Megastar Chiranjeevi Sikharam Tollywood.. తెలుగు తెరపై తిరుగులేని స్టార్‌డమ్ ఆయన సొంతం.! ఆయన అసలు పేరు కొణిదెల శివ శంకర వర ప్రసాద్.! స్క్రీన్ నేమ్ మెగాస్టార్ చిరంజీవి.!
మాజీ కేంద్ర మంత్రి, పద్మభూషణుడు.. చెప్పుకుంటూ పోతే చాలానే.! ‘అన్నయ్య’ అంటారు అభిమానులు.! ‘మా చిరంజీవి’ అంటారు కరడుగట్టిన మెగాభిమానులు.!
బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్.. ఇవే కాదు, కోవిడ్ కష్ట కాలంలో ప్రజల్ని ఆదుకునేందుకు ఆక్సిజన్ బ్యాంకుల్ని నెలకొల్పిన ‘శిఖరం’ చిరంజీవి అంటే.!
మరి, ఆ శిఖరాన్ని చూసి, గ్రామ సింహాలు మొరిగితే.? అదే, కొండని చూసి కుక్కలు మొరిగితే.. ఆ కొండకి చేటా.? అన్న సామెతనే ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి.!
సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడానికి, జస్ట్.. చేతిలో ఒక స్మార్ట్ ఫోన్, ఓ సోషల్ మీడియా హ్యాండిల్ వుంటే సరిపోతుంది.! ఎలాగైనా, ఎవర్నయినా ట్రోలింగ్ చేసెయ్యొచ్చు.
అలా ట్రోలింగ్ చేసేవాళ్ళకే, కష్ట కాలమొస్తే.. అనారోగ్యం బారిన పడి, రక్తం కావాల్సి వస్తే.? ప్రమాదవశాత్తూ కళ్ళు కోల్పోయినప్పుడు, కళ్ళు కావాల్సి వస్తే.? చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ నుంచి వారికీ సాయం అందుతుంది.
ఆల్రెడీ చెప్పుకున్నాం కదా.. చిరంజీవి అంటే, శిఖరం.! ఆ శిఖరాన్ని చూసి మొరగడం, గ్రామ సింహాలకి సహజం.
ఏళ్ళ తరబడి, దశాబ్దాల తరబడి, చిరంజీవిపై పిచ్చి కూతలు సర్వసాధారణమైపోయాయి. వాటిని, చిరంజీవి ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు. తన పని తాను చేసుకుంటూ పోయారు.
ఇక, చిరంజీవి సినిమాలు మానెయ్యడం బెటర్.. అని పిచ్చి కామెంట్లు చేసేవారు, చేస్తూనే వుంటారు. మెగాస్టార్ చిరంజీవి, తనదైన స్టయిల్లో హిట్లు కొడుతూనే వుంటారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చిరంజీవి అవసరం.. అనే మాట, మొన్నటికి మొన్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాతో ప్రూవ్ అయ్యింది.
సినిమాల పరంగానే కాదు, సినీ రంగంలో ఎవరికి ఏ కష్టమొచ్చినా, మొదటిగా సాయం అందేది మెగాస్టార్ చిరంజీవి నుంచే.!
వరదలొచ్చినా, ఇంకెలాంటి ఉపద్రవాలు వచ్చినా.. ప్రజలకు సాయం చేయడంలోనూ మెగాస్టార్ చిరంజీవి ముందుంటారు. దటీజ్ మెగాస్టార్ చిరంజీవి.
చిరంజీవి కుటుంబం నుంచి ఏ హీరో సినిమా వచ్చినా, అందులో ఏదో ఒక చిన్న విషయాన్ని వివాదంగా మార్చేసి, చిరంజీవిని ట్రోల్ చేయడం అనేది, ఓ ‘నయం చేయలేని రోగం’ అయిపోయింది కొందరికి.
అలాంటి గ్రామ సింహాల పట్ల కఠినంగా వ్యవహరించాలని మెగాభిమానులు కోరుకోవడంలో వింతేమీ లేదు. కానీ, చిరంజీవి తన పని తాను చేసుకుంటూ వెళుతుంటారంతే.
జై చిరంజీవ.!
