బికినీ గ్లామర్ చూపించడానికే అందాల భామలు మాల్దీవులకు వెళుతున్నారా.? అన్న సందేహాలు చాలామందికి కలుగుతున్నాయి. ఔను మరి, ఎప్పుడూ ఎక్కడా బికినీల్లో కనిపించని హీరోయిన్లు కూడా, మాల్దీవులకు (Hottest Indian Glamour In Maldives) వెళ్ళేసరికి, బికినీల్లో ఒదిగిపోతున్నారంటే అలాగే అనుకోవాలి.
అయినా, స్విమ్మింగ్ పూల్‌లో దిగేటప్పుడు, చీరకట్టుకుని ఆ పని చెయ్యరు కదా.! ఇది కొన్నాళ్ళ క్రితం ఓ హీరోయిన్ సంధించిన ప్రశ్న. బికినీ గ్లామర్ గురించి ఎవరో అడ్డగోలుగా ప్రశ్నిస్తే, హీరోయిన్ చెప్పిన సమాధానమది.
సరే, ఆ సంగతి పక్కన పెడితే, కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్నా.. గ్లామరస్ బ్యూటీస్ మాత్రం ఎంచక్కా మాల్దీవులకు చెక్కేస్తూనే వున్నారు. వెకేషన్ కోసం మాల్దీవులకంటే అందమైన ప్రాంతం ఇంకేముంటుంది.? అన్నట్టు వ్యవహరిస్తున్నారు బ్యూటీస్.

మాల్దీవుల్లో ఈ అందాల సీక్రెట్ ఏంటి.? అన్న ప్రశ్నకు, ‘అక్కడి టూరిజం అభివృద్ధి కోసం, అక్కడి ప్రభుత్వాలు, టూరిజం సంస్థలు ఇచ్చే ప్రమోషనల్ ఆఫర్స్ అలాంటివి.. అందుకే అందాల భామలు అలా టెంప్ట్ అవుతుంటారు మాల్దీవులకు వెళ్లేందుకోసం..’ అనే సమాధానం వుండనే వుంది.
ఇదెంత నిజం.? అన్నది వేరే చర్చ. మొన్నీమధ్యనే కాజల్ అగర్వాల్, తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి హనీమూన్ కోసం మాల్దీవులకే వెళ్ళింది. అక్కడ పైసా కూడా ఖర్చు చేయకుండానే కాజల్, తన భర్తతో కలిసి హనీమూన్‌ని ఎంజాయ్ చేసిందంటూ చాలా పుకార్లు షికార్లు చేసేశాయ్.
ఇంతకీ, మాల్దీవుల్లో ఏముంది.? ఈ ప్రశ్నకు మళ్ళీ ప్రశ్నే సమాధానం. అక్కడ లేనిది ఏముంటుంది.? అన్నీ వుంటాయ్. ప్రకృతి అందాల నడుమ, అందాల భామలు విచ్చలవిడిగా హొయలొలికించేస్తుంటారు. కావాల్సినంత ప్రైవసీ దక్కుతుంది మన సినీ సెలబ్రిటీస్‌కి మాల్దీవుల్లో.
ఖర్చు మరీ చాలా ఎక్కువగా ఏమీ వుండదట.. కాస్తంత లగ్జరియస్‌గా ఇండియాలో ఎంజాయ్ చేయాలనుకునేవారు కూడా మాల్దీవుల్లో ఎంచక్కా కొద్ది రోజులు వెకేషన్‌ని ఎంజాయ్ చేసేసి రావొచ్చు. ఇందుకోసం అత్యద్భుతమైన ప్యాకేజీలు ఎప్పుడూ అందుబాటులోనే వుంటాయి.
దాదాపు అన్ని సీజన్లలోనూ మాల్దీవులు అందంగానే వుంటాయి. దాంతో, ఒకరి తర్వాత ఒకరు.. ఇండియన్ సినీ సెలబ్రిటీలు మాల్దీవుల్లో చక్కర్లు కొడుతూనే వుంటారు. ఆ మాటకొస్తే, ఇండియన్ సెలబ్రిటీల సందడి లేని రోజంటూ మాల్దీవుల్లో వుండదట.
ఏమాటకామాటే చెప్పుకోవాలంటే.. మాల్దీవుల్ని భూతల స్వర్గం అనేయొచ్చు. అక్కడి ప్రకృతి అందాలు అద్యద్భుతం. కాస్తంత ఖర్చు చేసే ఓపిక (Hottest Indian Glamour In Maldives) వుంటే, ఆ ప్రకృతి అందాల్ని ఓ సారి ఎంజాయ్ చేసేసి వచ్చెయ్యండి.