Sunny Leone Big Zero.. ఆమె పేరు వినబడితే చాలు అదో వైబ్రేషన్. అంతలా ఆమె తన ఇమేజ్‌ని సినీ జనంలో క్రియేట్ చేసుకుంది. భాషతో సంబంధం లేదు, ఆమెకు పిచ్చ పిచ్చగా క్రేజ్ వుంది. ఆమె ఎవరో కాదు, బాలీవుడ్ హాటెస్ట్ బ్యూటీ సన్నీలియోన్.
సన్నీలియోన్.. ఈ పేరుకు అస్సలు పరిచయమే అక్కర్లేదు. అంతలా ఆమెకు క్రేజ్ దక్కడానికి కారణమేంటీ.? కేవలం గ్లామరే.
అందాల ఆరబోతకు ఆమె క్వీన్. ఆ విషయంలో ఆమె తర్వాతే ఇంకెవరైనా అదే సన్నీలియోన్ ఐడెంటిటీ.
బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చే టైమ్‌కి నాకు అస్సలు యాక్టింగ్ రాదు.. డాన్స్ కూడా సరిగ్గా రాదు. ఓన్లీ గ్లామర్.. అదొక్కటే చూసి నన్ను సినిమాల్లోకి తీసుకొచ్చారు.. అంటూ సన్నీలియోన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
Sunny Leone Big Zero.. సక్సెస్.! అంత ఈజీగా వచ్చేయలేదు
గ్లామర్ తారగా ఎంట్రీ ఇచ్చిన తర్వాతే నటిగా తానేంటో ప్రూవ్ చేసుకోవాలన్న కసి పెరిగిందట సన్నీలియోన్ (Sunny Leone)లో. ఆ దిశగా తనను తాను డెవలప్ చేసుకున్నానని చెప్పింది.

మొదట్లో హిందీ కూడా మాట్లాడడం సరిగ్గా వచ్చేది కాదట సన్నీలియోన్‌కి. ఆ తర్వాతే మెల్ల మెల్లగా ఇండియన్ సినిమాని అర్ధం చేసుకోవడం మొదలుపెట్టాను..
అంటూ తన కెరీర్ మొదట్లో జరిగిన విషయాల్ని గుర్తు చేసుకుంది.
సక్సెస్ అనేది అంత ఈజీగా వచ్చేయలేదంటోంది సన్నీలియోన్. అందుకోసం తాను చాలా కష్టపడ్డానని చెప్పింది. అందుకు చాలా టైమ్ కూడా పట్టిందంటోంది.
కొంచెం ఇష్టం కొంచెం కష్టం..
ఇప్పుడు సన్నీలియోన్ ముగ్గురు పిల్లలకు తల్లి అన్న సంగతి తెలిసిందే. మొదట్లో ఓ ఆడబిడ్డను దత్తత తీసుకున్న సన్నీలియోన్, సరోగసీ ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లయ్యింది.
ఓ వైపు ఫ్యామిలీ, పిల్లలను చూసుకుంటూనే సినిమాల్లో నటించడం ఒకింత కష్టంగానే వున్నప్పటికీ అంతకన్నా ఇష్టంగా వుందని చెబుతోందీ గ్లామర్ దేవత.
Also Read: Nabha Natesh Charlie Chaplin ఇస్మార్ట్ పాపా.. ఈ ‘కళ’ కూడానా?
అలాగే, ఇప్పుడు ఏదైనా తనకు ఫ్యామిలీ తర్వాతే.. అంటోంది సన్నీలియోన్ (Sunny Leone). ఫ్యామిలీ ఫస్ట్.. తర్వాతే సినిమాలైనా ఇంకేదైనా అని ఖచ్చితంగా చెప్పేస్తోంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సన్నీలియోన్ చెప్పిన ఈ మాటలు ఆమెను ఆరాధించేవాళ్లను ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తూనే మరోవైపు ఆ అభిమానాన్ని మరింత రెట్టింపు చేసేలా వుండడం విశేషం.