Pawan Kalyan Last Cinema.. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జన సేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేస్తున్నారా.?
అసలంటూ, పవన్ కళ్యాణ్ చివరి చిత్రం.. అనే ప్రస్తావన ఎందుకొచ్చింది.? పనిగట్టుకుని, పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్‌పై ఈ దుష్ప్రచారం ఎందుకు జరుగుతోంది.?
ఏళ్ళ తరబడి ఈ నెగెటివిటీని ఇలాగే ఎందుకు బలవంతంగా రుద్దుతున్నారు.? రుద్దీ రుద్దీ ఏం సాధిస్తారు.? పచ్చ కుల మీడియా పైత్యానికి హద్దూ అదుపూ వుండదా.?
Pawan Kalyan Last Cinema.. పవన్ కళ్యాణ్ చేతిలో మూడు సినిమాలు..
నిర్మాణంలో వున్నవి మూడు సినిమాలు. అందులో ఒకటి ‘హరి హర వీర మల్లు’ కాగా, ఇంకొకటి ‘ఓజీ’, మరొకటి ‘ఉస్తాద్ భగత్ సింగ్’.
వీటిల్లో ‘హరి హర వీర మల్లు’ సినిమాకి, పవన్ కళ్యాణ్ కేవలం నాలుగైదు రోజులు కేటాయిస్తే, ఆ సినిమా పూర్తయిపోతుంది. కానీ, పవన్ కళ్యాణ్‌కి వీలు కుదరడంలేదు.

ఉప ముఖ్య మంత్రిగా ప్రభుత్వ బాద్యతలు, జన సేనానిగా జన సేన పార్టీ బాధ్యతలు.. వీటితోపాటుగా, అనారోగ్య సమస్యలు.. పవన్ కళ్యాణ్ సినిమాలకి టైమ్ కేటాయించకపోవడానికి ప్రధాన కారణాలు.
ఏదిఏమైనా, ‘హరి హర వీర మల్లు’ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తయిపోతుంది. ఎందుకంటే, చాలా తక్కువ పార్ట్ చిత్రీకరణ మాత్రమే వుంది.
పూర్తి చేయాలనే సంకల్పంతోనే వున్నారు..
‘ఓజీ’ పరిస్థితి కాస్త భిన్నం. కొంచెం ఎక్కువ రోజులే, ‘ఓజీ’కి పవన్ కళ్యాణ్ డేట్స్ కేటాయించాలి. అయినా సరే, అదీ పూర్తి చేసే ఆలోచనలోనే వున్నారు పవన్ కళ్యాణ్.
మరోపక్క, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విషయంలోనే కొంత గందరగోళం వుంది. షూటింగ్ ఇప్పటిదాకా జరిగింది చాలా తక్కువే. కొన్ని మార్పులు చేర్పులు కూడా తప్పకపోవచ్చు.

దాంతో, పూర్తిగా మళ్ళీ కొత్త సినిమా కోసం వర్క్ చేసినట్లు పవన్ కళ్యాణ్ చేయాల్సి వస్తుందనే వాదనా లేకపోలేదు. ఈ విషయమై పూర్తి స్పష్టత రావాల్సి వుంది.
ఆయా చిత్రాల నిర్మాతలతో, దర్శకులతో పవన్ కళ్యాణ్ టచ్‌లోనే వున్నారు. పవన్ కళ్యాణ్ బాధ్యతాయుతమైన పదవిలో వుండడంతో, ఆయన కష్టాన్నీ దర్శక నిర్మాతలు అర్థం చేసుకుంటున్నారు.
Also Read: నమ్మి సావండెహె.! ఈ ఊర్వశి ఆ ఊర్వశి కాదు.!
ఇవన్నీ ఓ యెత్తు.. సినిమాలు మానేయడం.. అన్న చర్చ ఇంకో యెత్తు.! సినిమాల్ని మానేసే ప్రసక్తే లేదని ఈ మధ్యన కూడా ఓ సారి పవన్ కళ్యాణ్ చెప్పారు.
ఎందుకంటే, పవన్ కళ్యాణ్‌కి ‘సంపాదన’ అంటే, అది కేవలం సినిమాల ద్వారానే. సో, సంపాదన అవసరం వున్నన్నాళ్ళూ పవన్ కళ్యాణ్‌కి సినిమాలు కావాలి. సినిమాల్ని ఆయన వదలరు.
సో, పవన్ కళ్యాణ్ చివరి సినిమా.. అనే ప్రస్తావన అసందర్భ ప్రేలాపన మాత్రమే. మరి, పచ్చ కుల మీడియా పైత్యం ఏంటంటారా.? అదో రోగం. దానికి చికిత్స లేదు.