Sushmita Sen Heart Attack.. కుర్రాళ్ళ గుండెల్లో తుపాన్లు రేపే అందాల భామ సుస్మితా సేన్ తానే తీవ్రమైన హార్ట్ ఎటాక్ బారిన పడటమేంటి.?
బాలీవుడ్ నటి సుస్మితా సేన్ అంటే, అందానికే కాదు.. వివాదాలకీ కేరాఫ్ అడ్రస్.
‘అసలు నాకు పెళ్ళితో పనేంటి.?’ అంటూ ఇద్దరు అమ్మాయిల్ని దత్తత తీసుకున్న వ్యవహారం నుంచి, లేటు వయసులో ప్రేమాయణం వరకూ.. సుస్మితా సేన్ అంటే సమ్‌థింగ్ స్పెషల్.!
Sushmita Sen Heart Attack.. ఆమె చెప్పేదాకా..
ఇటీవల సుస్మితా సేన్ తీవ్ర గుండె పోటుకు గురయ్యింది. ఆ విషయాన్ని ఆమె ప్రకటించేదాకా ఎవరికీ తెలియదు. ఆసుపత్రిలో చేరింది. ఆమెకు స్టెంట్స్ కూడా వేశారు.
గుండె పోటు.. ఒకప్పుడు చాలా అరుదైన వ్యవహారం.! కానీ, ఇప్పుడది సర్వసాధారణం.!
స్మోకింగ్ అలాగే ఆల్కహాల్‌కి దూరంగా వుండటం మంచిది.!
తగిన వైద్య పరీక్షలు ప్రతి ఒక్కరూ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిప్పుడు.!
కాలంతోపాటే పరిగెత్తే క్రమంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్న సమాజం నెత్తిన గుండె పోటు పెను ప్రమాదకారిగా మారుతోంది.!
Mudra369
ప్రస్తుతం సుస్మితా సేన్ కోలుకుంది. తనకు గుండె పోటు వచ్చిన విషయాన్ని స్వయంగా వెల్లడించిన సుస్మితా సేన్, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా వుండాలని సూచించింది.
సుస్మితా సేన్ హెల్త్ కాన్షియస్. ఎప్పుడూ ఫిట్‌గా వుంటుంది. కాకపోతే, స్మోకింగ్ ఎక్కువ. ఆల్కహాలిక్ కూడా.! బహుశా ఇవే ఆమెకి గుండె పోటు రావడానికి కారణాలై వుండొచ్చు.
Also Read: ప్రియురాల్ని కొట్టిన ప్రియుడు.! నాగశౌర్య నిలదీశాడుగానీ.!
ఈ మధ్యకాలంలో చిన్న వయసులోనే ‘గుండె పోటు’ అనే విషయం సర్వసాధారణంగా మారిపోతోంది. కోవిడ్ తదనంతర దుష్పరిణామంగా దీన్ని చెప్పుకోవాలేమో.!
ఒత్తిడి లేని జీవితం ముఖ్యం..
సుస్మితా సేన్ మాత్రం, మంచి ఆహారం.. ఒత్తిడి లేని జీవితం.. ఇవన్నీ గుండె పోటుకి దూరంగా వుంచుతాయని చెబుతోంది.
ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నది సుస్మితా సేన్ చేస్తోన్న సూచన. ఓ సెలబ్రిటీగా సుస్మితా సేన్ ఎప్పటికప్పుడు తగిన వైద్య పరీక్షలు చేయించుకుంటూనే వుంటుంది కదా.? అంటే, అదంతే.!