Home » అభిమానినంటూనే పవన్ కళ్యాణ్‌పై విషం చిమ్మిన రాహుల్.!

అభిమానినంటూనే పవన్ కళ్యాణ్‌పై విషం చిమ్మిన రాహుల్.!

by hellomudra
0 comments
Pawan Kalyan Rahul Ramakrishna

Rahul Ramakrishna Slams Pawan Kalyan.. సినీ నటుడు రాహుల్ రామకృష్ణ, ఒకే ఒక్క ట్వీటుతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. కాకపోతే, వివాదాస్పదమయ్యాడు.!

ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించాడు. పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న శాఖలకు సంబంధించి, కొన్ని అనుమానాలు లేవనెత్తాడు రాహుల్.

తప్పేముంది.? భారత పౌరుడిగా, పవన్ కళ్యాణ్‌ని రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడాన్ని తప్పు పట్టలేం.

కాకపోతే, ఈ క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి ‘గారు’ అని కూడా ప్రస్తావించలేకపోయాడు రాహుల్ రామకృష్ణ.

పోనీ, అదీ పెద్ద తప్పేమీ కాదనుకుందాం. ఆంధ్ర ప్రదేశ్‌కి సంబంధించిన ప్రశ్న వేసి, ‘జై తెలంగాణ’ అంటూ, రాహుల్ రామకృష్ణ తన ట్వీటుని ముగించడమే హాస్యాస్పదంగా మారింది.

Rahul Ramakrishna Slams Pawan Kalyan.. తేడా కొడుతోంది రామకృష్ణా…

సో, ఇక్కడ రాహుల్ రామకృష్ణ ఉద్దేశ్యం సుస్పష్టం. తెలంగాణ – ఆంధ్ర ప్రదేశ్ మధ్య ‘మంట’ పెట్టి, చలికాచుకోవాలని కొందరు చూస్తున్నారు. ఆ లిస్టులో రాహుల్ రామకృష్ణ కూడా చేరిపోయాడా.?

తెలంగాణకి చెందిన రాహుల్ రామకృష్ణ, ‘జై తెలంగాణ’ అంటూ, అంతకు ముందు, అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ట్వీటేశాడు. అది ఆయనిష్టం.

కానీ, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిని నిలదీస్తూ, ‘మీ అభిమానిని’ అని చెప్పుకున్నప్పుడు, ‘జై ఆంధ్ర ప్రదేశ్’ అని అనాలి కదా రాహుల్.? ఇదే ప్రశ్న పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి వస్తోంది.

మరోపక్క, జన సైనికులు తమ అధినేత తరఫున, రాహుల్ రామకృష్ణ కోరిన వివరాల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, ఆయన్ని ట్యాగ్ చేస్తున్నారు.

డేటా మొత్తం అందాక, రాహుల్ రామకృష్ణ థ్యాంక్స్ చెప్పాలి కదా.? చెప్పలేదాయె.! ‘నా వల్లే ప్రాబ్లెమ్ అయితే.. నే వెళ్ళిపోతా..’ అంటూ ఇంకో వెకిలి ట్వీటేశాడు.

ఏం జరిగిందోగానీ, రాహుల్ రామకృష్ణ చివరికి తన ట్వీటుని డిలిట్ చేసేశాడు. సో, తప్పు తెలుసుకున్నాడని అనుకోవాలి మనం.

ఇంతకీ, రాహుల్ రామకృష్ణ తాను కోలుకున్న ‘రీచ్’ పొందాడా, ఈ ప్రసహనంతో.? ఏమో, ఆయనకే తెలియాలి.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group