Jagan Trolling Pawan Kalyan.. రాజకీయాల్లో విమర్శలు సహజం. ప్రత్యర్థిపై మాటల తూటాలు పేల్చడం సహజాతి సహజం.
కానీ, వీటి వల్ల ప్రయోజనమేంటి.? శూన్యం.! 2024 ఎన్నికలకు ముందు జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీద ముఖ్యమంత్రి హోదాలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు.
ఆ విమర్శల్ని ప్రజలెలా తీసుకున్నారు.? 2019 ఎన్నికలకు ముందర వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద రాజకీయ ప్రత్యర్థుల విమర్శలు, ఆయన ముఖ్యమంత్రి కాకుండా ఆపగలిగాయా.? లేదు.
అయినాగానీ, రాజకీయ పార్టీలు.. రాజకీయ నాయకులు.. వాస్తవ ప్రపంచంలోకి రారు. అదే అసలు సమస్య. రాజకీయమంటే ప్రజా సేవ అన్న విషయాన్ని ఏనాడో మర్చిపోయారంతా.
Jagan Trolling Pawan Kalyan.. రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే.. శతృవులు కాదు.!
‘మేం రాజకీయ ప్రత్యర్థులం మాత్రమే.. శతృవులం కాదు..’ అని రాజకీయ నాయకులు ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏమో.!
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో రాజకీయ నాయకులు ఒకర్నొకరు విమర్శించుకున్నారు, ట్రోలింగ్ చేయించుకున్నారు.. అంటే, అది వేరే చర్చ.
తమిళనాడు రాజకీయాల్ని ప్రస్తావిస్తూ, పవన్ కళ్యాణ్ మీద వైసీపీ చేయిస్తున్న ట్రోలింగ్ వల్ల ఎవరికి ఉపయోగం.? ఈ ట్రోలింగ్ వల్ల వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఏమైనా వస్తుందా.? ప్చ్, లేదు.
Also Read: రీల్స్ పిచ్చి తప్ప.. దేవుడంటే భయం, భక్తి.. రెండూ లేవ్.!
తెలిసీ, వైసీపీ ఎందుకు తమ సోషల్ మీడియా టీమ్ ద్వారా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద నీఛాతి నీఛంగా ట్రోలింగ్ చేయిస్తున్నట్లు.?
వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియకుండా ఇదంతా జరుగుతుందా.? ఛాన్సే లేదు. తెలియకుండానే జరుగుతోందని అనుకుందాం.. తమ కార్యకర్తల్ని వైఎస్ జగన్ మందలించాలి కదా.?
పొరుగు రాష్ట్రం తమిళనాడుకి ఆంధ్ర ప్రదేశ్ చులకనైపోతుందన్న కనీసపాటి సోయ.. వైసీపీకి లేకుండా పోతోంది.
పవన్ కళ్యాణ్ అభిమానులు కావొచ్చు, వైసీపీ కార్యకర్తలు కావొచ్చు.. వైసీపీకి కౌంటర్ ఎటాక్ ఇచ్చే క్రమంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ట్రోల్ చేస్తున్నారు. అదీ, సమర్థనీయం కాదు.
పొరుగు రాష్ట్రం.. పరువు పోతోంది..
రేప్పొద్దున్న తమిళనాడు సీఎం హోదాలో టీవీకే విజయ్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రావొచ్చు. అధికారిక కార్యక్రమం అయితే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని కలవొచ్చు.
లేదూ, ఏదన్నా ప్రైవేటు కార్యక్రమం కోసం వచ్చి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసినా కలవొచ్చు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా ఈ ట్రోలింగ్ ఏంటి.?
ప్రతి పక్ష హోదా ఆశిస్తున్న వైఎస్ జగన్ మరింత బాధ్యతాయుతమైన రాజకీయాలు చేయాల్సి వుంది. అధికార పీఠమెక్కాలనుకుంటే, తప్పుల్ని సరిదిద్దుకోవాలి.
