Samantha Financial Status.. అదేంటో, సమంత ఏం చెప్పినా దాని చుట్టూ పెద్ద రచ్చే జరుగుతోంది. నిజాలు ఎప్పుడూ కఠినంగా వుంటాయి మరి.. ఇతరులు వాటిని జీర్ణించుకోవాలంటే.! తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో ‘సమంత’ అన్న పేరు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. హిందీ సినీ పరిశ్రమలోకి కూడా అడుగు పెడుతోంది సమంత.
తెలుగు హీరో అక్కినేని నాగచైతన్యను (Akkineni Nagachaitanya) పెళ్ళాడినా, కొన్ని కారణాలతో అతన్నుంచి విడిపోయింది సమంత. ఆ తర్వాత నుంచీ సమంతపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతూనే వుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే సమంత (Samantha Akkineni), ఇప్పుడూ అంతే యాక్టివ్‌గా వుంటోందిగానీ.. సమంత పెట్టిన ప్రతి పోస్ట్ ఇప్పుడు వివాదాస్పదమవుతోంది.
Samantha Financial Status.. అమ్మాయిలు.. ఆర్థిక స్వాతంత్ర్యం
అమ్మాయిలు, ఆర్థిక స్వాతంత్ర్యం.. అన్న విషయమై ఓ సందర్భంలో బాలీవుడ్ నటి (ఇప్పుడు హాలీవుడ్ స్థాయికి వెళ్ళింది లెండి..) ప్రియాంక చోప్రా చెప్పిన మాటల్ని సమంత తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది. విషయమేంటంటే, ప్రియాంక చోప్రాకి (Priyanka Chopra Jonas) తొమ్మిదేళ్ళ వయసున్నప్పుడే, ‘అమ్మాయిలకు ఆర్థిక స్వాతంత్ర్యం అవసరం’ అని ఆమెకు ఆమె తల్లి చెప్పిందట.

‘ఆర్థికంగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. నువ్వు ఎవరి కుమార్తెవి.? ఎవర్ని పెళ్ళి చేసుకుంటావు.? అన్న విషయాలు అప్రస్తుతం..’ అని తన తల్లి తనకు చెప్పిందంటూ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) చెప్పిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది సమంత.
ఆర్థిక స్వాతంత్ర్యం ఈ రోజుల్లో అవసరమే..
నిజమే, ఈ రోజుల్లో అబ్బాయిలకే కాదు, అమ్మాయిలకి కూడా ఆర్థిక స్వాతంత్ర్యం అవసరం. మారుతున్న కాలానికి అనుగుణంగా మారాల్సిందే ఎవరైనా. ఆర్థికంగా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం.. అన్నది ఈ రోజుల్లో అతి ముఖ్యమైన విషయం. సమంత చెప్పింది మంచిమాటేగానీ, చాలామందికి వేరేలా అర్థమయ్యింది.
Also Read: స్పెషల్ ఐటమ్: సమంత టాపు.. అప్సర తోపు.!
నాగచైతన్యతో (Akkineni Naga Chaitanya) విడిపోయాక సమంత, పెద్దమొత్తంలో అతన్నుంచి విడాకుల భరణంగా పొందిందనీ, ఈ క్రమంలో అక్కినేని కుటుంబాన్ని సమంత దోచేసిందనీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతున్న విషయం విదితమే.
అయితే, నాగచైతన్యను పెళ్ళాడకముందే ఆర్థికంగా సమంత (Samantha Ruth Prabhu) చాలా చాలా సేఫ్ పొజిషన్‌లో వుంది. స్టార్‌డమ్ పరంగానూ సమంత (Samantha Financial Status) అప్పటికే టాప్ పొజిషన్‌లో వుందన్నది అందరికీ తెలిసిన విషయమే.