Home » ముద్రాభిప్రాయమ్.! కూటమి కుప్పకూలితేనే వైసీపీకి ఊపిరి.!?

ముద్రాభిప్రాయమ్.! కూటమి కుప్పకూలితేనే వైసీపీకి ఊపిరి.!?

by Mudra369 Editorial Desk
0 comments
Chandrababu Jagan Pawan Kalyan

Jagan Vs Pawankalyan Chandrababu.. స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల లొల్లి, విపక్షం వైసీపీకి అడ్వాంటేజ్‌గా మారుతోందా.? ఆ సంగతి, ఎన్నికల ఫలితాలతో తెలుస్తుంది.!

ప్రస్తుతానికైతే, ఏకగ్రీవాల పరంగా వైసీపీలో నిస్తేజం అలముకుంది.! స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి అడ్వాంటేజ్.. అన్నది అందరికీ తెలిసిన విషయమే.

వైసీపీ హయాంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో టీడీపీ చేతులెత్తేసింది.. కానీ, సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితమైపోయి, అధికారానికి దూరమయ్యింది.

సో, స్థానిక ఎన్నికల్ని బట్టి రాజకీయ పార్టీల బలాబలాల్ని అంచనా వేయలేం. అయితే, విపక్షాలు స్థానిక ఎన్నికల్లో బలంగా నిలబడటం అనేది కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపుతుంది.

వచ్చే నెల మొదటి వారంలో స్థానిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్, ఆ తర్వాత ఫలితాలు.. ఇదంతా ఓ ప్రసహనం.!

Jagan Vs Pawankalyan Chandrababu.. స్థానిక ఎన్నికల లెక్కలు వేరు..

ఆ ఫలితాలతోనే, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ముందు ముందు ఎలాంటి ఈక్వేషన్స్ మారతాయన్నదానిపై చూచాయిగా ఓ అంచనాకి రావొచ్చు.

అయితే, కూటమి పార్టీల మధ్య ‘లొల్లి’ ఖచ్చితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అంశమే.

పులివెందులలో స్థానిక ఎమ్మెల్యే వైఎస్ జగన్, పార్టీ శ్రేణులకు అండగా నిలబడే క్రమంలో చేసిన వ్యాఖ్యలు.. పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్నిచ్చాయి.

కానీ, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ బలపడాలంటే, వైఎస్ జగన్ వున్నపళంగా బెంగళూరుని వీడి, ఆంధ్ర ప్రదేశ్‌లో మకాం పెట్టాల్సి వుంటుంది.

అన్నట్టు, పులివెందులలో ఏకగ్రీవాల విషయమై వైసీపీకి కూటమి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కనీ వినీ ఎరుగని రీతిలో ఇక్కడ ఏకగ్రీవాలు జరిగాయ్.

భ్రమల్లోంచి జగన్ బయటకు వచ్చేదెప్పుడో.!

కళ్ళు మూసుకుంటే ఏళ్ళు గడచిపోతాయ్.. అని రెండేన్నరేళ్ళుగా వైఎస్ జగన్ చెబుతూనే వున్నారు. ఇంకో రెండున్నరేళ్ళు కూడా ఆయన కళ్ళు మూసుకోమనే చెబుతారు పార్టీ శ్రేణులకి.

ముందుగా వైఎస్ జగన్ కళ్ళు తెరిచి, వాస్తవ పరిస్థితుల్ని చూడాలి. స్థానిక ఎన్నికల్ని వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని వుంటే, ఈపాటికే రాష్ట్రంలో పొలిటికల్ హీట్ రాజుకుని వుండేది.

విపక్షం ఎంత నిస్తేజంగా వుంటే, అది అధికార పక్షానికి అంత బలం.! ఈ చిన్న లాజిక్కుని వైఎస్ జగన్ విస్మరిస్తున్నారు.

ఆలస్యం అమృతం విషం.! వైఎస్ జగన్ ఇప్పటికే చాలా ఆలస్యం చేసేశారు. కూటమిలో కుంపట్లు రాజుకున్నట్టే రాజుకుని, ఆ వెంటనే చల్లారిపోతున్నాయి.

సో, కూటమి కుప్పకూలిపోవడం అనేది జరిగే పని కాదు.! అదే, వైసీపీ గత రెండున్నరేళ్ళూ యాక్టివ్‌గా వుంటే.. పరిస్థితి ఇంకోలా వుండేది.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group