Shalini Pandey విజయ్ దేవరకొండ సరసన ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో నటించిన షాలినీ పాండే గుర్తుందా.? ఆమెకు అదే తొలి సినిమా.
అప్పటినుంచి ఇప్పటిదాకా.. పలు సినిమాల్లో అయితే నటించిందిగానీ, ఇంకా తొలి చిత్రం ‘అర్జున్ రెడ్డి’ పేరుతోనే ఆమెకు గుర్తింపు కొనసాగుతోంది. మళ్ళీ అలాంటి ఇంకో హిట్టు ఆమె ఖాతాలో లేదు మరి.!
నిజానికి, షాలిని పాండే, ఈ మధ్య సినిమాల్లో ఎక్కడా కనిపించడంలేదు. కళ్యాణ్ రామ్‌తో ఓ సినిమా, రాజ్ తరుణ్‌తో మరో సినిమా.. ఇలా కొన్ని సినిమాల్లో కనిపించినా, అవి ఆమెకు ప్రత్యేకంగా ఇచ్చిన గుర్తింపు ఏమీ లేదు.
Shalini Pandey సినిమాల్లేకపోతేనేం..
సినిమాల్లేకపోయినా షాలినీ పాండే వార్తల్లో బాగానే కనిపిస్తుంటుంది. అందుక్కారణం.. ఇదిగో ఇలాంటి ఫొటోలే.

సోషల్ మీడియా అంటే తనకు అస్సలు గిట్టదని గతంలో చెప్పిన షాలినీ, ఆ సోషల్ మీడియా కారణంగానే తన ఉనికిని చాటుకుంటోంది.
ఎప్పటికప్పుడు హాట్ అండ్ వైల్డ్ ఫొటోల్ని షేర్ చేస్తూ.. తన పేరు వార్తల్లో వుండేలా చూసుకుంటోంది షాలినీ పాండే.
Also Read: Swara Bhaskar: పెళ్ళైన నెల రోజులకి..!
భలే తెలివైంది కదూ.! ఏమాటకామాటే చెప్పుకోవాలి.. ఈ అందం అడవికాచిన వెన్నెలైపోతోందనడం అతిశయోక్తి కాదు.
అస్సలేమాత్రం నటన రానోళ్ళు కూడా స్టార్లయిపోతున్నారు.. అందం, అభినయం.. అన్నీ వున్నా.. ఫాఫం ఈ బ్యూటీకి టైమ్ కలిసి రావడంలేదంతే.!