ఏదో ఆషామాషీగా వర్కవుట్స్ చేసేస్తామంటే కుదరదు. శరీరానికి తగినంత వ్యాయామం.. అన్నట్టుగా వర్కవుట్స్‌ని ప్లాన్ చేసుకోవాలి. శ్రీలంక సుందరి, బాలీవుడ్ తెరపై వెలిగిపోతోన్న అందాల భామ జాక్వెలైన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez Spicy Fitness Secret) అంటే ఫిట్‌నెస్ పాఠాలకి కేరాఫ్ అడ్రస్.
తన అందం, ఆరోగ్యం.. అన్నిటికీ రెగ్యులర్ వర్కవుట్స్ కారణమని చెబుతుంటుంది జాక్వెలైన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez Fitness Secret). జిమ్నాస్టిక్స్‌లో మాస్టర్ డిగ్రీ తీసుకుందా.? అన్నట్లు శరీరాన్ని విల్లులా వంచేస్తుంటుంది ఈ అందాల భామ.
అయితే, శరీరాన్ని వంచేయడం అనేది పూర్తి ఫిట్‌నెస్ వుంటేనే సాధ్యమవుతుందనీ, దానికోసం చాలా కసరత్తులు చేయాలనీ, మానసికంగా కూడా చాలా ధృఢంగా వుండాలనీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది జాక్వలైన్ ఫెర్నాండెజ్.
సినిమాలతో, కమర్షియల్ యాడ్స్‌తో ఎప్పుడూ బిజీగా వుండే జాక్వెలైన్ వర్కవుట్స్ (Jacqueline Fernandez Fitness Secret) కోసం సమయం ఎలా కేటాయిస్తుందట.? ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ, బ్రేక్ ఫాస్ట్, మీల్స్, స్నాక్స్, డిన్నర్‌కి ఎలాగైతే సమయం కేటాయిస్తామో, వర్కవుట్స్‌కి కూడా అలాగే కేటాయించాలని స్పష్టం చేసింది.
బాగా వర్కవుట్స్ చేయడం ఎంత ముఖ్యమో, తగినన్ని పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం కూడా అంతే ముఖ్యమట. అన్నిటికన్నా ముందు, శరీరతత్వాన్ని బట్టి ఎలాంటి వర్కవుట్స్ చేయాలో వైద్యులని అడిగి, అట్నుంచి వచ్చే సూచనలకు అనుగుణంగా మాత్రమే శరీరాన్ని కష్టపెట్టాలన్నది జాక్వెలైన్ (Jacqueline Fernandez Spicy Fitness Secret) ఇస్తోన్న అత్యంత విలువైన సలహా.
ఇంటర్నెట్‌లో వెతికేసి, మొబైల్ ఫోన్లలో లభిస్తోన్న యాప్స్ ద్వారా వర్కవుట్స్ గురించి తెలుసుకుని, సరైన అవగాహన లేకుండా వర్కవుట్స్ మొదలు పెట్టేస్తే, ఆ తర్వాత అనారోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదముంటుందని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. తగినంత ఆహారం, తగినంత నిద్ర, తగినంత వ్యాయామం.. ఇవన్నీ వుంటే.. అందం, ఆనందం, ఆరోగ్యం.!