Faria Abdullaah Religion.. నటి ఫరియా అబ్దుల్లా పొడగరి సొగసరి.! అంతేనా, ఆమె డాన్సులు బాగా చేస్తుంది.
సోషల్ మీడియాలో ఆమె డాన్స్ వీడియోలు చూసే, సినిమాల్లో ఆమెకి అవకాశాలొచ్చాయని అంటుంటారు.
‘జాతిరత్నాలు’ సినిమాతో రాత్రికి రాత్రి స్టార్డమ్ సొంతం చేసుకుంది ఫరియా అబ్దుల్లా. ఆ సినిమాలో ఫరియా అబ్దుల్లా పోషించిన చిట్టి పాత్రకి భలే ఫాలోయింగ్ వచ్చి పడింది.
ప్రస్తుతం ఫరియా అబ్దుల్లా చేతిలో సినిమా అవకాశాలు బాగానే వున్నాయి. మొన్నీమధ్యనే ఓ సినిమా ప్రమోషన్ల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ‘మతం’ ప్రస్తావన వచ్చింది.
Faria Abdullaah Religion.. ఈ మత ప్రస్తావన ఎందుకొచ్చినట్లు.?
తన తండ్రి హిందూ అనీ, బాప్టిజం తీసుకుని క్రిస్టియన్గా మారారనీ, తన తల్లి ముస్లిం అనీ, అలా తన తండ్రి కూడా ముస్లిం అయ్యారనీ ఫరియా అబ్దుల్లా చెప్పుకొచ్చింది.
చిత్రమేంటంటే, తన తల్లి ఇంట్లో హిందూ దేవుళ్ళను పూజిస్తారట, ముస్లిం అయినా కూడా.! సో, అన్ని మతాలూ తన ఇంట్లో మిక్స్ అయి వున్నాయన్నది ఫరియా అబ్దుల్లా ఉవాచ.

తండ్రి హిందువు అయితే, కుమార్తె కూడా హిందువు అవ్వాలి కదా.? కానీ, కాదు.! హిందువే, కానీ, క్రిస్టియన్గా కన్వర్ట్ అయి, ఇస్లాంలోకి మారారు ఫరియా అబ్దుల్లా తండ్రి.
అయినా, ఇప్పుడీ మతాల ప్రస్తావన ఎదుకొచ్చింది.? ఫరియా అబ్దుల్లా ఎందుకింత వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఎవరిష్టం వాళ్ళది.?
ఎవరైనా ఏ మతాన్ని అయినా విశ్వసించొచ్చు..
ఈ స్వతంత్ర భారత దేశంలో ఎవరైనా, ఏ మతాన్ని అయినా అనుసరించొచ్చు.. అది వారి ఇష్టం.! అసలే, ఈ మత మార్పిడుల వ్యవహారంపై రచ్చ జరుగుతున్న రోజులివి.
ఇలాంటి పరిస్థితుల్లో మత మార్పిడి జరిగిన తన తండ్రి విషయమై ఫరియా అబ్దుల్లా ఎందుకు ప్రస్తావించుకోవాల్సి వచ్చిందో ఏమో.!

అదృష్టవశాత్తూ, ఓ మోస్తరు విమర్శలు, నెగెటివ్ కామెంట్స్ తప్ప.. ఫరియా అబ్దుల్లా మీద ఈ విషయంలో పెద్దగా ట్రోలింగ్ ఏమీ జరగలేదు.!
ఇంటర్వ్యూల్లో ఇలాంటి ప్రస్తావనలు నిజానికి అనవసరం. మీడియా కూడా ఈ తరహా విషయాల్లో ఒకింత సంయమనం పాటిస్తే మంచిదేమో.!
