Hardik Pandya MI IPL2025.. టీమిండియాకి సంబంధించి, ‘కుంగ్ ఫూ పాండ్యా’ అంటుంటారు హార్దిక్ పాండ్యాని.
ఔను, చాలాకాలం తర్వాత టీమిండియాకి దొరికి, నిఖార్సయిన ఆల్-రౌండర్.. అది కూడా, ఫాస్ట్ బౌలింగ్ చేయగలిగే ఆల్-రౌండర్ హార్దిక్ పాండ్యా.!
మొన్ననే, ఛాంపియన్స్ ట్రోఫీలో ఇరగదీశాడు, టీమిండియా ఘనవిజయం సాధించడంలో తనదైన కీలక పాత్ర పోషించాడీ కుంగ్ ఫూ పాండ్యా.!
Rohit Sharma Hardik Pandya MI IPL2025.. ఎందుకింత చెత్త ఆట.?
మరి, హార్దిక్ పాండ్యాకి ఏమైంది.? ఐపీఎల్‌లో ఎందుకింత చెత్త ఆట ఆడుతున్నాడు.? ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యా, గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన పోరులో ఎందుకు చేతులెత్తేశాడు.?
సగటు ముంబై ఇండియన్స్ జట్టు అభిమానుల్ని వేధిస్తున్న ప్రశ్న ఇది. ఓపెనర్ రోహిత్ శర్మ ఫెయిలయ్యాడు. హిట్ మ్యాన్ అంతే, ఒక్కో మ్యాచ్‌లో నిరాశపరుస్తుంటాడు. ఒక్కోసారి చెలరేగిపోతాడు.
కానీ, హార్దిక్ పాండ్యా తన రెగ్యులర్ ఆట తీరుకి భిన్నంగా ఎందుకు, బంతుల్ని తినేసినట్లు.. పరుగులు చేయకుండా.?
హార్దిక్ పాండ్యా బ్యాట్ పట్టుకుంటే, ‘జిడ్డు’ ఆడే సమస్యే వుండదు. ఫోర్లు, సిక్సర్లతో అదరగొట్టేస్తాడు. అటువైపు, సూర్యకుమార్ యాదవ్ వున్నా, స్ట్రైక్ రొటేట్ చేయడానికి ఇష్టపడలేదు హార్దిక్.
సూర్య కుమార్‌నీ స్వేచ్ఛగా ఆడనివ్వలేదు..
నిజానికి, సూర్య కుమార్ కూడా మంచి స్ట్రోక్ ప్లేయర్. అలాంటి సూర్య కుమార్‌ని సైడ్ చేసేసి, బంతులు తినేశాడు హార్దిక్, తన సహజ ప్రవర్తనకి భిన్నంగా.
మ్యాచ్ అయిపోయాక.. ఓటమి భారంతో మాట్లాడుతూ, టాప్ ఆర్డర్ బాధ్యత తీసుకోవాలి పవర్ ప్లే సందర్భంగా.. అంటూ, ఓ కామెంట్ విసిరేసిపోయాడు హార్దిక్.
Also Read: ‘పెద్ది’గా రామ్ చరణ్.! థాంక్యూ బుచ్చిబాబూ.!
దాంతో, అంతా అవాక్కయ్యారు. హార్దిక్ కామెంట్స్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మీదనే.. అన్న చర్చ అంతటా జరుగుతోంది. అన్నట్టు, ముంబై ఇండియన్స్ ఇంకా ఖాతా తెరవ లేదు.!
ఈ పరిస్థితుల్లో ఇంత నైరాశ్యం.. అదీ, కెప్టెన్ నుంచి.. అస్సలేమాత్రం సమర్థనీయం కాదు.
ఏదిఏమైనా, చిన్న చిన్న అసంతృప్తుల్ని పక్కన పెట్టి, హార్దిక్ పాండ్యా.. ముంబై టీమ్‌ని నాయకుడిగా సమర్థవంతంగా నడపాల్సి వుంది.