Ghattamaneni Maheshbabu.. లోకులు.. కాకులు.. అంటారు పెద్దలు.! మరి, సోకాల్డ్ మేధావుల సంగతేంటి.? వాళ్ళని మూర్ఖులని అనాలేమో.!
ప్రముఖ సినీ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అర్థరాత్రి సమయంలో ఆయనకు ‘స్ట్రోక్’ రాగా, వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో వైద్య చికిత్స అందించగా, పరిస్థితి విషమించి కృష్ణ తుదిశ్వాస విడిచారు. ఆసుపత్రి సిబ్బంది ఆయన్ని ఎంతో జాగ్రత్తగా, గౌరవంగా చూసుకుంది.
ఘట్టమనేని కృష్ణ కుటుంబ సభ్యులు, ఆయన అనారోగ్య సమస్యలేవీ బయటకు పొక్కనివ్వకుండా జాగ్రత్తపడింది. తద్వారా కృష్ణ చాలా చాలా గౌరవప్రదమైన మరణాన్ని పొందారు.
Ghattamaneni Maheshbabu తప్పు చేశావ్ మహేషూ.!
కృష్ణ పార్దీవ దేహాన్ని ఎందుకు మహేష్ తన ఇంటికి తీసుకెళ్ళలేదు.?
ఎందుకు తమకు చెందిన ప్రైవేటు స్థలాల్లో కృష్ణ అంత్యక్రియల్ని ఆయన తనయుడు మహేష్ నిర్వహించలేకపోయారు.?

బాబోయ్.! ఇవేం ప్రశ్నలు.? ఇంకా చాలానే వున్నాయ్. కృష్ణ వీలునామా మహేష్‌కి నచ్చలేదట.. అందుకే, మహేష్ తన తండ్రి కృష్ణకు తగిన గౌరవం ఇవ్వలేదంటూ ప్రచారాలు.!
ఈ మూర్ఖుల నోళ్ళు మూతపడేదెలా.?
సినీ నటుడు కృష్ణ అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరిగాయి. కేవలం మహేష్ మొండిపట్టుదలతోనే అలా జరిగిందంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు సోకాల్డ్ మేధావులనబడే మూర్ఖులు.
ముదిరిపోయింది.. పిచ్చి పీక్స్‌కి వెళ్ళిపోవడమంటే అదే మరి.! తన తండ్రి తనకు దేవుడితో సమానమని మహేష్ చాలా సందర్భాల్లో చెప్పారు.
తండ్రి మీద వున్న ప్రేమాభిమానాల్ని, గౌరవాన్నీ.. మహేష్ ప్రత్యేకంగా చాటుకోవాలా.? తన తండ్రి అంత్యక్రియల్ని ఎక్కడ నిర్వహించాలన్నదానిపై మహేష్ తనదంటూ ఓ ఆలోచన చేయకూడదా.?
అసలు ఆ కుటుంబంలో ఎవరైనా దీన్ని వ్యతిరేకించారనడానికి రుజువులేమైనా వున్నాయా.? ఇవేవీ సదరు మూర్ఖపు మేధావులకు అనవసరం. బురద చల్లడమే వాళ్ళ పని. బట్టకాల్చి ముఖాన పడెయ్యడమే మేధావితనం.
Also Read: వ్యూహం.! శపథం.! ఆర్జీవీ మార్కు సినీ భ్రష్టత్వం.!
కానీ, ఈ సోకాల్డ్ మేధావులు.. మహేష్ కంటే ఎక్కువగా కృష్ణ మీద ప్రేమాభిమానాలు కలిగినట్లు చెత్త విశ్లేషణలు చేసేస్తున్నారు. నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.?