Nazriya Nazim Fahadh Goldy.. తమిళ, మలయాళ చిత్రాలతో పాపులర్ అయిన నటి నజ్రియా.
తెలుగులో నాని హీరోయిన్‌గా వచ్చిన ‘అంటే సుందరానికి’ సినిమాలో నటించింది. ఈ సినిమాకి రిలీజ్‌కి ముందు చాలా హైప్ ఇవ్వడం జరిగింది.
అది కూడా నజ్రియా (ఆమె పోషించిన పాత్ర ‘లీల’ పేరుతో) యాంగిల్ నుంచే. అఫ్‌కోర్స్.! సినిమా రిలీజయ్యాకా తుస్‌మనిందనుకోండి.
సోషల్ మీడియాలో మలయాళ చిత్ర పరిశ్రమకి సంబంధించి నజ్రియాకి రికార్డు స్థాయిలో ఫాలోవర్స్ వున్నారు. అదే ఆమెకున్న క్రేజ్‌కి రీజనేమో.
సినిమాల్లో అయితే, పెద్దగా ఫేమ్ సంపాదించిందేమీ లేదనుకోండి. చాలా లెక్కగా మాత్రమే సినిమాల్లో నటించింది కూడా. అప్పుడెప్పుడో ‘రాజా రాణి’ సినిమాలో నటించింది.
కంటిన్యూస్‌గా సినిమాలు చేయదు. కానీ, సినిమా చేసినప్పుడు నజ్రియా ట్రెండింగ్ అయ్యే విధానం చూస్తే నాటి, నేటి హీరోయిన్లకు జలస్ కలగక మానదు.
Nazriya Nazim Fahadh Goldy.. అదే నజ్రియా మ్యాజిక్.!
లేటెస్ట్‌గా తెగ ట్రెండ్ అవుతోంది నజ్రియా. ప్రస్తుతం సూర్యతో తమిళంలో ఓ సినిమాలో నటిస్తోంది. నజ్రియా సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి ఏ పోస్ట్ వచ్చినా అది పెద్ద వైరల్ అవుతూ వస్తుంది.
తాజాగా నజ్రియా పోస్ట్ చేసిన గోల్డెన్ అవుట్ ఫిట్ పోజులు ట్రెండింగ్ అవుతున్నాయ్. చాలా సింపుల్‌గా కంఫర్ట్‌గా వుండే కాస్ట్యూమ్స్‌నే నజ్రియా ప్రిఫర్ చేస్తుంటుంది.

అలాంటి అవుట్ ఫిట్‌లోనే.. అయితే, గోల్డ్ కలర్ కావడంతో ధగ ధగ మెరిసిపోతోంది నజ్రియా. ఫెయిర్ ప్లీట్స్‌తో వున్న ఓ గోల్డెన్ లాంగ్ ఫ్రాక్ ధరించి ప్రత్యేకంగా ఫోటో షూట్ చేయించుకుంది నజ్రియా.
కంప్లీట్ గోల్డెన్ కలర్ కావడం.. అలాగే, ట్రెండీగా కనిపిస్తూనే వెస్ట్రన్ టచ్ కూడా ఈ ఫ్రాక్‌లో కనిపిస్తుండడంతో చాలా ఎలిగెంట్ లుక్స్ యాడ్ అయ్యాయ్.
సింపుల్ మేకప్ అండ్ మిడిల్ పార్టిషన్ హెయిర్ స్టైల్‌తో నజ్రియా లుక్స్ వావ్.! అనేలా వున్నాయ్ ఈ పిక్స్‌లో. దాదాపు 12 ఏళ్ల తర్వాత తమిళ సినిమాలో నజ్రియా కనిపిస్తోంది ఇప్పుడే.
డిజిటల్ ఎంట్రీ..
తమిళ హీరో సూర్య ఈ సినిమాలో మేల్ లీడ్ పోషిస్తున్నారు. దీపావళి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే త్వరలోనే నజ్రియా డిజిటల్ ఎంట్రీ కూడా ఇవ్వబోతోంది.
‘ది మద్రాస్ మిస్టరీ – ఫాల్ ఆఫ్ ఏ సూపర్ స్టార్’ అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్లాట్‌ఫామ్ పైకి అడుగుపెట్టబోతోంది.
సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూనే మరోవైపు తన భర్త ఫహాద్ పాజిల్‌తో కొన్ని సినిమాలను కూడా నిర్మించింది నజ్రియా.

వెరీ టాలెంటెడ్. కేవలం నటనకే పరిమితం కాకుండా అప్పుడప్పుడూ సింగింగ్ టాలెంట్ కూడా ప్రదర్శిస్తుంటుంది నజ్రియా.
పెళ్లి చేసుకుని, పిల్లల్ని చూసుకుంటూనే సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది నజ్రియా.