Home » కమ్మరోళ్ళ గంగ.. నువ్వు కూడానా శర్వానంద్.?

కమ్మరోళ్ళ గంగ.. నువ్వు కూడానా శర్వానంద్.?

by Mudra369 Editorial Desk
0 comments
Sharwanand Bhogi

Sharwanand Bhogi.. మన తెలుగు హీరోలు కత్తి పట్టకపోతే, తలలు తెగ నరక్కపోతే.. అసలు హీరోయిజమే లేనట్టు లెక్క.! ఇదీ, ఇప్పుడు తెలుగు సినిమా సరికొత్త మాస్ ఈక్వేషన్.!

పది మందిని నరుకుతారో.. పాతిక మందినే నరుకుతారో.. వందల మందినే నరికేస్తారో.. నరకడమైతే తప్పనిసరి.!

తెరపై తలలు తెగ నరకడానికి సంబంధించి, క్రియేటివిటీ చూపిస్తున్నారు డైరెక్టర్లు, యాక్షన్ కొరియోగ్రాఫర్లు.! లీటర్ల కొద్దీ కాదు.. గ్యాలన్ల కొద్దీ బ్లడ్ కలర్ సినిమాల్లో వాడేస్తున్నారు.

అలా తెగ నరికే హీరోల లిస్టులోకి హీరో శర్వానంద్ కూడా చేరిపోయాడు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బోగీ’ సినిమాలో శర్వానంద్ ‘నరుకుడు’ ఎలా వుంటుందో మరి.!

తాజాగా, ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ టీజర్ వదిలారు.! మహాదేవికి బలివ్వాల్సిందేనని ఊరి పెద్ద పట్టుబడతాడు.. అది జరగనివ్వబోనని ‘గంగ’ (శర్వానంద్) ప్రతినబూనతాడు.

కట్ చేస్తే, టీజర్ చివర్లో వేలాడదీసిన ఓ వ్యక్తి తలని తెగనరికేస్తాడు ‘కమ్మరోళ్ళ గంగ’.. అదే, మన హీరో శర్వానంద్.

నిజానికి, టీజర్ చాలా బాగా డిజైన్ చేశారు. అనుపమ పరమేశ్వరన్ వాయిస్, ఆమె గెటప్ చాలా బాగా కుదిరాయి.

శర్వానంద్ చాలా మంచి నటుడు.. ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతాడు. ‘కమ్మరోళ్ళ గంగ’ పాత్రలో పెర్‌ఫెక్ట్‌గా సూటయ్యడానిపిస్తోంది.

ఈ మధ్య చాలా సినిమాల్లో ఇదే తరహా కంటెంట్ కనిపిస్తోంది. బ్యాక్‌డ్రాప్‌లో చిన్న చిన్న మార్పులంతే. దేవుడు, బలి.. ఈ కాన్సెప్ట్‌తో ఇప్పటికే చాలా సినిమాలొచ్చేశాయి.

దేవుళ్ళ పేర్లు, ఆ దేవుళ్ళ ఆకారాలు.. ఆ దేవుళ్ళకి సంబంధించిన ఆచారాలు, పద్ధతులు.. ఇవే కాస్త మారుతున్నాయి.

ఇదిలా వుంటే, మొన్నీ మధ్యనే నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సినిమాలో నరుకుడు వ్యవహారంపై ప్రేక్షకులు పెదవి విరిచిన సంగతి తెలిసిందే.

ఫ్యామిలీ ఆడియన్స్ అయితే, థియేటర్లకు రావడం మానేస్తున్నారు ఈ ‘హింస’ కారణంగా. అయితే, వాళ్ళతో మాకేంటి పని.? అన్నట్లుగా ‘ఎ’ సర్టిఫికెట్ తెచ్చేసుకుంటున్నారు ఆయా సినిమాల నిర్మాతలు.

శర్వానంద్ – సంపత్ నందిల ‘భోగీ’ కూడా ‘ఏ’ కేటగిరీలోకే వెళుతుందా.? అంతేగా మరి.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group