మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి నొప్పి లేదు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి అసలే ఇబ్బంది (Ramaraju For Bheem) లేదు. కానీ, మధ్యంలో కొందరు ‘వెర్రి’ అభిమానులు మాత్రం, గుక్క తిప్పుకోకుండా సోషల్ మీడియాలో విషం చిమ్మేస్తున్నారు. నెగెటివిటీని ప్రదర్శిస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్‘ తాజా ప్రోమో రేపిన రచ్చ ఇది.
రామ్ చరణ్ వాయిస్ బాగా లేదు.. యంగ్ టైగర్ విజువల్స్ మాత్రం అదిరిపోయాయంటూ ‘రామరాజు ఫర్ భీమ్’ (Ramaraju For Bheem) ప్రోమోపై కొందరు ఘాటైన విమర్శలు చేస్తున్నారు. దానికి కౌంటర్‌గా, ‘రామ్ చరణ్ విజువల్స్ బాగాలేవు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ అదిరిపోయింది..’ అంటూ ’భీమ్ ఫర్ రామరాజు‘ (Bheem For Ramaraju) వీడియోపై ఇంకొందరు తమకు తోచిన కామెంట్స్ చేస్తున్నారు.
నిజానికి, ఇలాంటి కాంబినేషన్‌ని సెట్ చేసిన రాజమౌళికి ముందు హేట్సాఫ్ చెప్పాలి. కొందరు దురభిమానుల దురుద్దేశ్యాలు ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా మీద పడతాయని తెలిసీ, రిస్క్ చేశాడు. ఇక, రావ్‌ు చరణ్‌తోపాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్.. చేస్తున్న ప్రయత్నాన్ని కూడా ప్రత్యేకించి అభినందించాలి.
బాలీవుడ్‌లో చాలా ఎక్కువగా మల్టీస్టారర్స్ వస్తుంటాయి. మన తెలుగు నుంచీ అలాంటి ప్రయత్నాలు ఇప్పుడు మరింత జోరుగా సాగుతున్నాయి. సినిమా రేంజ్ పెరగాలంటే, మల్టీస్టారర్స్ ఎక్కువగా రావాలి. హీరోల మధ్య లేని సమస్యలు, అభిమానులకెందుకు.? అభిమానం కాస్తా దురభిమానంగా మారిపోతేనే, ఇలాంటి సమస్యలొస్తాయ్.
ఇక, ‘రామరాజు ఫర్ భీమ్’ పేరుతో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి (Young Tiger NTR) సంబంధించిన ‘ప్రోమో’ ‘ఆర్‌ఆర్‌ఆర్’ నుంచి పెర్‌ఫెక్ట్‌గా దూసుకొచ్చింది.. యూ ట్యూబ్‌లో అదరగొట్టేస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కండలు తిరిగిన శరీరానికి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) వాయిస్ ఓవర్ అదనపు అడ్వాంటేజ్‌గా మారింది.
రాజమౌళి (SS Rajamouli) మేకింగ్ స్టయిల్‌కీ, కీరవాణి (MM Keeravani) బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కీ ప్రత్యేకంగా అభినందనలు తెలపాలి. కరోనా నేపథ్యంలో సినీ పరిశ్రమ విలవిల్లాడుతున్న దరిమిలా, ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రోమో.. సినీ ప్రముఖులందరిలోనూ కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నది నిర్వివాదాంశం.
ఈ విషయాన్ని పలువురు సినీ ప్రముఖులు ‘ఆర్‌ఆర్‌ఆర్’ తాజా ప్రోమో చూశాక కుండబద్దలుగొట్టేస్తున్నారు. సినీ అభిమానులెవరైనా అటు ‘భీమ్ ఫర్ రామరాజు’ ప్రోమో విషయంలో అయినా, ఇటు ‘రామరాజు ఫర్ భీమ్’ ప్రోమో విషయంలో అయినా నెగెటివ్ కామెంట్స్ చేయబోరు.. అలా చేసినోళ్ళు అసలు సినిమాల పట్ల కనీసపాటి అవగాహన కూడా లేనివాళ్ళేనని అనుకోవాలేమో.