Home » Vijay Deverakonda బాక్సాఫీస్ బంగారు కొండ.!

Vijay Deverakonda బాక్సాఫీస్ బంగారు కొండ.!

by hellomudra
0 comments
Vijay Deverakonda Rowdy Youth Icon

విజయ్‌దేవరకొండ.. (Vijay Deverakonda Rowdy Hero) చిన్న సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. పెద్ద సంచలనంతో స్టార్‌ హీరోగా ఎదిగాడు. ఇప్పుడు విజయ్‌ దేవరకొండ అనే పేరు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో.

ఏం మ్యాజిక్‌ ఉందో మనోడిలో తెలీదు. కానీ, పసి పిల్లాడి దగ్గరి నుండీ, ముసలి అవ్వ వరకూ అందర్నీ తన బుట్టలో వేసేసుకున్నాడు. దీనంతటికీ ఒక్కటే కారణం ‘ఆటిట్యూడ్‌’. ఈ పదానికి అర్ధమే తెలియని వారు కూడా విజయ్‌ దేవరకొండను పిచ్చ పిచ్చగా అభిమానించేస్తుంటారు.

‘ఎవడే సుబ్రహ్మణ్యం’ (Evade Subrahmanyam) సినిమాలో సెకండ్‌ హీరోగా కెరీర్‌ స్టార్ట్‌ చేశాడు. తొలి సినిమాకే ఈ కుర్రాడెవరబ్బా.. సమ్‌థింగ్‌ డిఫరెంట్‌గా ఉన్నాడనే ఆలోచన రేకెత్తించాడు (Vijay Deverakonda Rowdy Hero). తర్వాత ‘పెళ్లి చూపులు’ (Pelli Choopulu) అనే సినిమాతో సోలో హీరోగా తెరంగేట్రం చేశాడు. ఇక అంతే సంచలనాలు ఆయన పోకెట్‌లో ఇరికించుకుని మరీ దాక్కుండిపోయాయి.

లో బడ్జెట్‌ మూవీ.. అస్సలు అంచనాలే లేని మూవీ.. కానీ రికార్డు స్థాయిలో వసూళ్లు కొల్లగొట్టేసింది. బాక్సాఫీస్‌ని షేక్‌ చేసేసింది. రాత్రికి రాత్రి స్టార్‌హీరో అనే ట్యాగ్‌ విజయ్‌ దేవరకొండ పేరుకు ముందు వచ్చి వాలిపోయింది. ఇక అంతే, అక్కడితో మనోడి సంచలనాలు మొదలయ్యాయ్‌.

యూత్ ఐకాన్ అర్జున్ రెడ్డి (Vijay Deverakonda Rowdy Hero)

రెండో సినిమా ‘అర్జున్‌రెడ్డి’ (Arjun Reddy).. ఈ సినిమా సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. తెలుగు సినిమా రూపు రేఖలే మార్చేసింది ‘పెళ్లి చూపులు’ సినిమా. ఇక్కడ కూడా మనోడి ఆటిట్యూడే చర్చనీయాంశమైంది. హీరోయిన్ షాలిని పాండే (Shalini Pandey)తో రౌడీ హీరో ఆన్ స్క్రీన్ రొమాన్స్.. టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యింది.

యూత్‌కి అర్జున్‌ రెడ్డి ఓ ఐకాన్‌ అయిపోయాడు ఈ సినిమాతో. విజయ్‌ దేవరకొండ పేరు కాస్తా అర్జున్‌రెడ్డిగా మారిపోయింది. అబ్బాయిలకు రగ్గ్‌డ్‌ స్టైల్‌ఐకాన్‌ అయితే, అమ్మాయిల మనసుల్లో రొమాంటిక్‌ హీరోగా పదిలంగా స్థానమేర్పర్చేసుకున్నాడు.

‘అర్జున్‌రెడ్డి’ని మర్చిపోకుండానే ‘గీత గోవిందం’ (Geetha Govindam) (Vijay Deverakonda Rowdy Hero) అంటూ వచ్చి తనలోని అమాయకత్వాన్ని బయటపెట్టాడు.

నేను చాలా మారిపోయాను మేడమ్.. అంటూ సినిమాలో హీరోయిన్‌ రష్మికా మండన్న (Rashmika Mandanna) కి చెప్పినట్టుగా చెప్పి, అందరికీ ఆ డైలాగ్‌ పాస్‌ చేశాడు. ‘అర్జున్‌రెడ్డి’ని మించి వసూళ్ల రికార్డులు కొల్లగొట్టిందీ సినిమా. దీంతో అందరికీ ప్రియమైన హీరో అయిపోయాడు విజయ్‌దేవరకొండ.

రౌడీ హీరో.. ఈ బంగారు కొండ..

సోషల్‌ మీడియాలో ‘రౌడీ’గా పాపులర్‌ అయ్యాడు. ఆయన ఫాలోవర్స్‌ అందరినీ ‘రౌడీస్‌’ (Rowdies) అని ముద్దుగా పిలుచుకుంటుంటాడు. సోషల్‌ మీడియాలో మన రౌడీకున్న ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు. ఈ ఫాలోయింగ్‌తోనే రిలీజ్‌కి ముందే డిజిటల్‌ ప్రింట్‌ మొత్తం లీకైపోయిన ‘ట్యాక్సీవాలా’ (Taxiwala) సినిమాతో సూపర్‌ హిట్‌ కొట్టి చూపించిన మనోడి స్టామినాని తట్టుకోవడం మరో యంగ్‌హీరో వల్ల కాలేదు.

‘ట్యాక్సీవాలా’ కంటే ముందొచ్చిన ‘నోటా’ (NOTA) తో డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ, పైరసీ అయిపోయిన సినిమాతో హిట్టు కొట్టి చూపించిన విజయ్‌ దేవరకొండను (Vijay Deverakonda Rowdy Hero) మెచ్చుకోకుండా ఉండలేకపోయారెవరైనా. కుర్రహీరోలు కుళ్లుకునేలా ఆటిట్యూడ్‌ చూపించాడు.

స్టార్‌ హీరోలతో మెగా ప్రశంసలు దక్కించుకున్నాడు. కష్టమంటే ఇండస్ట్రీ నుండి అందరికన్నా ముందు స్పందించాడు. ఏం చేసినా, ఎలా చేసినా తన రూటే సెపరేటన్నాడు. దటీజ్‌ విజయ్‌ దేవరకొండ.

డియర్ కామ్రేడ్.. బాక్సాఫీస్ దబిడ దిబిడే.. (Vijay Deverakonda Rowdy Hero)

ఇక ప్రస్తుతం ‘డియర్‌ కామ్రేడ్‌’ (Vijay Deverakonda Rowdy Hero) చిత్రంతో రాబోతున్నాడు. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో రష్మికా మండన్నా హీరోయిన్‌గా నటించింది. భరత్‌ కమ్మ దర్శకుడు.

ఇంతవరకూ తెలంగాణా బుల్లోడు అనిపించుకున్న విజయ్‌ దేవరకొండ ఈ సినిమాలో సరికొత్త ఆటిట్యూడ్‌తో (Vijay Deverakonda Rowdy Hero) ఆకట్టుకోనున్నాడు. అసలు సిసలు ఆంధ్రా కుర్రోడి పాత్ర పోషిస్తున్నాడు. అచ్చమైన గోదారి యాసలో డైలాగులు పలకనున్నాడు. ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేకర్స్‌ (Mythri Movie Makers) బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group