Home » తెలిసో.. తెలియకో.! ఇరవై మూడేళ్ళ చిన్న పిల్లాడి నేర చరిత్ర.!

తెలిసో.. తెలియకో.! ఇరవై మూడేళ్ళ చిన్న పిల్లాడి నేర చరిత్ర.!

by hellomudra
0 comments
Ys Jagan Mavigun

YSRCP Criminality Politics.. వయసు జస్ట్ ఇరవై మూడేళ్ళు మాత్రమే.! కానీ, బోల్డన్ని క్రిమినల్ కేసులున్నాయి.

విజయవాడలో లాకప్ డెత్‌కి గురయ్యాడంటూ పెద్ద రాజకీయ దుమారం ఆ ‘చిన్న పిల్లాడి’ చుట్టూ చెలరేగింది.

ఇంతకీ, సదరు చిన్న పిల్లాడు బతికే వున్నాడా.? నిజంగానే లాకప్ డెత్ జరిగిందా.? ఇరవై మూడేళ్ళ వయసంటే, చిన్న పిల్లాడెలా అవుతాడు.?

యువకుడు, ఉత్సాహవంతుడు.. అని, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భాషలో అభివర్ణించాల్సి వుంటుంది సదరు వ్యక్తిని.

తప్పే, లాకప్ డెత్ అంటే.! తప్పు మాత్రమే కాదు, నేరం కూడా.! అయితే, లాకప్ డెత్ జరిగిందనడానికి సాక్ష్యాలు లేవు. ఆరోపణలు మాత్రమే.

వ్యవహారం కోర్టు పరిధిలో వుంది. సదరు చిన్న పిల్లాడిని కోర్టులో కొన్ని కేసుల విచారణ నిమిత్తం పోలీసులు హాజరు పర్చాల్సి వుంది.

ఆల్రెడీ కొన్ని కేసుల్లో సదరు చిన్న పిల్లాడిపై నేరాభియోగాలు నిరూపించబడ్డాయి. కొన్ని కేసుల్లో బెయిల్ లభించింది, బయటకు వచ్చాడు.. తిరిగి అరెస్టు చేసే క్రమంలో, ఈ రాజకీయ దుమారం చెలరేగింది.

ఆ చిన్న పిల్లాడి కుటుంబం తల్లడిల్లిపోతోంది తమ బిడ్డ ఆచూకీ కోసం. ఎప్పుడైతే, ఈ చిన్న పిల్లాడి విషయాన్ని పొలిటికల్ మైలేజ్ కోసం వైసీపీ టేకప్ చేసిందో, ఆ తర్వాత పొలిటికల్ హీట్ పెరిగిపోయింది.

ముఖ్యమంత్రి పిలిపించుకున్నారు ఆ చిన్న పిల్లాడి కుటుంబాన్ని.. భరోసా కూడా ఇచ్చేశారు ముఖ్యమంత్రి ‘న్యాయం’ చేస్తామని.!

అసలు, ఈ కేసులో న్యాయమంటే ఏంటి.? న్యాయస్థానంలో ఆ చిన్న పిల్లాడికి శిక్ష పడాలి నిజానికి. ఆ శిక్ష పడాలంటే, అతనిపై వున్న నేరాభియోగాలన్నీ నిరూపితమవ్వాలి.

కానీ, చూస్తున్నాం కదా.. కేసులు విచారణ న్యాయస్థానాలు.. ఈ వ్యవహారాలు ఎలా వుంటున్నాయో.? వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద అక్రమాస్తుల కేసు విచారణ ఏళ్ళ తరబడి సాగుతూనే వుంది.

ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ సదరు చిన్న పిల్లాడిపై అభియోగాలు మోపబడ్డాయి, బయట ఈ కేసు విషయమై సెటిల్మెంట్లు జరిగినట్లు తెలుస్తోంది.

అన్నట్టు, స్నేహితుడ్ని కసి తీరా చంపిన కేసు కూడా సదరు చిన్న పిల్లాడిపై వుంది. ఇంకా దురదృష్టం ఏంటంటే, ఇంత నేర చరిత్ర వున్న ఈ చిన్న పిల్లాడిని ప్రస్తావిస్తూ, అతని సామాజిక వర్గాన్ని పేర్కొంటున్నారు.

ఫలానా సామాజిక వర్గానికి చెందిన చిన్న పిల్లాడు కాబట్టి, ‘యువకుడు, ఉత్సాహవంతుడు.. అమాయకుడు’ అన్నమాట. అలాగని, వైసీపీ అంటోంది.

నేరానికీ, కులానికీ ముడిపెట్టొద్దు.. నేరస్తులకి కులం వుండదు.. అని జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్న సంగతి తెలిసిందే.

ఏంటో, చిత్రంగా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలే మరీ ఇంత అసహ్యంగా తయారవుతుంటాయ్.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group