Home » ఔను.! ఆ పుచ్చకాయ ఏ నేరమూ చేయలేదు.!

ఔను.! ఆ పుచ్చకాయ ఏ నేరమూ చేయలేదు.!

by hellomudra
0 comments
Watermelon Mystery

Watermelon Death Mystery.. ‘ఎద్దు ఈనిందిరా..’ అని ఒకడంటే, ‘అయితే దూడని కట్టెయ్..’ అని, ఇంకొకడు అన్నాడట.! ఈ సామెత గురించి చాలామంది వినే వుంటారు.!

ఓ పుచ్చకాయ ఆత్మ ఘోష గురించే ఇక్కడ ప్రస్తావించుకుంటున్నాం. దురదృష్టవశాత్తూ, ఇదొక సున్నితమైన అంశమే అయినా, ఇలా మాట్లాడుకోవాల్సి వస్తోంది.

విషయమేంటంటే, ‘పుచ్చకాయని’ తిన్న ఓ కుటుంబం ప్రాణాలు కోల్పోయింది. దాంతో, ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది.

మరణ వార్త చుట్టూ, ఇంత కామెడీ ఏంటని అనుకుంటున్నారా.? స్వతంత్ర భారతంలో చావు కూడా పెళ్ళిలాంటిదే బ్రదర్.. అన్నాడో సినీ కవి.!

Watermelon Death Mystery.. పుచ్చకాయే ప్రాణాలు తీసిందా.?

విందు భోజనం చేసి, పుచ్చకాయ తిన్న తర్వాత, ఓ కుటుంబం అస్వస్థతకు గురైంది. ప్రాణాలు కోల్పోయింది ఆ కుటుంబం.

సదరు కుటుంబం ప్రాణాలు కోల్పోవడానికి కారణం పుచ్చకాయేనని తేల్చారంతా. అయితే, ఆ కుటుంబం మృతి చెందడానికి వేరే కారణాలు వుండొచ్చని, పోలీసులు విచారణలో వేగం పెంచారు.

ఈ క్రమంలో పోస్టుమార్టమ్ రిపోర్ట్ కూడా వచ్చింది. కుటుంబం చనిపోవడానికి కారణం పుచ్చకాయ కాదని తేల్చారు. అయితే, వారి శరీరాల్లో విషపు అవశేషాలు దొరికినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఏ రకమైన విషం.. అన్న విషయమై మరింత లోతుగా పరీక్షలు నిర్వహించగా, ‘ఎలుకల మందు’ అని నిర్ధారణ అయ్యింది. దాంతో, పుచ్చకాయని నిర్దోషిగా తేల్చారు.

ఇంతకీ, ఆ కుటుంబమెలా చనిపోయింది.?

అయితే, ఆ కుటుంబమే ఆత్మహత్యాయత్నం చేసిందా.? లేదంటే, ఎలుకల మందుతో వారిని చంపడానికి ఇంకెవరైనా ప్రయత్నించారా.? అన్న విషయమై పోలీసులు ఎటూ తేల్చలేదు. విచారణ కొనసాగుతోంది.

ఈలోగా, దేశవ్యాప్తంగా ‘పుచ్చకాయ’ అంటేనే భయాందోళనలు నెలకొన్నాయి. చాలామంది ‘పుచ్చకాయ’ పేరు చెబితే భయపడిపోయారు.

గత కొంతకాలంగా, పుచ్చకాయపై చాలా అనుమానాలొస్తున్నాయ్. కారణం, పుచ్చకాయని తేలిగ్గా కొందరు అక్రమార్కులు కల్తీ చేస్తుండడం.

ఇంజక్షన్ల ద్వారా షుగర్ సిరప్‌ని, కొన్ని రకాలైన రంగుల్ని పుచ్చకాయలోకి ఇంజెక్ట్ చేస్తున్నారు కల్తీ కేటుగాళ్ళు. ఈ క్రమంలో కొన్ని రసాయనాలూ కలిసిపోతున్నాయ్.

కల్తీ పుచ్చకాయలతో జాగ్రత్త.!

వెరసి, పుచ్చకాయలు విషపూరితమవుతున్నాయి. కల్తీ పుచ్చకాయలు తింటున్నవారిలో కొందరికి స్వల్ప అస్వస్థత కలుగుతోందిగానీ, విషయం బయటకు రావడంలేదు.

ఒక్కటి మాత్రం నిజం.. కల్తీ లేని ఆహారపదార్థమే లేదిప్పుడు. అరటిపళ్ళు సైతం కల్తీకి గురవుతున్నాయి. ప్రమాదకర రసాయనాల్లో ముంచేస్తున్నారు సహజ సిద్ధంగా దొరికే పండ్లను కూడా.

Also Read: ఇది ఆమె కథ.! కాదు, వ్యధ.!

ప్రధానంగా వేసవి కాలంలో, శరీర ఆరోగ్యానికి పుచ్చకాయ ఎంతో మేలు చేస్తుంది. ఈ కాలంలోనే ఎక్కువగా దొరుకుతాయివి. పైగా, ఖరీదు కాస్త అందుబాటులోనే వుంటుంది.

అయితే, పుచ్చకాయ ఎంపికలో జాగ్రత్త వహించాల్సిందే. ఏమాత్రం అనుమానం వున్నా రిస్క్ చేయొద్దు.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group