Home » ఫొటో కామెంట్: త్రివిక్రమ్ రాస్తోంటే.. శ్రీనిధి శెట్టి మురిసిపోతోంది.!

ఫొటో కామెంట్: త్రివిక్రమ్ రాస్తోంటే.. శ్రీనిధి శెట్టి మురిసిపోతోంది.!

by Mudra369 Editorial Desk
0 comments
Trivikram Srinivas Srinidhi Shetty Adarsha Kutumbam

Trivikram Srinidhi Adarsha Kutumbam.. ‘ఆయనెప్పుడూ రాస్తూనే వుంటారు..’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఇంట్రెస్టింగ్ ఫొటోల్ని షేర్ చేసింది శ్రీనిధి శెట్టి.

ఫొటోల్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా బిజీగా రాసుకుంటూ కనిపిస్తున్నారు కదా.!

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్, శ్రీనిధి శెట్టి కాంబినేషన్‌లో ‘ఆదర్శ కుటుంబం’ పేరుతో ఓ సినిమా తెరకెక్కతోంది.

సినిమాకి సంబంధించిన పోస్టర్స్, ప్రమోషనల్ వీడియోస్.. ఆల్రెడీ సినిమాపై హైప్‌ని పెంచేశాయ్. త్రివిక్రమ్ సినిమా అంటే ఆ మాత్రం బజ్ వుంటుంది మరి.!

సినిమా షూటింగ్ ఓ వైపు శరవేగంగా జరుగుతోంటే, సెట్స్‌లో ఇంకా త్రివిక్రమ్ కూర్చుని రాస్తూనే వున్నారా.? అన్న కోణంలో కొన్ని సెటైర్లు పడుతున్నాయి.

అయితే, త్రివిక్రమ్ శ్రీనివాస్ వర్కింగ్ స్టైల్ అంతే.! పెర్‌ఫెక్షన్ కోసం ప్రయత్నిస్తుంటారాయన. చివరి నిమిషంలో కూడా అవసరమైతే మార్పులు చేర్పులు చేయడానికి ప్రయత్నిస్తుంటారు.

Trivikram Srinivas Srinidhi Shetty Adarsha Kutumbam
Trivikram Srinivas Srinidhi Shetty Adarsha Kutumbam

ఏం చేసినా, అంతిమంగా ప్రేక్షకులకు మంచి ఔట్‌పుట్ ఇవ్వాలనే కదా.! డైలాగ్స్ విషయంలో అయితే, త్రివిక్రమ్ అస్సలు రాజీ పడరు.

ఎందుకంటే, త్రివిక్రమ్ సినిమాల్లోని డైలాగ్స్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ వుంది మరి.! ఆ స్పెషల్ అభిమానగణాన్ని మెప్పించాలంటే, త్రివిక్రమ్ ప్రతిసారీ తన కలం పదునుని నిరూపించుకోవాల్సిందే.

త్రివిక్రమ్ – వెంకీ కాంబినేషన్‌లో సెటైరికల్ డైలాగ్స్ భలే పేలబోతున్నాయ్ థియేటర్లలో.! ఇక, శ్రీనిధి శెట్టి కామెడీ టైమింగ్ కూడా అదిరిపోయిందనేది ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం.!

కాగా, ‘కేజీఎఫ్’ బ్యూటీ శ్రీనిధి శెట్టి, తెలుగులో పెద్ద హిట్ కోసం ఎదురుచూస్తోంది చాన్నాళ్ళగా. ఆ హిట్ ఆమెకి ‘ఆదర్శ కుటుంబం’ సినిమాతో వస్తుందా.? వేచి చూడాల్సిందే.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group