Home » ‘పెద్ది’లో ఆ పెద్ద తప్పు చేశా: ‘సుద్దపూస’ జాన్వీ కపూర్

‘పెద్ది’లో ఆ పెద్ద తప్పు చేశా: ‘సుద్దపూస’ జాన్వీ కపూర్

by Mudra369 Editorial Desk
0 comments
Janhvi Kapoor

Janhvi Kapoor Slams Peddi Controversy.. సినిమాల్లో హీరోయిన్లు గ్లామరస్‌గా కనిపించడం కొత్తేమీ కాదు.! సినిమా అంటేనే గ్లామర్.. గ్లామరంటేనే సినిమా.!

వెండితెరపై హీరోయిన్లను గ్లామరస్‌గా చూపించడం ఇప్పుడు కొత్తగా మొదలైందేమీ కాదు.! టూ పీస్ బికినీలు.. టాప్ లెస్ సీన్లు.. వాట్ నాట్.. చెప్పుకుంటూ పోతే, కథ చాలా పెద్దది.!

కానీ, ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ మీద జరిగినంత ట్రోలింగ్, ఇంకే హీరోయిన్ మీదా జరగలేదనడం అతిశయోక్తి కాదేమో.!

అసలు ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్‌ని అంతలా ట్రోల్ చేయాల్సిన అవసరమేమొచ్చింది.? దర్శకుడు బుచ్చిబాబు సన, ఎందుకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.?

Janhvi Kapoor Slams Peddi Controversy.. పెయిడ్ ట్రోలింగ్ ‘పెద్ది’కి సంకటం..

పనిగట్టుకుని నడిచిన పెయిడ్ ట్రోలింగ్‌లో భాగంగానే, జాన్వీ కపూర్ పేరుని బజారుకీడ్చారు కొందరు. ‘పెద్ది’ సినిమా విజయాన్ని అడ్డుకోవాలని చేసిన కుట్ర అది.

దర్శకుడు బుచ్చిబాబు సన, వేగంగా స్పందించాడు.. సినిమాలోంచి, జాన్వీ కపూర్ ‘గ్లామరస్ సీన్స్’కి కత్తెర వేసేశాడు. అయినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందనుకోండి.. అది వేరే సంగతి.

Janhvi Kapoor
Janhvi Kapoor

ఈ విషయమై ఇప్పటిదాకా మౌనం దాల్చిన జాన్వీ కపూర్, తాజాగా ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో మౌనం వీడింది. తాను ఆ సీన్స్‌లో నటించకుండా వుండి వుండాల్సిందని అభిప్రాయపడింది.

ఇకపై, దర్శకులు చెప్పే సీన్స్ విషయమై ఆత్మవిమర్శ చేసుకుంటాననీ, వల్గారిటీ విషయంలో హద్దులు పెట్టుకుంటాననీ జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది.

తప్పు జరిగింది.. ఎవర్నీ బాధ్యుల్ని చేయలేను..

తనను అంత వల్గర్‌గా చూపించి వుండకూడదనీ, అందులో తన తప్పు కూడా వుందనీ, ఏ ఒక్కరినో బాధ్యుల్ని చేయలేనని జాన్వీ కపూర్ వ్యాఖ్యానించింది.

నిజానికి, జాన్వీ కపూర్ ఇంతలా స్పందించాల్సిన అవసరం లేదు. అంతకు ముందూ జాన్వీ కపూర్ చాలా సినిమాల్లో ఇంతకంటే వల్గర్‌గా నటించింది.. ఇకపైనా నటిస్తుంది.!

Janhvi Kapoor
Janhvi Kapoor

ముందే చెప్పుకున్నాం కదా.. సినిమా అంటే గ్లామర్.. గ్లామరంటేనే సినిమా అని.! ‘టాక్సిక్’ సినిమాలో కైరా అద్వానీ గ్లామర్ విషయమై ఎంత రచ్చ జరిగిందో తెలుసు కదా.?

‘సౌత్ సినిమాల్లో కెమెరా యాంగిల్స్ విషయమై ముందుగానే మాకు తగిన సమాచారం వుండదు’ అని జాన్వీ కపూర్ వ్యాఖ్యానించడం అస్సలేమాత్రం సమంజసంగా లేదు.

జాన్వీ కపూర్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్ చేసే ఫొటోలు ఎంత వల్గర్‌గా వుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా.! మరి, ఆ ‘వల్గర్ యాంగిల్స్’ విషయంలో తప్పెవరిది.?

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group