Thalaivi Trisha Krishnan TVK.. తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సినీ నటి త్రిష కృష్ణన్ సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయ్యింది.!
సినీ నటుడిగా వున్నప్పుడు విజయ్‌కి త్రిష అత్యంత సన్నిహితురాలు.. స్నేహితురాలు.! గత కొన్నాళ్ళుగా ఇద్దరి మధ్యా ఏదో ‘సంబంధం’ వుందంటూ కుప్పలు తెప్పలుగా గాసిప్స్ వస్తున్నాయి.
టీవీకే పార్టీ నుంచి త్రిష, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందనే ఊహాగానాల సంగతి సరే సరి. కానీ, త్రిష రాజకీయాల్లోకి రాలేదు. ఏ పార్టీ నుంచీ పోటీ చేయలేదు.
రాజకీయాలతో తనకు సంబంధం లేదనీ, విజయ్‌తో తనకు లింకులు అంటగడితే, చట్టపరంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది త్రిష.
Thalaivi Trisha Krishnan TVK.. రాజకీయాల్లోకి త్రిషని లాగారుగానీ..
మరోపక్క, విజయ్ సతీమణి అయితే ఏకంగా త్రిష మీద సంచలన ఆరోపణలు చేయడం చూశాం. పలువురు రాజకీయ నాయకులు, విజయ్‌పై రాజకీయ విమర్శలు చేసే క్రమంలో, త్రిష పేరుని లాగారు.
ఈ క్రమంలో త్రిష మీద టీవీకే ముద్ర బలంగా పడింది. త్వరలోనే త్రిష – విజయ్ పెళ్ళి.. అంటూ ప్రచారం మరింత జోరందుకుంది.. గాసిప్పుల్లో, పెళ్ళి డేట్ కూడా ఫిక్స్ చేసేశారు.

అందరూ ఊహించినట్లుగానే, ముఖ్యమంత్రిగా విజయ్ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో టీవీకే నాయకులు, త్రిషకి ప్రత్యేకమైన గౌరవం ఇచ్చారు.
అందరికీ అబివాదం చేసే క్రమంలో త్రిష బాడీ లాంగ్వేజ్ కాస్తా, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను గుర్తుకు తెచ్చింది. దాంతో, తలైవి త్రిష.. అంటూ నినాదాలు జోరందుకున్నాయి.
Also Read: ఇది ఆమె కథ.! కాదు, వ్యధ.!
ఇకపై కూడా రాజకీయాలతో తనకు సంబంధం లేదని త్రిష అనగలదా.? ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి, డిప్యూటీ సీఎం పదవిలో త్రిష కూర్చుంటుందనే ప్రచారంలో నిజమెంత.?
టీవీకే పార్టీలో త్రిష చక్రం తిప్పుతుందా.? ప్రభుత్వ వ్యవహారాల్ని ముఖ్యమంత్రిగా విజయ్ చూసుకుంటే, పార్టీని బలోపేతం చేసే బాధ్యతల్ని త్రిష తీసుకుంటుందా.? ఇలా చాలా ప్రశ్నలున్నాయ్.
