Home » దర్శకులదే తప్పు.! ఇకపై, సినిమాల్లో హీరోయిన్ల ఎక్స్‌పోజింగ్ ‘రద్దు’.!

దర్శకులదే తప్పు.! ఇకపై, సినిమాల్లో హీరోయిన్ల ఎక్స్‌పోజింగ్ ‘రద్దు’.!

by hellomudra
0 comments
Dimple Hayathi

Dimple Hayathi Against Vulgarity.. దర్శకులు దుర్మార్గులు.. హీరోయిన్లతో జుగుప్సాకరంగా ఎక్స్‌పోజింగ్ చేయిస్తారు. ఇందులో, హీరోయిన్ల తప్పేం లేదు.!

ఇదీ, సోషల్ మీడియా వేదికగా కొందరు నటీమణులు ఇచ్చిన తీర్పు. దర్శకుడు చెప్పాడు కాబట్టే చేశాం.. దర్శకుల ధోరణిలో మార్పులు రావాలి.. అంటున్నారు హీరోయిన్లు.

కేవలం దర్శకులు మాత్రమే కాదు, నిర్మాతల ఆలోచనా ధోరణి కూడా మాారాల్సిందే, హీరోలు కూడా, పద్ధతి మార్చుకోవాలి.. అంటున్నారు, సోషల్ మీడియా మేతావులు.

‘పెద్ది’ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ చేసిన ‘ఎక్స్‌పోజింగ్’ నేపథ్యంలో, ఇంత పెద్ద రచ్చకు తెరలేచింది. నిజానికి, తెలుగు తెరపై హీరోయిన్ల అందాల ప్రదర్శన ఇదే కొత్త కాదు.

రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన ‘పెద్ది’ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర ఒక్కటీ, ఒకింత అభ్యంతకరంగా వున్నమాట వాస్తవం.

ముందే చెప్పుకున్నట్లు, ఇంతకంటే జుగుప్సాకరమైన రీతిలో హీరోయిన్ల పాత్రల్ని చాలా సినిమాల్లో తీర్చిదిద్దారు. అప్పుడెప్పుడూ, ఈ స్థాయి నెగెటివిటీ రాలేదు.

Dimple Hayathi Against Vulgarity.. ‘పెద్ది’పై పగబట్టేశారు..

కానీ, ‘పెద్ది’ పైనే ఎందుకింత జుగుప్సాకరమైన దుమారం.? అంటే, మెగా సినిమాల మీద ఆ స్థాయిలో కుట్రలు జరుగుతుంటాయ్ మరి.!

సరే, ‘పెద్ది’ సినిమాలో అభ్యంతకర సీన్స్ విషయమై, ‘తొలగింపు’ ప్రకటన వచ్చింది.. దర్శకుడు కూడా క్షమాపణ చెప్పేశాడు. ఇక్కడితో వివాదం ముగిసిపోవాలి.

విచిత్రమేంటంటే, ఇక్కడే అసలు వివాదం మొదలైంది. నటీమణులు ఒకరొకరుగా, సోషల్ మీడియాకెక్కి, తమ తప్పేం లేదనీ, సినిమాల్లో తమని అసభ్యకరంగా చూపిస్తున్నారనీ ఆరోపిస్తుండడం గమనార్హం.

మంచిదే, ఇప్పటికైనా తెలుసుకున్నారు.. తెరపై, తాము ప్రదర్శిస్తున్నది గ్లామర్ కాదు, వల్గారిటీ అని. ఆ వల్గారిటీకి వ్యతిరేకంగా వాళ్ళే గళం విప్పుతున్నారు. ఇది కూడా ఆహ్వానించదగ్గ పరిణామమే.

ఇప్పుడు దర్శక నిర్మాతల ముందున్న ఆప్షన్ ఏంటి.? అసలంటూ, దర్శకులు చేయాల్సిన పని ఏంటి.? సినిమాల కోసం కథలు రాసుకున్నప్పుడు, హీరోయిన్ల పాత్రల విషయమై జాగ్రత్తలు తీసుకోవాలి.

సినిమాలు తీసేటప్పుడు, హీరోయిన్లను కాస్త గ్లామరస్‌గా కూాడా చూపించకూడదు. అంటే, ముందు ముందు సినిమాల్లో అసలంటూ, గ్లామర్ ప్రస్తావనే వుండకూడదన్నమాట.

ఇదేదో బావుంది కదా.! అన్నట్టు, వల్గారిటీ వ్యతిరేక ఉద్యమంలో గళం విప్పిన భామల్లో డింపుల్ హయాతీ కూడా వుంది. తెలుసు కదా, డింపుల్ హయాతీ, ఐటమ్ సాంగ్స్ కూడా చేసిందని.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group