.. ఆ జానపదాలు.. మళ్ళీ ఇప్పుడు కొత్తగా నేటి తరానికి పరిచయమవుతున్నాయి. అదీ సినిమాల ద్వారా.! తెలంగాణ ఆట, పాట.. చాలా సినిమాల్లో చూస్తున్నాం.

ఆ మధ్య ‘పలాస’ సినిమా కోసం ఉత్తరాంధ్ర జానపదాల్ని తీసుకున్నారు. కొన్ని సినిమాల్లో అడపా దడపా, ఆ ఉత్తరాంధ్ర ఆట, పాట కనిపిస్తున్నాయనుకోండి.. అది వేరే సంగతి.

తెలంగాణ యాసని పట్టుకున్నంత అద్భుతంగా, ఉత్తరాంధ్ర యాసని సినిమాల్లో ఇంకా పట్టుకోలేకపోతున్నారు.

‘ఫిదా’ సినిమా కోసం తెలంగాణ యాసని ఔపోసన పట్టేసిన సాయి పల్లవి, ‘తండేల్’ సినిమా కోసం మాత్రం, ఉత్తరాంధ్ర యాసని నేర్చుకోలేకపోయింది. అంత సంక్లిష్టత ఉత్తరాంధ్ర యాసలో వుంటుంది.

నో డౌట్, ఆనంది మంచి నటి. మరి, ఆనంది అయినా ఉత్తరాంధ్ర యాసని బాగా పట్టుకోగలుగుతుందా.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్.

‘గరివిడి’ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో మాత్రం, కమెడియన్ షకలక శంకర్ (ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినోడే)తో కలిసి వేదిక మీద భలే అదరగొట్టేసింది.

వాస్తవానికి, ‘గరివిడి లక్ష్మి’ని ఎంతమంది అభిమానిస్తారో.. అలాగే, ఆమెని హేలనగా చూసేవాళ్ళూ ఎక్కువమంది వున్నారు. అయినాసరే, సినిమాల్లో పాటలు పాడే స్థాయికి ఎదిగింది ‘గరివిడి లక్ష్మి’.

ప్రజా యుద్ధ నౌకగా గద్దర్‌కి వచ్చిన పేరులో పదోవంతు కూడా, వంగపండు ప్రసాదరావుకి రాలేదు. మరి, గరివిడి లక్ష్మికి ఈ సినిమాతో అయినా తగిన గుర్తింపు దక్కుతుందా.? అన్నదే మిలియన్ డాలర్ క్వశ్చన్.

పీపుల్స్ మీడియా పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group