Raashi Khanna.. ఇలాంటి అందమైన లేడీ బాస్ మనకీ వుంటే బావుండనిపిస్తుంది కదూ.! అదే మరి బాస్ లేడీ గెటప్ స్పెషాలిటీ.!
‘ఊహలు గుసగుసలాడే’ అంటూ తన అందంతో కుర్రకారు మనసు దోచేసిన బొద్దుగుమ్మ రాశీఖన్నా. నిజానికి ‘జోరు’ రాశీఖన్నాకి తొలి సినిమా.
అయితే, ‘ఊహలు గుసగుసలాడే’ మంచి గుర్తింపు తీసుకొచ్చింది. మొదట్లో కాస్త బొద్దుగా కనిపించిన రాశీఖన్నా.. ఆ తర్వాత సైజ్ జీరోలోకి వచ్చేసింది.
తన జీరో సైజ్ సోకుల్ని బికినీల్లో కట్టి పడేసి మరీ ప్రదర్శనకు పెట్టేసింది. దాంతో, సోషల్ మీడియా వేదికగా రాశీఖన్నాకి ఫాలోవర్లు పోటెత్తేశారు.

అలా పెంచుకున్న ఫాలోయింగ్‌ని కంటిన్యూ చేస్తూ వచ్చింది అందాల గ్లామ్ షూట్స్‌తో. తాజాగా బాస్ లేడీ పోజలతో సోషల్ మీడియాని హీటెక్కిస్తోందీ అమ్మడు.
క్యూట్ అండ్ హాట్‌గా కవ్వించేసిందిగా.!
స్కై బ్లూ కలర్ సూట్లో క్లాస్‌గా అందాలారేసింది రాశీ ఖన్నా. ఈ ఫోటోలకు నెటిజన్లు తెగ ఫిదా అయిపోతున్నారులే.
Also Read: జాక్వెలైన్, నోరా ఫతేహి.! ఇరువురు భామల కౌగిలిలో.!
ఇక, సినిమాల విషయానికి వస్తే, తెలుగుతో పాటూ, తమిళ, హిందీ భాషల్లోనూ బాగానే రాణిస్తోంది రాశీఖన్నా. ఆ మధ్య బాలీవుడ్ సిరీస్ ‘రుద్ర’ కోసం క్యూట్ అండ్ హాట్‌గా తనలోని నెగిటివ్ షేడ్స్‌ని బయట పెట్టింది రాశీఖన్నా.
ప్రస్తుతం మరో హిందీ వెబ్ సిరీస్‌తో పాటూ, ‘యోధ’ అను సినిమాతోనూ బాలీవుడ్లో బిజీగా గడిపేస్తోందీ ఢిల్లీ భామ రాశీఖన్నా.